అనుమానాస్పదంగా ప్రయాణికుల నడక.. ఆపి చెక్ చేసిన అధికారులకు ఊహించని షాక్.. అండర్‌వేర్‌లో..

గోల్డ్‌ స్మగ్లింగ్‌కు ఎయిర్‌పోర్టులు అడ్డాలుగా మారుతున్నాయ్‌. ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తూ గుట్టుగా గట్టు దాటించేద్దామనుకుంటారు స్మగర్స్‌. కానీ కస్టమ్స్‌ అధికారుల కళ్లుగప్పేందుకు ట్రై చేసి అడ్డంగా దొరికిపోతున్నారు.

అనుమానాస్పదంగా ప్రయాణికుల నడక.. ఆపి చెక్ చేసిన అధికారులకు ఊహించని షాక్.. అండర్‌వేర్‌లో..
Representative image
Follow us

|

Updated on: Nov 15, 2022 | 5:59 AM

నిన్న ముంబై.. ఇవాళ చెన్నై.. ఎంత నిఘా పెట్టినా స్మగ్లర్స్‌ తీరు మాత్రం మారడం లేదు. విదేశాల నుంచి గోల్డ్‌ను స్మగ్లింగ్‌ చేస్తూ ఎయిర్‌పోర్టుల్లో కస్టమ్స్‌ అధికారులకు దొరికిపోతున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త ట్రిక్స్‌ ప్లే చేస్తున్నా.. అడ్డంగా బుక్‌ అవుతున్నారు. తాజాగా చెన్నై ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. గత మూడు రోజుల్లో పదిన్నర కిలోల బంగారం సీజ్‌ చేశారు కస్టమ్స్‌ అధికారులు. 10 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పట్టుబడిన బంగారం విలువ నాలుగున్నర కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. చెన్నై మీనంబాక్కం విమానాశ్రయానికి పెద్ద మొత్తంలో నిషిద్ధ వస్తువులు తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో కస్టమ్స్‌ అధికారులు ప్రయాణికులపై నిఘా పెట్టారు.

దుబాయ్‌ నుంచి 2 విమానాల్లో వచ్చిన ఆరుగురిని తనిఖీలు చేశారు. అండర్‌వేర్‌లో సీక్రెట్‌గా దాచిన బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అందరినీ అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బంగారం అక్రమ రవాణ వెనుక ఎవరి హస్తమైనా ఉందా అని.. ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు. వేర్వేరు విమానాల్లో వచ్చిన ఈ ఆరుగురు ప్రయాణికులు 300 గ్రాముల 12 బంగారు కడ్డీలు, 4.9 కిలోల బరువున్న ఆరు బంగారు కడ్డీలను అండర్ వేర్ లో దాచి తెచ్చారని తెలిపారు.

ఆదివారం ముంబై ఎయిర్​పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. రెండు వేర్వేరు ఘటనల్లో 61 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన బంగారం విలువ దాదాపు రూ. 32 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ముంబై కస్టమ్స్‌ చరిత్రలో ఒక్కరోజులో ఇంత పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడటం ఇదే తొలిసారి. బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ఏడుగురు ప్రయాణికులను అరెస్ట్ చేశారు. ఎక్కడి నుంచి బంగారం తరలిస్తున్నారు.. ఎవరి కోసం తీసుకొచ్చారు.. అన్న అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..