Coronavirus: ఒక్కరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినా 20 ఇళ్లకు సీల్.. ప్రభుత్వం కీలక నిర్ణయం
Coronavirus: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కరోనా విషయంలో కఠిన చర్యలు తీసుకుంటోంది. ఒక వైపు వ్యాక్సినేషన్ ముమ్మరం చేస్తూనే మరో వైపు వైరస్ కట్టడికి కఠినమైన చర్యలు...
Coronavirus: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కరోనా విషయంలో కఠిన చర్యలు తీసుకుంటోంది. ఒక వైపు వ్యాక్సినేషన్ ముమ్మరం చేస్తూనే మరో వైపు వైరస్ కట్టడికి కఠినమైన చర్యలు చేపడుతోంది. కోవిడ్ వ్యాప్తి చెందకుండా పలు నియమ నిబంధనలు అమలు చేస్తోంది యూపీ ప్రభుత్వం. ఏ ప్రాతంలోనైనా ఒక్క వ్యక్తికి కరోనా సోకినట్లు తెలిస్తే ఆ చుట్టుపక్కల గల 20 ఇళ్లకు సీల్ వేస్తూ ఆ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటిస్తున్నారు అధికారులు.
అదే విధంగా కేసులు అత్యధికంగా నమోదైన ప్రాంతాలను గుర్తించి అక్కడ వైరస్ మరింతగా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తగిన చర్యలు చేపడుతున్నారు. ఇదే విధంగా కరోనా బాధితులు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండే విధంగా అధికారులు చూస్తున్నారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేంద్రకుమార్ తివారీ జిల్లా అధికారులు, పోలీసులకు పలు సూచనలు చేశారు. ఇక అపార్ట్‌మెంట్ లో కరోనా పాజిటివ్ వ్యక్తి ఉంటే.. ఆ అపార్ట్‌మెంట్ మొత్తాన్ని సీల్ చేయనున్నారు. 14 రోజుల పాటు క్వారంటైన్ పూర్తయిన తర్వాతే దానిని కంటైన్‌మెంట్ జోన్ జాబితా నుంచి తొలగించనున్నారు. ఇలాంటి కఠినమైన నిబంధనలు విధిస్తూ చర్యలు చేపడుతున్నారు యూపీ అధికారులు.
కాగా, ఇప్పటి దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఆందోళన వ్యక్తం అవుతోంది. గతంలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి కొన్ని రోజుల నుంచి తీవ్రంగా పెరుగుతున్నాయి. ఒక వైపు వ్యాక్సినేషన్ కొనసాగుతుంటే మరోవైపు పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.
ముమ్మరం చేసిన వ్యాక్సినేషన్ కాగా, దేశంలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఒక వైపు వ్యాక్సినేషన్ కొనసాగుతుంటే మరో వైపు కరోనా విజృంభిస్తోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 7.5 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ మందికి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అందులో 6.5 కోట్ల మంది కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారని, మరో కోటి మందికిపైగా రెండో డోస్ తీసుకున్నారని తెలిపారు.
అయితే ఒక వైపు వైపు వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా, మరో వైపు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనే కొత్త కేసుల సంఖ్య ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నదని తెలిపింది.
ఇవీ చదవండి: మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం… రాష్ట్రవ్యాప్తంగా పాక్షిక లాక్‌డౌన్.. హోటళ్లు, షాపింగ్ మాల్స్ మూసివేత..!
సెలూన్లు, లాండ్రీలకు ఉచిత విద్యుత్.. సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ.. ఏప్రిల్ 1 నుంచి అమలు..