Delhi: దేశ రాజధానిలో దంచికొట్టిన వర్షం.. 2 రోజుల్లో 11 మంది మృతి..
దేశ రాజధాని ఢిల్లీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే 11 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మొన్నటి వరకూ భానుడి తాపంతో ఉక్కిరి బిక్కిరి అయిన ఢిల్లీ ప్రజలు వర్షాల ధాటికి వణికిపోతున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని జీవనం గడుపుతున్నారు. రుతుపవనాలు ఉత్తరాది రాష్ట్రాలకు పలకరించిన రెండు రోజులకే దాదాపు 11 మంది మరణించారు. వాయువ్య ఢిల్లీలోని బాద్లీలో శనివారం వర్షం దంచికొట్టింది. దీంతో అండర్‌పాస్‌లు నీటిలో మునిగాయి.
దేశ రాజధాని ఢిల్లీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే 11 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మొన్నటి వరకూ భానుడి తాపంతో ఉక్కిరి బిక్కిరి అయిన ఢిల్లీ ప్రజలు వర్షాల ధాటికి వణికిపోతున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని జీవనం గడుపుతున్నారు. రుతుపవనాలు ఉత్తరాది రాష్ట్రాలకు పలకరించిన రెండు రోజులకే దాదాపు 11 మంది మరణించారు. వాయువ్య ఢిల్లీలోని బాద్లీలో శనివారం వర్షం దంచికొట్టింది. దీంతో అండర్‌పాస్‌లు నీటిలో మునిగాయి. అందులో చిక్కుకున్న ఇద్దరు బాలురు మరణించగా.. ఓఖ్లాలో, నీటమునిగిన అండర్‌పాస్‌లో 60 ఏళ్ల వ్యక్తి మరణించాడు. ఇదిలా ఉంటే వరదలే కాకుండా వసంత్ విహార్ ప్రాంతంలోని నిర్మాణంలో ఉన్న ప్రహరీ గోడ కూలి మరో ముగ్గురు మరణించారు. శిధిలాల కింద ఉన్న వారిని బయటకు తీసే పనిలో ఉన్నారు డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం. ఇదిలా ఉంటే ఎడతెరిపి లేని వర్షాల కారణంగా నగరంలో ఎటు చూసినా వరదలు ముంచెత్తాయి. ఆ నీటి ప్రవాహంలో మరో ఆరు కొట్టుకుని పోయారు. అందులో ఒకరిని బయటకు వెలికి తీయగా 5 మంది మరణించారు. దీంతో మరణాల సంఖ్య 11 కి చేరుకుంది.
శుక్రవారం ఉదయం రుతుపవనాలు ఢిల్లీకి చేరుకున్నాయి. దేశ రాజధానిలో మొదటి రోజు 22.81 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది 1936 నుంచి ఇప్పటి వరకు జూన్ నెలలో నమోదైన అత్యధిక వర్షపాతంగా వెల్లడించారు. శుక్రవారం ఒక్కరోజు కురిసిన భారీ వర్షానికి ప్రగతి మైదాన్ సొరంగంతోపాటు నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం వరకూ కూడా నీరు నిలిచిపోయింది. రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చిరిస్తోంది వాతావరణ శాఖ. అందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో శనివారం నుంచి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వరదల్లో చిక్కుకున్న వారికి సహాయక చర్యలు చేపట్టరు అధికారులు. వారిని పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి క్షణం అందుబాటులో ఉండేలా పలు టోల్ ఫ్రీ నంబర్లను అందజేశారు. అన్ని ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టాలని ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. మరోవైపు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నగరంలో వరదకు తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలు, డ్రైనేజీ వ్యవస్థలను పరిశీలించారు. నష్టాన్ని అంచనా వేయడానికి, నివారణ చర్యలను చేపట్టేందుకు ప్రత్యేక బృందాన్ని సిద్దం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..