ఇదెక్కడి గుండెధైర్యం సామీ.. పోలీస్ స్టేషన్‌కే ఎసరుపెట్టిన కేటుగాళ్లు.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా?
గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలోని విర్సాద్ పోలీస్ స్టేషన్‌లో రూ.8,60,000 విలువైన సుమారు 144 కిలోల గంజాయి దొంగిలించారు. విర్సాద్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శోభనా వాఘేలా గత శనివారం పోలీస్ స్టేషన్‌కు చేరుకోగానే డిటెన్షన్ రూమ్‌కు వెళ్లి చూడగా.. గదిలో సీజ్ చేసి ఉన్న గంజాయి స్టాక్ కు..
ఎక్కడైనా చోరీ జరిగితే వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తాం. అదే పోలీస్ స్టేషన్ లో చోరీ జరిగితే ఏం చేస్తారు. ఆ కేసును వారే దర్యాప్తు చేసుకోవాలి. అయినా పోలీస్ స్టేషన్ లో చోరీ చేయడానికి ఏముంటాయనుకుంటున్నారా. కొంతమంది కేటుగాళ్లు కళ్లు పడ్డాయంటే ఏవైనా మాయమవ్వాల్సిందే.అదే పోలీస్ స్టేషన్ లో చోరీ జరిగితే అదో పెద్ద వార్త కూడా. ఎక్కడా చోరీలు జరగకుండా నియంత్రించేందుకు చర్యలు తీసుకునేది పోలీసులు. అటువంటి పోలీస్ స్టేషన్ కు రక్షణ లేదంటే ఆశ్చర్యపోవల్సిన విషయమే. అయినా పోలీస్ స్టేషన్ నుంచి దుండగులు ఏమి తీసుకెళ్లారో తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. పోలీసులు తమ తనిఖీల్లో స్వాదీనం చేసుకుని సీజ్ చేసిన గంజాయిని గుర్తు తెలియని దుండగులు పోలీస్ స్టేషన్ నుంచి దోచుకెళ్లారు. అది కూడా కిలో, రెండు కిలోలు కాదు.. ఏకంగా 144 కిలోల గంజాయిని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది. పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న కస్టడీ రూమ్ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు 144 కిలోల సీజ్ చేసిన గంజాయిని తీసుకెళ్లారు. ఈ ఘటనపై విర్సాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలోని విర్సాద్ పోలీస్ స్టేషన్‌లో రూ.8,60,000 విలువైన సుమారు 144 కిలోల గంజాయి దొంగిలించారు. విర్సాద్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శోభనా వాఘేలా గత శనివారం పోలీస్ స్టేషన్‌కు చేరుకోగానే డిటెన్షన్ రూమ్‌కు వెళ్లి చూడగా.. గదిలో సీజ్ చేసి ఉన్న గంజాయి స్టాక్ కు దూరంగా ఒక బ్యాగ్ పడి ఉందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కస్టడీ గది కిటికీకి ఉన్న ఇనుప గ్రిల్ తొలగించి, కిటికీకి ఆనుకుని ఉన్న ఇటుకలను తొలగించారని తెలిపారు. విషయాన్ని వెంటనే ఆమె ఉన్నతాధికారులు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు సమాచారం అందించినట్లు తెలిపారు. 2018 సెప్టెంబరు లో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం కింద నమోదైన కేసుకు సంబంధించి పోలీసు స్టేషన్‌లోని సీజ్ చేసి ఉంచిన గంజాయి స్టాక్ ను అధికారులు పరిశీలించారు. మొత్తం 56 బస్తాల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కస్టడీ రూమ్‌లో ఉంచిన 56 బ్యాగుల్లో నాలుగు బ్యాగుల్లోని గంజాయి మాయమైనట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒక బస్తాలో రూ.2.05 లక్షలు విలువ చేసే 34.29 కిలోల గంజాయి, రెండో బస్తాలో రూ.2.18 లక్షలు విలువ చేసే 36.39 కిలోల గంజాయి, మూడో బస్తాలో రూ.1.98 లక్షలు విలువ చేసే 33.90 కిలోల గంజాయి, నాల్గవ బస్తాలో రూ.218 లక్షలు విలువచేసే 39.60 కిలోల గంజాయి ఉన్నట్లు తెలిపారు. ఐపీసీ సెక్షన్ 454, 457, 380 కింద కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..