Anemia: టెస్టు అవసరం లేకుండానే.. శరీరంలో రక్తం తగ్గిందో లేదో కనుక్కోవచ్చు…
ప్రస్తుత కాలంలో రక్త హీనత సమస్యతో బాధ పడేవారి సంఖ్య బాగా పెరుగుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. ఇలాగే వదిలేస్తే అనేమియాకు దారి తీస్తుంది. దీంతో మరిన్ని సమస్యలు తలెత్తుతాయి. రక్త హీనత సమస్యను తగ్గించుకోవాలంటే.. ఐరన్ ఉండే ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు, మాంసం, తృణ ధాన్యలు వంటి వాటిల్లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. చాలా మంది రక్తం ఎంత..

Anemia
- ప్రస్తుత కాలంలో రక్త హీనత సమస్యతో బాధ పడేవారి సంఖ్య బాగా పెరుగుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. ఇలాగే వదిలేస్తే అనేమియాకు దారి తీస్తుంది. దీంతో మరిన్ని సమస్యలు తలెత్తుతాయి. రక్త హీనత సమస్యను తగ్గించుకోవాలంటే.. ఐరన్ ఉండే ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవాలి.
- కూరగాయలు, పండ్లు, మాంసం, తృణ ధాన్యలు వంటి వాటిల్లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. చాలా మంది రక్తం ఎంత ఉందో తెలుసుకోవడానికి టెస్టులు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇకపై అవసరం లేదు. మీ శరీరంలో ఉండే మార్పులను బట్టే మీకు రక్త హీనత సమస్య ఉందో లేదో చెప్పొచ్చు.
- శరీరంలో ఐరన్ శాతం తక్కువగా ఉంటే.. బాగా అలసటగా ఉంటుంది. చిన్న చిన్న పనులు చేసినా తీవ్రంగా అలసట ఉంటుంది. కండరాలు కూడా నొప్పులగా ఉంటాయి. కూర్చొన్నా, నడిచినా.. తిమ్మిర్లు రావడం, జలదరించడం జరుగుతుంది.
- రక్త హీనత సమస్యతో బాధ పడ్డవారిలో చర్మం పాలిపోయినట్టుగా ఉంటుంది. మూత్రంలో కూడా మార్పులు కనిపిస్తాయి. మూత్రం గులాబీ లేదా ఎరుపు రంగులో వస్తుంది.
- అంతే కాకుండా మీరు తరచూ అనారోగ్య సమస్యలకు గురవుతున్నా, ఇన్ ఫెక్షన్స్ వస్తున్నా రక్త హీనత సమస్యతో బాధ పడుతున్నట్లే. ఇలాంటి సమస్యలతో మీరు బాధ పడుతూ ఉంటే.. ఖచ్చితంగా వైద్యుల్ని సంప్రదించడం మంచిది.