Viral: ఎయిర్‌పోర్ట్‌లో దిమ్మతిరిగే సీన్.. ప్రయాణికుల బ్యాగులో కదులుతూ కనిపించిన ఆకారం.. ఆపి చెక్ చేయగా..
థాయ్‌లాండ్ నుంచి ఇద్దరు ప్రయాణికులు ఫ్లైట్ లో ముంబై వచ్చారు. ఎయిర్‌పోర్ట్ లో దిగిన అనంతరం ట్రాలీ బ్యాగులతో టిప్ టాప్‌గా బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు.. ఈ క్రమంలోనే.. ఏదో తేడాగా కనిపించడంతో వెంటనే కస్టమ్స్ అధికారులు అప్రమత్తమయ్యారు.. వెంటనే వారిని ఆపి చెక్ చేయగా.. షాకింగ్ సీన్ కనిపించింది..
థాయ్‌లాండ్ నుంచి ఇద్దరు ప్రయాణికులు ఫ్లైట్ లో ముంబై వచ్చారు. ఎయిర్‌పోర్ట్ లో దిగిన అనంతరం ట్రాలీ బ్యాగులతో టిప్ టాప్‌గా బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు.. ఈ క్రమంలోనే.. ఏదో తేడాగా కనిపించడంతో వెంటనే కస్టమ్స్ అధికారులు అప్రమత్తమయ్యారు.. వెంటనే వారిని ఆపి చెక్ చేయగా.. షాకింగ్ సీన్ కనిపించింది.. ఐదు అరుదైన మొసళ్లను తరలిస్తూ ఇద్దరు ప్రయాణికులు పట్టుబడ్డారు. విదేశాల నుంచి వన్యప్రాణులను స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేసినట్లు ముంబై కస్టమ్స్ వెల్లడించింది..
కైమాన్ మొసళ్లను అక్రమంగా ట్రాలీ బ్యాగుల్లో దాచి పెట్టి స్మగ్లింగ్ చేస్తూ.. ముంబై విమానాశ్రయంలో చిక్కారని కస్టమ్స్ అధికారులు తెలిపారు. అరుదైన ఐదు కైమాన్ మొసళ్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేశామని.. వన్యప్రాణుల స్మగ్లింగ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ముంబయి కస్టమ్స్ అధికారులు తెలిపారు.
ముంబై కస్టమ్స్‌లోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU) శుక్రవారం అర్థరాత్రి బ్యాంకాక్ (థాయ్‌లాండ్) నుండి విస్తారా విమానంలో వచ్చిన ఇద్దరు ప్రయాణికులను అడ్డగించిందని కస్టమ్స్ అధికారి తెలిపారు. ఐదు మొసళ్లను బ్యాగుల్లోని టూత్‌పేస్ట్ బాక్సుల్లో దాచి ఉంచినట్లు గుర్తించామన్నారు.
On Sep 27, 2024, CSMI Airport, Mumbai Customs,made a significant case of smuggling of wildlife and recovered five Juveniles of Caiman Crocodiles. These crocodiles were concealed inside a box kept in the trolley bags of the passengers. 02 passengers were arrested. pic.twitter.com/9mQDr6Hp8M
— Mumbai Customs-III (@mumbaicus3) September 28, 2024
5 నుంచి 7 అంగుళాల పొడవు ఉన్న ఈ మొసళ్లు నిర్జలీకరణం, అస్వస్థతతో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వాటిని పరీక్షించి చికిత్స చేస్తున్నారు. అయితే.. అమెరికాకు చెందిన కైమాన్స్ జాతి మొసళ్లు.. సరస్సులు, నదులు, చిత్తడి నేలలలో కనిపిస్తాయి. ఈ అరుదైన మొసళ్లను స్మగ్లింగ్ చేయడం ఆందోళన కలిగిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..