Delhi Posters: ప్రధాని నరేంద్రమోదీని విమర్శిస్తూ పోస్టర్లు.. 12 మందిని అరెస్టు చేసిన పోలీసులు

Delhi Posters: ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలతో ఢిల్లీ నగరంలో పోస్టర్లు వేసిన వారి పట్ల అక్కడి పోలీసులు చర్యలకు దిగారు. ఈ వ్యవహారంలో 12 మందిని అరెస్టు చేశారు. వారిపై..

Delhi Posters: ప్రధాని నరేంద్రమోదీని విమర్శిస్తూ పోస్టర్లు.. 12 మందిని అరెస్టు చేసిన పోలీసులు
Follow us
Subhash Goud

|

Updated on: May 15, 2021 | 10:29 PM

Delhi Posters: ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలతో ఢిల్లీ నగరంలో పోస్టర్లు వేసిన వారి పట్ల అక్కడి పోలీసులు చర్యలకు దిగారు. ఈ వ్యవహారంలో 12 మందిని అరెస్టు చేశారు. వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు పోలీసులు. ఇప్పటి వరకు 12 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఢిల్లీలోని నాలుగు విభాగాలకు చెందిన పోలీసులు ఏకకాలంలో ఆపరేషన్‌ నిర్వహించి నిందితులను గుర్తించారు. నగరంలో మొత్తం మోదీ వ్యతిరేక నినాదాలతో ఉన్న 800లకుపైగా బ్యానర్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేశంలోని కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ప్రధాని నరేంద్రమోదీ విఫలమయ్యారని ఢిల్లీలోని కొందరు యువకులు మోదీని విమర్శిస్తూ పోస్టర్లను అతికించారు. దేశ ప్రజలను వదిలేసి మోదీ విదేశాలకు వ్యాక్సిన్‌లు అమ్ముకున్నారని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. వారి అరెస్టు చేశారు.

తూర్పు ఢిల్లీలోని కళ్యాన్‌ పురి ప్రాంతంలో వీరిని అరెస్టు చేశారు. ప్రధాని మోదీని విమర్శిస్తూ పోస్టర్లు వెలువడడంతో దర్యాప్తు జరిపి పట్టుకున్నారు. కాగా, కరోనా మహమ్మారితో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో ఢిల్లీ ఒకటి. మెడికల్‌ ఆక్సిజన్‌ కొరతతో చాలా మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కరోనాతో ఎంతో మంది మృతి చెందారు. ఇటీవల నుంచి కాస్త పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే గడిచిన మూడు వారాల్లో 3లక్షల ఇన్ఫెక్షన్లు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. చాలా మంది ఆస్పత్రుల్లో బెడ్స్‌ దొరక్క, ఆక్సిజన్‌ కొరత కారణంగా చాలా మంది మృతి చెందారు. సంక్షోభాన్ని సరిగ్గా ఎదుర్కొలేకపోతున్నారంటూ మోడీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవీ చదవండి

RRR : ఎంపీ రఘురామకృష్ణరాజు కొత్త నాటకానికి తెరతీసి కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారు : ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి

కొత్త లక్షణాలతో పెరుగుతున్న కరోనా తీవ్రత.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ఏపీ స‌ర్కార్ కీల‌క ఉత్త‌ర్వులు