India Corona Cases: భారత్‌లో శరవేగంగా కరోనా కేసులు.. తాజాగా 58 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు

India Corona Cases: కరోనా మహమ్మారి దేశంపై మళ్లీ పంజా విసురుతోంది. ఒక వైపు ఒమిక్రాన్‌ కేసులు, మరో వైపు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తగ్గుముఖం..

India Corona Cases: భారత్‌లో శరవేగంగా కరోనా కేసులు.. తాజాగా 58 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు
Follow us
Subhash Goud

|

Updated on: Jan 05, 2022 | 10:32 AM

India Corona Cases: కరోనా మహమ్మారి దేశంపై మళ్లీ పంజా విసురుతోంది. ఒక వైపు ఒమిక్రాన్‌ కేసులు, మరో వైపు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా.. మళ్లీ తీవ్ర రూపం దాల్చుతుండటంతో జనాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక తాజాగా భారత్‌లో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. కరోనా వైరస్‌ శరవేగంగా విస్తరిస్తూ మళ్లీ విజృంభిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 13,88,647 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో కొత్తగా 58,097 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు దేశంలో 3.50 కోట్ల మంది వైరస్‌ బారిన పడ్డారు. రెండు రోజులుగా 30వేలకుపైగా కొత్త కేసులు నమోదు అవుతుండటంతో ఆందోళన నెలకొంది.

తాజాగా ఒక్కసారి 58వేలకుపైగా చేరడంతో ముందు రోజు కంటే 55 శాతం వరకు ఎక్కువ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,014,004 ఉండగా, ఇప్పటి వరకు 3,43,21,803 మంది రికవరీ అయ్యారు. కొత్తగా 534 మంది కరోనాతో మరణించగా, ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనాతో 4,82,551 మంది మరణించారు.  ఇక దేశంలో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు కూడా మెల్లమెల్లగా పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు 2,135 మందిలో ఈ కొత్త వేరియంట్‌ ఉన్నట్లు గుర్తించారు అధికారులు. అందులో 828 మంది కోలుకున్నారు. అత్యధికంగా మహారాష్ట్రలో 653 కేసులు నమోదు కాగా, ఢిల్లీలో 464కు చేరింది. ఈ కొత్త వేరియంట్‌ అన్ని రాష్ట్రాల్లో విస్తరించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 147.72 కోట్ల కోవిడ్ టీకాలు వేసినట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి:

Omicron: తెలుగు రాష్ట్రాల్లో పంజా విసురుతున్న ఒమిక్రాన్.. భారీగా పెరుగుతున్న కేసులు

Corona Cases: అగ్రరాజ్యంపై కోవిడ్‌ రక్కసి.. ఒక్కరోజు పది లక్షల మందికి కరోనా