Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cardamom Benefits: రెండే రెండు యాలకులు పరగడుపున తింటే ఏమవుతుందో తెలుసా..? ఈ మార్పును అస్సలు నమ్మలేరు..

భారతీయ సుగంధ ద్రవ్యాలలో ఏలకులు ఒకటి.. యాలకులలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి.. సుగంధ రుచికి పేరుగాంచిన ఏలుకలు.. మీ ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.. ప్రత్యేకించి, మీరు రోజూ రెండు ఏలకులను ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా తీసుకుంటే .. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు..

Cardamom Benefits: రెండే రెండు యాలకులు పరగడుపున తింటే ఏమవుతుందో తెలుసా..? ఈ మార్పును అస్సలు నమ్మలేరు..
Cardamom for skin
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 31, 2024 | 2:52 PM

భారతీయ సుగంధ ద్రవ్యాలలో ఏలకులు ఒకటి.. యాలకులలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి.. సుగంధ రుచికి పేరుగాంచిన ఏలుకలు.. మీ ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.. ప్రత్యేకించి, మీరు రోజూ రెండు ఏలకులను ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా తీసుకుంటే .. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు.. అంతేకాకుండా.. అధిక బరువు సమస్య నుంచి కూడా బయటపడొచ్చు.. ఏలుకలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

బరువు తగ్గడంలో ప్రయోజనకరంగా ఉంటుంది..

NCBI నివేదిక ప్రకారం.. ఏలకులు పీచును ఎక్కువగా కలిగి ఉంటాయి.. ఇది మిమ్మల్ని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది.. ఇది మీ ఆకలిని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఏలకులు జీవక్రియను పెంచడానికి కూడా దోహదం చేస్తాయి. ఇది కేలరీలను బర్న్ చేసే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి..

ఏలకులు డైజెస్టివ్ ఎంజైమ్‌ల స్రావాన్ని ప్రోత్సహిస్తుంది.. ఆహారం సాఫీగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో ఏలకులను తీసుకోవడం వల్ల మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కడుపు వాపును తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

నోటి దుర్వాసనను దూరం చేస్తాయి..

నోటి దుర్వాసన అనేది ఒక సాధారణ సమస్య.. దీనికి పరిష్కారం ఏలకుల్లో ఉంటుంది. ఏలకుల్లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి నోటిలోని బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడతాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఏలకులను నమలడం వల్ల మీ శ్వాసలో తాజాదనాన్ని నింపుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతాయి..

ఏలకులు పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ఏలకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. ఇంకా వివిధ ఇన్ఫెక్షన్ల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.

రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది..

కొన్ని అధ్యయనాలు ఏలకులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని సూచిస్తున్నాయి. అయితే, ఇది మధుమేహం ఔషధానికి ప్రత్యామ్నాయం కాదు. మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే, ఏలకులు తీసుకునే ముందు ఖచ్చితంగా మీ వైద్యుడిని సంప్రదించండి.

చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుంది..

ఏలకులు మంచి మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి కలిగి ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిలో చర్మానికి సహాయపడతాయి. దీంతో చర్మం బిగుతుగా మారి ముడతలు తగ్గుతాయి. ఇది కాకుండా, ఏలకులలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మం మంటను తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..