Demat Account: ఫైనాన్షియల్‌ సెక్యూరిటీ కోసం డీ మ్యాట్‌ అకౌంట్.. దీని ద్వారా షేర్లు కొనడం, అమ్మడం ఎలా జరుగుతుందంటే?

Demat account: స్టాక్ మార్కెట్‌ లో పెట్టుబడి పెట్టాలంటే 3 అకౌంట్లు అవసరం. అవి డీ మ్యాట్ అకౌంట్, ట్రేడింగ్‌ అకౌంట్‌ అలాగే బ్యాంక్‌ అకౌంట్ . ప్రతి అకౌంట్ నిర్దేశిత పనిచేస్తుంది . షేర్ల లావాదేవీ జరగడానికి ఈ 3 అకౌంట్స్‌..

Demat Account: ఫైనాన్షియల్‌ సెక్యూరిటీ కోసం డీ మ్యాట్‌ అకౌంట్.. దీని ద్వారా షేర్లు కొనడం, అమ్మడం ఎలా జరుగుతుందంటే?
Demat Account
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 16, 2022 | 3:27 PM

Demat Account: స్టాక్ మార్కెట్‌ లో పెట్టుబడి పెట్టాలంటే 3 అకౌంట్లు అవసరం. అవి డీ మ్యాట్ అకౌంట్, ట్రేడింగ్‌ అకౌంట్‌ అలాగే బ్యాంక్‌ అకౌంట్ . ప్రతి అకౌంట్ నిర్దేశిత పనిచేస్తుంది . షేర్ల లావాదేవీ జరగడానికి ఈ 3 అకౌంట్స్‌ ఒకదాని పై ఒకటి ఆధార పడతాయి. షేర్‌ మార్కెట్ లో ట్రేడింగ్ కోసం ఈ 3 రకాల అకౌంట్స్‌ ఉండాలి.

డీ మ్యాట్‌ అకౌంట్ అంటే ఏంటి ?

డీ మ్యాట్‌ అకౌంట్.. బ్యాంక్‌ అకౌంట్‌ లాంటిది. సేవింగ్స్ అకౌంట్ ద్వారా మీ సొమ్ము చోరీ అవ్వకుండా, ఇతరత్రా దుర్వినియోగం కాకుండా ఉంటుందో, అలాగే డీ మ్యాట్‌ అకౌంట్ మీ షేర్లను పరిరక్షిస్తుంది. మీ షేర్లను ఎలక్ట్రానిక్ రూపంలో నిక్షిప్తం చేసేందుకు డీ మ్యాట్‌ అకౌంట్‌ లేదా డిమెటీరియలైజ్డ్‌ అకౌంట్ ఉపయోగ పడుతుంది. ఈ అకౌంట్‌ లో మీ షేర్లను ఎలక్ట్రానిక్ రూపంలో నిక్షిప్తం చేస్తారు. మీరు షేర్లు కొన్నప్పుడు, అమ్మినపుడు మీ అకౌంట్లో క్రెడిట్‌ , డెబిట్‌ అవుతాయి.

ఇవి కూడా చదవండి

* ఏ స్టాక్ కొనాలి? ఏ స్టాక్ అమ్మాలి అనేది మీరు ఎంచుకోవచ్చు. షేర్లు కొనేందుకు మీ అకౌంట్లో సరిపడా నగదు ఉండేలా చూసుకోవాలి. ఏ ధరకు షేర్లు కొనాలి? లేదా అమ్మాలి ? అనేది మీరు నిర్ణయించుకోవాలి. ఈ అకౌంట్స్‌ భౌతిక షేర్లను డిమెటీరియలైజ్డ్ రూపంలో నిక్షిప్తం చేస్తాయి. షేర్లను ఎలక్ట్రానిక్ రూపం లోకి మార్చే ప్రక్రియని డిమెటీరియలైజేషన్ అంటారు. ట్రేడింగ్ జరిగినపుడు ఈ షేర్లు డీ మ్యాట్‌ అకౌంట్ లో క్రెడిట్‌ లేదా డెబిట్‌ అవుతాయి.

డీ మ్యాట్‌ అకౌంట్ల లో రకాలు

డీ మ్యాట్‌ అకౌంట్ ప్రారంభించేటపుడు తన అవసరానికి తగిన అకౌంట్ ను పెట్టుబడిదారుడు జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఏ భారతీయుడైనా నిముషాల్లో ఆన్ లైన్ లో డీ మ్యాట్ అకౌంట్ ప్రారంభించవచ్చు. డిపాజిటరీ పార్టిసిపెంట్ తో డీ మ్యాట్‌ అకౌంట్ తెరవచ్చు. 5 పైసా. కామ్ https://bit.ly/3RreGqO లాంటి ప్లాట్ ఫాం లో మీరు సురక్షిత విధానంలో సులువుగా డీ మాట్ ఎకౌంట్ ఓపెన్ చేసి మీ ట్రేడింగ్ ప్రయాణం ప్రారంభించవచ్చు.

డీ మ్యాట్ అకౌంట్స్‌ 4 రకాలు

1. రెగ్యులర్ డీ మ్యాట్‌ అకౌంట్

ఏ భారతీయుడైనా షేర్లు , సెక్యూరిటీలు కొనడానికి, అమ్మడానికి సాధారణ డీ మ్యాట్ అకౌంట్ అవసరం. షేర్లు అమ్మినపుడు మీ అకౌంట్ నుండి డెబిట్ అవడం, కొన్నపుడు క్రెడిట్‌ అవడం జరుగుతుంది. ప్యూచర్స్‌ & ఆప్షన్స్‌ లో ట్రేడింగ్ చేసినపుడు డీ మ్యాట్ అకౌంట్ అవసరం ఉండదు. ఎందుకంటే ఈ పధ్దతిలో షేర్ల నిక్షిప్తం అవసరం ఉండదు కాబట్టి.

2. బేసిక్ సర్వీస్‌ డీ మ్యాట్ అకౌంట్

ఇది చిన్న పెట్టుబడిదారులను దృష్టిలో ఉంచుకొని, సెబి ప్రవేశపెట్టిన కొత్త రకం డీ మ్యాట్ అకౌంట్ . రూ 50 వేల విలువ కంటే తక్కువ విలువైన స్టాక్స్‌ , బాండ్లు ఉన్న వారు నిర్వహణ చార్జీలు చెల్లించనవసరం లేదు. రూ 50 వేల నుంచి 2 లక్షల వరకు విలువైన సెక్యూరిటీలు కలిగి ఉన్న పక్షంలో రూ 100 ఛార్జీలు చెల్లించాలి.

3. రీపార్షియబుల్ డీ మ్యాట్ అకౌంట్

రీపార్షియబుల్ డీ మ్యాట్ అకౌంట్ ప్రవాస భారతీయుల కోసం. ఈ అకౌంట్ ద్వారా వారు భారత స్టాక్‌ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టవచ్చు. డబ్బు పంపవచ్చు. అయితే నిధులను పంపడానికి వారి డీ మ్యాట్‌ అకౌంట్‌ ను ప్రవాస భారతీయ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయాలి.

4. నాన్‌ రీపార్షియబుల్ డీ మ్యాట్ అకౌంట్

నాన్‌ రీపార్షియబుల్ డీ మ్యాట్ అకౌంట్ కూడా ప్రవాస భారతీయుల కోసమే. అయితే ఈ అకౌంట్ ద్వారా విదేశాలకు నగదు లావాదేవీలు చేయలేరు.

డీ మ్యాట్ అకౌంట్ ప్రయోజనాలు

డీ మ్యాట్‌ అకౌంట్ ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా షేర్ల లావాదేవీలు చేయవచ్చు. షేర్లు ఇతర సెక్యూరిటీల సర్టిఫికెట్లు ఎలక్ట్రానిక్ రూపంలో ఇక్కడ నిక్షిఫ్తమవుతాయి. అందుకే .. అవి చోరీకి, ఫోర్జరీకి గురయ్యే అవకాశం చాలా తక్కువ. ట్రేడింగ్‌ వ్యవహారాలను ఎప్పుడైనా, ఎక్కడినుండైనా సులభంగా పరిశీలించవచ్చు. బోనస్‌ షేర్ల జారీ, విభజించిన షేర్లు, రైట్స్‌ ఇష్యూ లు వాటికవే ( ఆటోమెటిగ్గా ) అకౌంట్ కు క్రెడిట్‌ అవుతాయి.

డీ మ్యాట్‌ ఖాతా ఎలా తెరవాలి?

షేర్ మార్కెట్ లో ట్రేడింగ్ చేయడానికి డీ మ్యాట్‌ ఖాతా ఉండటం తప్పని సరి. ఏదైనా ఆర్థిక సంస్థ ద్వారా లేదా స్టాక్ బ్రోకర్‌ ద్వారా డీ మ్యాట్ ఖాతా తెరవచ్చు. ఇందు కోసం ముందుగా ఏదైనా ఆర్థిక సంస్థ , అధీకృత బ్యాంక్‌ , లేదా స్టాక్ బ్రోకర్‌ ద్వారా డిపాజిటరీ పార్టిసిపెంట్ ను ఎంచుకోవాలి. బ్రోకరేజ్ ఛార్జ్‌ , వార్షిక చార్జ్‌లు, పరపతి ఆధారంగా డిపాజిటరీ పార్టిసిపెంట్ ను ఎంచుకోవాలి. డిపాజిటరీ పార్టిసిపెంట్ ను ఎంచుకున్న తర్వాత అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ నింపి కేవైసీ ఫామ్ ను ఇవ్వాలి. వీటితో పాటు మీ పాన్ కార్డ్‌ , నివాస ఆధార పత్రం, గుర్తింపు కార్డుల జిరాక్స్‌ , పాస్‌ పోర్ట్ సైజ్‌ ఫొటో ఇవ్వాలి. ఒరిజనల్ డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్ కోసం మీ దగ్గర ఉంచాలి. వీటితో పాటు మీ బ్యాంక్ ఖాతా వివరాల కోసం ఒక క్యాన్సిల్డ్‌ చెక్‌ ఇవ్వాలి.

స్టాక్ మార్కెట్‌ నియమాలు, పెట్టుబడి దారుగా మీ హక్కుల వివరాలు పొందుపరచిన అగ్రిమెంట్‌ ను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత దాని పై సంతకం చేయాలి . చాలా సంస్థలు, వేదికలు ఆన్ లైన్‌ లో చాలా సులభతర ప్రక్రియ ద్వారా డీ మ్యాట్ అకౌంట్ తెరిచే అవకాశం కల్పిస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..