AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake: భూకంపంతో వణికిన జమ్మూకశ్మీర్‌, ఒకేరోజు మూడుసార్లు భూప్రకంపనలు

ఈ భూంకంప కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని తెలుస్తోంది. ఇక హిందూ కుష్‌ ప్రాంతంలో తరుచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. దీనికి కారణం హిందూ కుష్‌ పర్వతాలు రెండు ప్రధాన టెక్టోనిస్‌ ప్లేట్ల సరిహద్దులో ఉన్నందున తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈ భూప్రకపంనలు దేశ రాజధాని ఢిల్లీని తాకాయి. హిందూకుష్ ప్రాంతంలో ఉత్తరం వైపు 36.38 డిగ్రీల అక్షాంశంలో, 70.77 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద భూకంప కేంద్రం ఉందని తెలిపారు. భూకంపం కారణంగా ఢిల్లీ సరిహద్దుతోపాటు పాకిస్థాన్‌...

Earthquake: భూకంపంతో వణికిన జమ్మూకశ్మీర్‌, ఒకేరోజు మూడుసార్లు భూప్రకంపనలు
Delhi Earthquake
Narender Vaitla
|

Updated on: Aug 06, 2023 | 6:40 AM

Share

జమ్మూకశ్మీర్‌ భూప్రకంపనలతో వణికి పోయింది. శనివారం రాత్రి సమయంలో భూమి కంపించింది. శనివారం ఒక్క రోజు ఏకంగా మూడు సార్లు భూమి కంపించింది. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ ప్రకారం.. భూకంపం కేంద్రం ఆఫ్గనిస్థాన్‌లోని హిందూకుష్‌ , ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. ఇదిలా ఉంటే జమ్మూకశ్మీర్‌లో మొదటి భూకంపం ఉదయం 8.36 గంటలకు 129 కిలోమీటర్ల లోతులో నమోదైంది. రిక్టర్‌ స్కేల్‌పై 4.8గా రికార్డ్‌ అయ్యింది. ఇక రెండో భూకంపం రాత్రి 10.24 గంటలకు సంభవించింది. ఈ భూకంప కేంద్రం కాబూల్‌కు ఈశాన్యంగా 75 కిలోమీటర్ల లోతులో ఉంది. రిక్టర్ స్కేల్పై 5.2గా నమోదైంది.

ఇదిలా ఉంటే ఈ భూంకంప కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని తెలుస్తోంది. ఇక హిందూ కుష్‌ ప్రాంతంలో తరుచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. దీనికి కారణం హిందూ కుష్‌ పర్వతాలు రెండు ప్రధాన టెక్టోనిస్‌ ప్లేట్ల సరిహద్దులో ఉన్నందున తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. యూరేపియ‌న్‌, ఇండియ‌న్ టెక్టోనిక్ ఫ‌ల‌కాల మ‌ధ్య రాపిడి త‌లెత్త‌డంతో భూకంపం సంభ‌విస్తున్న‌ది. ఇదిలా ఉంటే ఈ భూప్రకపంనలు దేశ రాజధాని ఢిల్లీని తాకాయి. హిందూకుష్ ప్రాంతంలో ఉత్తరం వైపు 36.38 డిగ్రీల అక్షాంశంలో, 70.77 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద భూకంప కేంద్రం ఉందని తెలిపారు. భూకంపం కారణంగా ఢిల్లీ సరిహద్దుతోపాటు పాకిస్థాన్‌, జమ్ముకశ్మీర్‌ సరిహద్దుల భూమి కంపించింది. భూమి కంపించడంతో ఢిల్లీ, నోయిడా పరిసర ప్రాంతాల ప్రజలు భయందోళనకు గురయ్యారు. భూమి కంపించడానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక భూకంపం ప్రభావం ఘజియాబాద్‌, గౌతమ్ బుద్ధ నగర్, కర్నాల్, రోహ్‌తక్, గుర్గావ్, బులంద్‌షెహర్, మీరట్‌లో కూడా కనిపించింది. భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లలో నుంచి రోడ్ల మీదికి వచ్చారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లకు బీటలు వారాయి. భూకంపానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను కొందరు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అర్థరాత్రి ప్రజలు రోడ్లపైనే జాగారం చేశారు. మళ్లీ ఎప్పుడూ భూమి కంపిస్తుందో అన్న భయంతో ఇళ్లలోకి వెళ్లడానికి వెనుకడుగు వేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు