Gold And Silver Price Today: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..

గత వారం రోజులుగా డాలర్ బలపడడం రూపాయి పతనం, అంతర్జాతీయంగా ఏర్పడిన పరిణామాలు పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపిస్తోంది. దీంతో రోజు రోజుకీ పసిడి, వెండి ధరలు పైపైకి వెళ్తున్నాయి.  

Gold And Silver Price Today: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..
Gold And Silver Price
Follow us
Surya Kala

|

Updated on: Jul 30, 2022 | 7:36 AM

Gold And Silver Price Today (July 30th 2022):  భారతీయులకు బంగారానికి అవినావ సంబంధం ఉంది. బంగారాన్ని స్టేష్టన్ సింబల్ గా భావిస్తారు. అంతేకాదు అనుకోని ఆర్ధిక కష్టాలు ఎదురైతే.. పసిడి తమను ఆదుకుంటుందని భావిస్తారు. కాలక్రమంలో వచ్చిన మార్పుల్లో భాగంగా ఇప్పుడు పసిడి పెట్టుబడిలో కూడా భాగంగా మారింది. బంగారం తర్వాత వెండి లోహాన్ని కూడా కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తారు. శుభకార్యాలలో వెండికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ నేపథ్యంలో తమ శక్తి కొలది బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తారు. నేడు (జూలై 30 వ తేదీ 2022) శనివారం బంగారం, వెండి ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశంలోని వివిధ ముఖ్య నగరాల్లో నేడు ఉన్నాయో తెలుసుకుందాం.

గత వారం రోజులుగా డాలర్ బలపడడం రూపాయి పతనం, అంతర్జాతీయంగా ఏర్పడిన పరిణామాలు పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపిస్తోంది. దీంతో రోజు రోజుకీ పసిడి, వెండి ధరలు పైపైకి వెళ్తున్నాయి.

హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి  రూ.47,200గా ఉంది. 24 క్యారెట్ల బంగారం రూ. 110 పెరిగి.. ధర రూ. .51,490గా ఉంది..ఇవే బంగారం ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నం, వరంగల్ కూడా కొనసాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

వివిధ నగరాలలో బంగారం ధరలు:

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,660గా ఉంది. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,200గా ఉంది. ప్యూర్ గోల్డ్  24 క్యారెట్ల బంగారం ధర రూ.51,490గా ఉంది. దేశంలో అన్ని ప్రధాన నగరాల్లో కంటే చెన్నైలో పసిడి ధరలు మరింత అధికంగా ఉన్నాయి. ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,050గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,420గా ఉంది.

దేశంలో వెండి ధరలు: 

దేశీయంగా పసిడి ధరల బాటలో వెండి కూడా నడుస్తోంది. మన దేశంలో బంగారం తర్వాత ఖరీదు చేసే లోహం వెండి. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పూజలు వంటి సమయంలో వెండి వస్తువుల ఖరీదుకి ఆసక్తిని చూపిస్తారు. ఇప్పుడు శ్రావణ మాసం కావడంతో మహిళలు వెండి వస్తువులను కొనుగోలు చేయడానికి మరింత ఆసక్తిని చూపిస్తారు. ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా పెరుగుతూనే వస్తుంది. దేశీయంగా వెండి ధరలు గురించి తెలుసుకుందాం..

హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ, వరంగల్ నగరాల్లో నేడు కేజీ వెండి ధర రూ.1100 మేర పెరిగి రూ.62,300కు చేరుకుంది. అయితే ఆర్ధిక రాజధాని ముంబై, దేశ రాజధాని ఢిల్లీవంటి ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర రూ.1500 మేర పెరిగి..కేజీ వెండి రూ.58,000గా ఉంది.

Note: పైన పేర్కొన్న బంగారం ధరలు GST, TCS వంటివి కలిపిన ధరలు కావు.. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని సంప్రదించాల్సి ఉంటుంది. ఈ పసిడి వెండి ధరలు.. ఈ రొజు ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అయితే ఈ ధరలలో హెక్చుతగ్గులు స్థానిక పరిస్థితిని బట్టి కూడా ఏర్పడవచ్చు. కొనుగోలు దారులు ఈ విషయాన్నీ గమనించాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..