AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Train Accident: గూడ్స్ ట్రైన్ ఢీ కొని గున్న ఏనుగు సహా మూడు ఏనుగులు మృతి.. విషాదంలో వన్యప్రాణుల ప్రేమికులు

ఈ దారుణ సంఘటన రాజభట్‌ఖావా-కాల్చిని సెక్షన్‌లో జరిగిందని అధికారి తెలిపారు. ఈ ప్రాంతం ఉత్తర బెంగాల్‌లోని బక్సా టైగర్ రిజర్వ్ సమీపంలో ఉంది. ఈ సంఘటన జరిగిన ప్రదేశం వన్య ప్రాణులకు హాని కలిగించే సంఘటనలను నివారించడానికి ఏర్పాటు చేసిన 'ఇన్‌ట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్' (IDS) పరిధిలోకి రాదని ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే (ఎన్‌ఎఫ్‌ఆర్) సీనియర్ అధికారి వెల్లడించారు.

Train Accident: గూడ్స్ ట్రైన్ ఢీ కొని గున్న ఏనుగు సహా మూడు ఏనుగులు మృతి.. విషాదంలో వన్యప్రాణుల ప్రేమికులు
West Bengal
Surya Kala
|

Updated on: Nov 27, 2023 | 9:54 PM

Share

పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దువార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని రాజభట్ఖావా అటవీ ప్రాంతంలో మూడు ఏనుగులు రైలు పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాయి. గున్న ఏనుగు సహా మూడు ఏనుగులు మరణించాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ, రైల్వే ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అలీపుర్‌దూర్‌ నుంచి సిలిగురికి వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాల మీదకు హఠాత్తుగా ఏనుగుల గుంపు వచ్చింది. ఈ ప్రమాదం జరిగిన ప్రదేశం ‘ఇన్‌ట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్’ (ఐడీఎస్) పరిధిలోకి రాదని ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే (ఎన్‌ఎఫ్‌ఆర్) సీనియర్ అధికారి వెల్లడించారు.

వార్తా సంస్థ పిటిఐ ప్రకారం ఈ దారుణ సంఘటన రాజభట్‌ఖావా-కాల్చిని సెక్షన్‌లో జరిగిందని అధికారి తెలిపారు. ఈ ప్రాంతం ఉత్తర బెంగాల్‌లోని బక్సా టైగర్ రిజర్వ్ సమీపంలో ఉంది. ఈ సంఘటన జరిగిన ప్రదేశం వన్య ప్రాణులకు హాని కలిగించే సంఘటనలను నివారించడానికి ఏర్పాటు చేసిన ‘ఇన్‌ట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్’ (IDS) పరిధిలోకి రాదు.

గూడ్స్ రైలు ఢీకొని ఏనుగులు మృతి

ఉదయం 7.20 గంటలకు గూడ్స్ రైలు అలీపుర్‌దువార్‌ నుంచి సిలిగురికి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని ఎన్‌ఎఫ్‌ఆర్ అధికారి ‘పిటిఐ-భాష’కు తెలిపారు. గూడ్స్ రైలు ఢీకొనడంతో పిల్ల ఏనుగు సహా మూడు ఏనుగులు మృతి చెందాయి. ఈ ఘటన అనంతరం గూడ్స్ రైలు డ్రైవర్‌, కో-డ్రైవర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు అధికారి తెలిపారు. గూడ్స్ రైలు కొద్దిసేపు అక్కడే నిలిచిపోయింది. ఏనుగుల మృతితో వన్యప్రాణుల ప్రేమికుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇవి కూడా చదవండి

చొరబాట్లను గుర్తించే వ్యవస్థ లేకపోవడంతో మరణం సంభవించింది

అటవీ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరగకుండా ‘ఇన్‌ట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్’ (ఐడీఎస్)ను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ రైళ్ల వల్ల కలిగే ప్రమాదాల నుంచి ఏనుగులను కాపాడుతుంది. అలీపుర్‌దూర్‌ రైల్వే డివిజన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఐడీఎస్‌ను ఏర్పాటు చేశామని, అలీపుర్‌దూర్‌-కాల్చిని సెక్షన్‌లో ఇంకా ఇన్‌స్టాల్ చేయలేదని అధికారి పీటీఐకి తెలిపారు. ఎన్‌ఎఫ్‌ఆర్‌లోని లుమ్‌డింగ్, రంగియా విభాగాలతో పాటు మొత్తం సెక్షన్‌ను ఐడిఎస్ పరిధిలోకి తీసుకురావడానికి టెండర్ల ప్రక్రియ జరుగుతోందని అధికారి తెలిపారు. అంతేకాదు ‘ఇన్‌ట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్ ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో ఇప్పటి వరకూ వన్య ప్రాణులకూ ప్రమాదం జరిగిన సంఘటలు లేవని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌