Money9: కలగా మారనున్న విదేశీ విద్య.. రూపాయి బలహీనంతో ఎడ్యుకేషన్ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం..

డాలర్‌తో రూపాయి మారకం విలువ 80 స్థాయికి చేరుకుంది. దీంతో విదేశాల్లో చదువుకు అయ్యే ఖర్చు, జీవన వ్యయం కూడా పెరిగింది. పెరుగుతున్న ఈ వ్యయాన్ని ఎలా నిర్వహించవచ్చో తెలుసుకుందాం..

Money9: కలగా మారనున్న విదేశీ విద్య.. రూపాయి బలహీనంతో ఎడ్యుకేషన్ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం..
Education Loan
Follow us
Venkata Chari

|

Updated on: Jul 30, 2022 | 7:16 PM

డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడడంతో.. విదేశాలకు వెళ్లే విద్యార్థుల బడ్జెట్‌పై తీవ్రంగా ప్రభావం చూపనుంది. అన్ని బ్యాంకుల విద్యా రుణాల వడ్డీ రేట్లు తొమ్మిది శాతం దాటాయి. దీంతో విదేశీ విద్యను అభ్యసించాలని ఆశపడ్డ విద్యార్ధులకు కష్టంగా తయారైంది. ఒక చిన్న ఉదాహరణతో ఇప్పుడు అసలు విషయం తెలుసుకుందాం.. ఒక డాలర్ ధర 75 స్థాయిలో ఉన్నప్పుడు, $ 2000 కోర్సు ఫీజు ఉంటే, అది భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 1.50 లక్షలుగా ఉండేది. తాజాగా ఒక డాలర్ రూ. 80కి చేరడంతో ఈ కోర్సు ఖరీదు రూ. 1.60 లక్షలుగా మారింది. దీంతో బయట చదువుకుంటున్న వారికి రెట్టింపు కష్టాలు ఎదురవుతున్నాయి. ఒక్క భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం ద్రవ్యోల్బణం గుప్పిట్లో చిక్కుకుంది. అమెరికాలో, ప్రతి కోర్సు ఖర్చు 7-8 శాతం పెరిగింది. ఇటువంటి పరిస్థితిలో, బయట చదువుతున్న వారు ఎక్కువ ఖర్చులకు సిద్ధంగా ఉండాలి.

పెరుగుతున్న ఖర్చులను ఎలా నిర్వహించాలి..

అమెరికా కంటే యూరప్ దేశాలకు, ఆస్ట్రేలియాకు వెళ్లడం ఇప్పటికీ చౌకగా నిలిచింది. అమెరికాలో చదివే వారి సంఖ్య ఇప్పటికీ తగ్గలేదు. కానీ, వడ్డీ రేటు ఇలాగే ఉంటే, భారతీయ విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ లింక్ ద్వారా మనీ9 యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మనీ9 అంటే ఏమిటి? Money9 OTT యాప్ ఇప్పుడు Google Play, iOSలో అందుబాటులో ఉంది. మీ డబ్బుకు సంబంధించిన ప్రతిదీ ఇక్కడ ఏడు భాషల్లో తెలుసుకోవచ్చు. బడ్జెట్‌పై మీ జేబును ప్రభావితం చేసే స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఆస్తి, పన్నులు, ఆర్థిక విధానాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా Money9 యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. మీ ఆర్థిక అవగాహనను పెంచుకోండి. ఎందుకంటే Money9 అర్థం చేసుకోవడం ఎంతో సులభం.