Chicken: చికెన్‌లో నిమ్మకాయ రసం పిండుకుంటే మంచిదేనా.? లాభమా, నష్టమా..

చికెన్‌ను వండే కంటే ముందు మసాలాలు కలిపే సమయంలో చికెన్‌ రసాన్ని కలుపుతుంటారు. అలాగే చికెన్‌ పూర్తయిన తర్వాత కూడా నిమ్మ రసాన్ని పిండుకుని తింటుంటారు. అయితే చికెన్‌లో నిమ్మరసం పిండుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా.? అసలు ఇలా తీసుకోవడం వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా.? లేదా.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...

Chicken: చికెన్‌లో నిమ్మకాయ రసం పిండుకుంటే మంచిదేనా.? లాభమా, నష్టమా..
Chicken With Lemon
Follow us

|

Updated on: Sep 29, 2024 | 7:57 AM

ఆదివారం వచ్చిందంటే కచ్చితంగా వంటింట్లో చికెన్‌ ముక్క ఉడకాల్సిందే. నాన్‌ వెజ్‌ ప్రియులు ఎంతో ఇష్టంగా తినే వాటిలో చికెన్‌ ఒకటి. తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు లభించడం, వంటకం కూడా చాలా ఈజీగా ఉండడం, రుచిలో అమోఘంగా ఉండడం వంటి కారణాలన్నీ చికెన్‌ను ఎక్కువగా ఇష్టపడడానికి ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. అయితే చికెన్‌లో నిమ్మరసం పిండుకోవడం సర్వసాధారణమైన విషయం.

చికెన్‌ను వండే కంటే ముందు మసాలాలు కలిపే సమయంలో చికెన్‌ రసాన్ని కలుపుతుంటారు. అలాగే చికెన్‌ పూర్తయిన తర్వాత కూడా నిమ్మ రసాన్ని పిండుకుని తింటుంటారు. అయితే చికెన్‌లో నిమ్మరసం పిండుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా.? అసలు ఇలా తీసుకోవడం వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా.? లేదా.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. చికెన్‌లో నిమ్మరసాన్ని పిండుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

చికెన్‌లో నిమ్మరసం పిండుకోవడం వల్ల అందులోని ఆమ్లత్వం ప్రోటీన్స్‌ని విచ్ఛిన్నం చేస్తుంది. దీంతో చికెన్ మరింత సాఫ్ట్‌గా తయారవుతుంది. నిమ్మలోని సిట్రిక్‌ యాసిడ్‌ కారణంగా ప్రోటీన్స్‌ చిన్న చిన్న కణాలుగా విడిపోతుంటాయి. ఇది తీసుకున్న చికెన్‌ త్వరగా జీర్ణమవ్వడంలో ఉపయోగపడుతుంది. సాధారణంగా చికెన్ తినే సమయంలో జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. కానీ నిమ్మకాయ పిండుకుని తినడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.

ఇక కొంత మంది చికెన్‌ను స్కిన్‌తో తినడానికి ఇష్టపడుతుంటారు. అలాంటి వారికి కూడా నిమ్మ రసం ఉపయోగపడుతుంది. స్కిన్‌ నుంచి కొవ్వుని బ్యాలెన్స్‌ చేయడానికి నిమ్మరసం ఉపయోగపడుతుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరగకుండా ఉండడంలో ఉపయోగపడుతుంది. ఇక చికెన్‌ను వండేముందు మేరినెట్ చేయడం సాధారణమైన విషయం. ఈ సమయంలో చికెన్‌లో నిమ్మరసం కలుపుతుంటారు. దీనివల్ల చికెన్‌ సరిగ్గా ఉడుకుతుంది.

ఇక నిమ్మలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది ఆహారం నుంచి ఐరన్‌ను గ్రహించేందుకు ఉపయోగపడుతుంది. చికెన్‌లో లీన్ ప్రోటీన్, అవసరమైన విటమిన్స్, బి6, బి12, ఐరన్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. చికెన్‌లో కాల్షియం కూడా ఉంటుంది. దీనిని సరిగ్గా గ్రహించేందుకు బాడీకి విటమిన్ సి అవసరం. చికెన్‌లో నిమ్మరసం కలుపుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండదు. పైగా లాభాలే ఉన్నాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

భాగ్యనగరంలో పింక్ పవర్ రన్.. పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి..
భాగ్యనగరంలో పింక్ పవర్ రన్.. పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.