Toenail Fungus: కాలి గోళ్ళలో చీము పేరుకుని పసుపు రంగులోకి మారాయా.. నివారణకు ఈ చిట్కా అప్లై చేసి చూడండి..

వర్షాకాలంలో పాదాలపై ధూళి, బురద చేరుకుంటుంది. నిల్వ నీరులో నడిస్తే కాలి వెళ్ళ మద్య, కాలి గొర్ల దగ్గర ఫంగస్, బ్యాక్టీరియా చేరుకుంటాయి. అప్పుడు ఇన్ఫెక్షన్లు సంభవిస్తాయి. చాలా మంది తమ కాళ్ల గోళ్ళను సరిగ్గా శుభ్రం చేసుకోరు. ఫలితంగా గోరు మూలలో మురికి పేరుకుపోయి ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. ఒకొక్క సారి గోళ్లు పసుపు రంగులోకి మారుతాయి లేదా గోళ్ల మూలలు నల్లగా మారతాయి. చీము పేరుకుపోతుంది.

Toenail Fungus: కాలి గోళ్ళలో చీము పేరుకుని పసుపు రంగులోకి మారాయా.. నివారణకు ఈ చిట్కా అప్లై చేసి చూడండి..
Toenail Fungus
Follow us
Surya Kala

|

Updated on: Sep 28, 2024 | 9:50 PM

చాలా మంది అందం కోసం మేకప్‌పై అత్యంత శ్రద్ధ వహిస్తారు. ముఖం, చేతుల విషయంలో చూపించే శ్రద్ధ పాదాలపై చూపరు. అంతేకాదు చాలా మంది చేతి గోళ్లను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అదే శ్రద్ధ కాలి గోళ్ల విషయంలో ఉండదు. ఇంకా చెప్పాలంటే కాలి గోర్లను అస్సలు పట్టించుకోరు. అప్పుడు కాళ్ళపై టాన్ చేరుకుంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో పాదాలపై ధూళి, బురద చేరుకుంటుంది. నిల్వ నీరులో నడిస్తే కాలి వెళ్ళ మద్య, కాలి గోళ్ళ దగ్గర ఫంగస్, బ్యాక్టీరియా చేరుకుంటాయి. అప్పుడు ఇన్ఫెక్షన్లు సంభవిస్తాయి. చాలా మంది తమ కాళ్ల గోళ్ళను సరిగ్గా శుభ్రం చేసుకోరు. ఫలితంగా గోరు మూలలో మురికి పేరుకుపోయి ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. ఒకొక్క సారి గోళ్లు పసుపు రంగులోకి మారుతాయి లేదా గోళ్ల మూలలు నల్లగా మారతాయి. చీము పేరుకుపోతుంది.

కాలి గోళ్ళకు ఇన్ఫెక్షన్లు వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు. మొదటిది చెప్పులు లేకుండా ఎక్కువగా నడిచే వారి కాలి గోళ్లకు ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. అంతేకాదు అపరిశుభ్రమైన ప్రదేశాలలో ఎక్కువగా నడిచినా కూడా ఇలా జరుగుతుంది. పాదాలను, కాలి వేళ్ళను క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోయినా, కాలి వేళ్ళపై దుమ్ము, ధూళి పెరుకున్నా ఇన్ఫెక్షన్ సంభవించవచ్చు. సున్నితమైన చర్మం ఉన్నవారు ఇతరులు ఉపయోగించే టవల్స్ లేదా నెయిల్ క్లిప్పర్‌లను ఉపయోగించినా కాలి గోళ్ళు ఇన్ఫెక్షన్ బారిన పడవచ్చు.

గోళ్ళకు ఇన్ఫెక్షన్ వస్తే ఏమి చేయాలంటే?

టీ ట్రీ ఆయిల్ ఏదైనా ఇన్ఫెక్షన్‌ను నయం చేయడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. వ్యాధి సోకిన ప్రదేశంలో టీ ట్రీ ఆయిల్ ఆయిల్‌ను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

రెండు టీస్పూన్ల టీ ట్రీ ఆయిల్‌తో ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని కాటన్ బాల్‌తో తీసుకుని గోళ్ళపై ప్రభావిత ప్రాంతం, దాని చుట్టూ ఉన్న చర్మంపై కొద్దిగా అప్లై చేయండి. క్రమం తప్పకుండా ఇలా అప్లై చేయడం వలన ఫలితం ఉంటుంది. అయితే టీ ట్రీ ఆయిల్ రాసుకున్న వెంటనే సాక్స్ లేదా షూస్ వేసుకోవద్దు.

ఒక స్పూన్ టీ ట్రీ ఆయిల్‌ను ఒక చెంచా విటమిన్ ఇ ఆయిల్‌ను మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని కాటన్ బాల్‌తో సోకిన ప్రదేశంలో అప్లై చేయండి. ఇది గాయం ప్రాంతంలో మంటను, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఎ విషయాలైన పాటించే ముందు ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.)

ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..