AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Collector Marksheet: టెన్త్‌ ఇంగ్లిష్‌లో 35, గణితంలో 36 మార్కులు.. కలెక్టర్‌ మార్క్‌ల సర్టిఫికేట్‌ వైరల్‌

Collector Marksheet:బోర్డు ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఓ ఐఏఎస్ అధికారి తన 10వ తరగతి మార్కుషీట్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశారు. గుజరాత్‌లోని..

Collector Marksheet: టెన్త్‌ ఇంగ్లిష్‌లో 35, గణితంలో 36 మార్కులు.. కలెక్టర్‌ మార్క్‌ల సర్టిఫికేట్‌ వైరల్‌
Subhash Goud
|

Updated on: Jun 14, 2022 | 8:29 AM

Share

Collector Marksheet:బోర్డు ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఓ ఐఏఎస్ అధికారి తన 10వ తరగతి మార్కుషీట్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశారు. గుజరాత్‌లోని భరూచ్ జిల్లా కలెక్టర్ తుషార్ డి సుమేరా 10వ తరగతి బోర్డు ఫలితాల్లో ఉత్తీర్ణత మార్కులను మాత్రమే సాధించగలిగారు. ఆయనకు ఇంగ్లిష్‌లో 35, గణితంలో 36 మార్కులు వచ్చాయి. ఛత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన 2009 బ్యాచ్ IAS అధికారి అయిన అవనీష్ శరణ్ రిపోర్ట్ కార్డ్‌తో పాటు ఆయన ఫోటోను జత చేసి ట్విట్టర్‌లో షేర్ చేశారు.

పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలు కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కరోనా సమయంలో సరిగ్గా విద్యాభ్యాసం కొనసాగకపోవడంతో విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. ఎలాంటి ఫలితాలు వస్తాయోనన్న టెన్షన్‌కు గురవుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తును బోర్డు ఫలితాలు నిర్ణయిస్తాయనే విషయం అందరికి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

అయితే బోర్డు పరీక్ష ఫలితాలు విద్యార్థి కెరీర్‌లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ, అది భవిష్యత్తును నిర్ణయించదని ఈ వైర‌ల్ వార్త తెలియ‌జేస్తుంది. కేవ‌లం మార్కులతో విద్యార్థిలో ఉన్న ప్రతిభను నిర్ణయించుకోవడం కష్టమని తెలుస్తుంది. పదో తరగతిలో మార్కులు తక్కువ వచ్చినంత మాత్రనా.. భవిష్యత్తు బాగుండదని అనుకోవడం పొరపాటేనని ఈ కలెక్టర్‌ మార్కుల షీట్‌ చూస్తేనే తెలిసిపోతుంది. తక్కువ మార్కులు వచ్చినా.. పట్టుదల ఉంటే మున్ముందు మంచి మార్కులతో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నది దీన్ని బట్టి చూస్తే తెలుస్తుంది. 10వ తరగతి పరీక్షల్లో ఒక IAS సాధించిన మార్కుల‌ను చూస్తే ఈ మాట‌లు న‌మ్మక‌త‌ప్పదు. అప్పట్లో ఈ మార్కుల‌ను చూసి, తాను విజయం సాధించలేడని అప్పుడే అనుకొని ఉంటే, ఇలా గుజ‌రాత్‌లో క‌లెక్టర్‌గా ఉండేవాడు కాదు కాదు.

తన మార్కు షీట్‌ను పంచుకుంటూ, భరూచ్ కలెక్టర్ తుషార్ సుమేరా మాట్లాడుతూ..తాను 10వ తరగతి బోర్డు పరీక్షలలో ఉత్తీర్ణత మార్కులను మాత్రమే సాధించానని,100 మార్కులలోఅతను ఇంగ్లీషులో 35, గణితంలో 36 మాత్రమే సాధించాడు. ప్రస్తుతం కలెక్టర్‌ టెన్త్‌ మార్కుల షీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఒక‌ప్పుడు ఈ మార్కుల చూసి, అతని ప్రాంతంలోని ప్రజలు మాత్రమే కాకుండా పాఠశాలలో కూడా అతను తన జీవితంలో పైకిరాలేడ‌ని చాలా మంది అన్నట్లు ఇందులో రాసుకొచ్చారు కలెక్టర్‌. ఇంగ్లిష్‌లో 35, మ్యాథ్స్‌లో 36, సైన్స్‌లో 100కి 38 మార్కులు తెచ్చుకున్న ఇప్పటి క‌లెక్టర్‌ ఊరి మొత్తానికే కాదు, ఆ పాఠశాలలో ఉన్నవారందరికీ స‌రైన స‌మాధానం చెప్పాడ‌ని నెటిజ‌న్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి