Motivation: ఈ సమయాల్లో మౌనంగా ఉండడమే బెటర్.. ఏం మాట్లాడొద్దు..
జీవితంలో విజయం సాధించాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అందుకు అనుగుణంగా కృషి చేస్తుంటారు. అయితే మన విజయానికి మన కష్టం ఎంత ముఖ్యమో మన ఆలోచనలు, మనం జీవించే విధానం కూడా అంతే ముఖ్యమని మానసిక నిపుణులు చెబుతున్నారు. మనిషికి మాత్రమే ఉన్న శక్తి మాట్లాడడం. అయితే ఎంతో విలువైన ఈ మాటను పొదుపుగా వాడాలని...
జీవితంలో విజయం సాధించాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అందుకు అనుగుణంగా కృషి చేస్తుంటారు. అయితే మన విజయానికి మన కష్టం ఎంత ముఖ్యమో మన ఆలోచనలు, మనం జీవించే విధానం కూడా అంతే ముఖ్యమని మానసిక నిపుణులు చెబుతున్నారు. మనిషికి మాత్రమే ఉన్న శక్తి మాట్లాడడం. అయితే ఎంతో విలువైన ఈ మాటను పొదుపుగా వాడాలని మానసిక నిపుణులు చెబుతుంటారు. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండాలని సూచిస్తుంటారు. ఇంతకీ ఏయే సందర్భాల్లో మౌనంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..
* ఎవరైనా ఒకరు మీ వద్ద వారి గొప్పతనం గురించి చెప్పుకుంటుంటే మౌనంగా వినండి. సాధారణంగా చాలా మంది వారి గొప్పతనాల్లో ఏదో ఒక లోపాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే దీనివల్ల ఎదుటి వారి భావాలను మీరు ఖండించినట్లు భావించే అవకాశాలు ఉంటాయి. ఈ కారణంగా గొడవకు దారి తీసే అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటి సందర్భాల్లో సైలెంట్‌గా ఉండడమే బెటర్.
* ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరుగుతుంటే. మూడో వ్యక్తిగా ఉండే మీరు ఆ విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండడమే మంచిది. మరీ ముఖ్యంగా మీకు ఆ వ్యవహారంపై మీకు ఎలాంటి అవగాహన లేకపోతే సైలెంట్‌గా ఉండడమే మంచిది.
* మిమ్మల్ని ఎదుటి వ్యక్తి ఎంతకీ అర్థం చేసుకోకపోతుంటే మీరు మౌనంగా ఉండడమే మంచిది. ఎంత ప్రయత్నించినా మీ మాట వినకపోతుంటే నిశ్శబ్ధంగా అక్కడి నుంచి వెళ్లిపోవడమే ఉత్తమం.
* ఇక మీపై ఎవరైనా విపరీతమైన కోపంతో ఊగిపోతుంటే మౌనంగా ఉండండి. వారి కోపాన్ని మౌనంగా ఎదురించండి. కోపంగా ఉన్న వ్యక్తితో ఎట్టి పరిస్థితుల్లో వాగ్వాదానికి దిగకండి. ఇది గొడవ మరింత ఎక్కువ కావడానికి కారణమవుతుంది.
* విషయం గురించి మీకు పూర్తిగా అవగాహనలేకపోయినా దాని గురించి ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిది. ఇలా మాట్లాడితే మీ అజ్ఞానాన్ని మీరు ప్రదర్శించుకున్నట్లు అవుతుంది.
* మీ దగ్గర వేరే వారి గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే దానికి స్పందించకుండా ఉండడమే బెటర్. ఎందుకంటే ఈరోజు వారు మరొకరి గురించి చెడుగా మాట్లాడుతున్నారు, రేపు మీ గురించి కూడా బ్యాడ్‌గా మాట్లాడవచ్చు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..