Gujarat inmates: గుజరాత్ లో 10, 12 వ తరగతి పరీక్షలు రాయనున్న 27 మంది ఖైదీలు
పది, పన్నెండవ తరగతి బోర్డ్ పరీక్షలు విద్యార్థులు రాయడం మాములే. అయితే ఇందులో కొత్తేమిటి అని అనుకుంటున్నారా. అసలు విషయం ఏంటంటే గుజరాత్ లోని దాదాపు 27 మంది ఖైదీలు పది పన్నెండవ తరగతి వార్షిక పరీక్షలు రాయబోతున్నారు.

పది, పన్నెండవ తరగతి బోర్డ్ పరీక్షలు విద్యార్థులు రాయడం మాములే. అయితే ఇందులో కొత్తేమిటి అని అనుకుంటున్నారా. అసలు విషయం ఏంటంటే గుజరాత్ లోని దాదాపు 27 మంది ఖైదీలు పది, పన్నెండవ తరగతి వార్షిక పరీక్షలు రాయబోతున్నారు. లాజ్పోర్ సెంట్రల్ జైల్లో శిక్షఅనుభవిస్తున్న ఖైదీలు ఈ పరీక్షలు రాసేందుకు గుజరాత్ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ రోజు నుంచే అక్కడ జీఎస్ఈబీ వార్షిక పరీక్షలు నిర్వహిస్తోంది. పదవ తరగతి పరీక్షలు 14 మంది, 12 వ తరగతి పరీక్షలు 13 మంది ఖైదీలు రాయబోతున్నారు.
ఈ ఏడాది దాదాపు 16.49 లక్షల మంది విద్యార్థులు పదవ, పన్నెండవ పరీక్షలు రాయనున్నారు. 1,763 సెంటర్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు విద్యార్థుల భద్రతపై చర్యలు తీసుకుంటున్నారు. పదవ తరగతి పరీక్షలు మార్చి 28 న ముగియనుండగా, పన్నెండవ తరగతి పరీక్షలు మార్చి 29 న ముగియనున్నాయి. ఇదిలా ఉండగా జైల్లో ఉన్న ఖైదీలు పరీక్షల కోసం రోజు చదువుతున్నారని సీనియర్ జైలర్ రాత్వా తెలిపారు.
