Lifestyle: జీర్ణవ్యవస్థ ఆరోగ్యంపై సందేహమా.? ఇలా చెక్‌ చేసుకోండి..

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే తిన్నది సరిగ్గా జీర్ణమవ్వాలి. ఇది అందరికీ తెలిసిందే. శరీరంలో జీర్ణవ్యవస్థకు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో దీనిబట్టే చెప్పొచ్చు. అలాంటి కీలకమైన జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు ఏర్పడితే. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావపడుతుంది. అందుకే జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు...

Lifestyle: జీర్ణవ్యవస్థ ఆరోగ్యంపై సందేహమా.? ఇలా చెక్‌ చేసుకోండి..
Dization
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 29, 2024 | 7:38 AM

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే తిన్నది సరిగ్గా జీర్ణమవ్వాలి. ఇది అందరికీ తెలిసిందే. శరీరంలో జీర్ణవ్యవస్థకు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో దీనిబట్టే చెప్పొచ్చు. అలాంటి కీలకమైన జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు ఏర్పడితే. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావపడుతుంది. అందుకే జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. జీర్ణవ్యవస్థలో సమస్యలు తలెత్తితే కేవలం కడుపునొప్పి, గ్యాస్‌ వంటి ఇబ్బందులు మాత్రమే వస్తాయని మనలో మెజారిటీ అనుకుంటాం. కానీ ఇది మరెన్నో ఇతర సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ జీర్ణ వ్యవస్థలో తలెత్తే సమస్యల వల్ల కనిపించే ఇతర లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* జీర్ణసంబంధిత సమస్యలు ఎదురైన వారి బరువులో హెచ్చ తగ్గులు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా పేగుల్లో వివిధ రకాల బ్యాక్టీరియా చేరడం వల్ల ఈ సమస్య వస్తుంది. కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాలతో ఊబకాయానికి కారణమయ్యే బ్యాక్టీరియా పేగుల్లో పెరుగుతుంది. ఇది కడుపులో చికాకుకు దారి తీస్తుంది.

* ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్‌ కూడా జీర్ణ సంబంధిత సమస్యల్లో ఒకటి. ఇలా చాలా ప్రధానంగా కనిపిస్తుంటుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు, మలబద్ధకం, తరచూ కడుపు నొప్పి వంటివన్నీ వీటి లక్షణాలుగా చెప్పొచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

* ఇక జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు చర్మ సమస్యలకు సైతం దారి తీస్తుందని మీకు తెలుసా.? అవును పులిపిర్లు, సోరియాసిస్, దురదలు వంటివన్నీ ఈ కోవకే చెందుతాయి. పేగుల్లోంచి లీకైయ్యే ప్రొటీన్లను రోగనిరోధక శక్తి హానికరమైనవిగా భావించి దాడి ప్రారంభిస్తుంది. దీంతో, ఈ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

* జీర్ణవ్యవస్థలో ఎదురయ్యే మరో ప్రధాన సమస్య నిత్యం అలసటగా ఉండడం. నిత్యం నీరసంగా ఉండే వారిలో సగం మందికి జీర్ణ వ్యవస్థ సంబంధిత సమస్యలు ఉంటాయని వైద్యులు గుర్తించారు.

* ఇక జీర్ణ సంబంధిత సమస్యల కారణంగా మానసిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఇవి పాటించండి..

జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవ్వాలంటే జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. తీసుకునే ఆహారంలో కచ్చితంగా ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాగే యోగా, మెడిటేషన్‌ వంటివి అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. ఇక ఆహారాన్ని ఆదరబాదరగా కాకుండా చాలా సేపు నమిలి మింగాలి. ఇలాంటివి పాటిస్తే జీర్ణ వ్యవస్థలో తలెత్తిన సమస్యలన్నీ బలదూర్‌ అవుతాయి.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..