AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆల్కహాల్ వల్ల లివర్ పాడైందా..? జస్ట్ ఈ ఆహారాలు తీసుకుంటే అంతా సెట్..

ప్రస్తుతకాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి.. అలాంటి వాటిలో ఫ్యాటీ లివర్ ఒకటి.. ఆరోగ్యం బాగుండాలంటే కాలేయం బాగుండాలి.. పేలవమైన జీవనశైలి, అనారోగ్య ఆహారం, మద్యం, ధూమపానం లాంటి అలవాట్ల వల్ల కాలేయ సమస్యలు పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆల్కహాల్ వల్ల లివర్ పాడైందా..? జస్ట్ ఈ ఆహారాలు తీసుకుంటే అంతా సెట్..
Liver Health
Shaik Madar Saheb
|

Updated on: Jul 31, 2024 | 4:07 PM

Share

ప్రస్తుతకాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి.. అలాంటి వాటిలో ఫ్యాటీ లివర్ ఒకటి.. ఆరోగ్యం బాగుండాలంటే కాలేయం బాగుండాలి.. పేలవమైన జీవనశైలి, అనారోగ్య ఆహారం, మద్యం, ధూమపానం లాంటి అలవాట్ల వల్ల కాలేయ సమస్యలు పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 30 నుంచి 40 ఏళ్ల వయసులో ఫ్యాటీ లివర్ సమస్య కనిపిస్తుంది.. అయితే.. ప్రస్తుత కాలంలో చిన్న వయస్సులో కూడా ఇలాంటి కేసులు కనిపిస్తున్నాయి. ఫ్యాటీ లివర్ వ్యాధిని ప్రారంభ దశల్లో గుర్తిస్తే మంచిదని.. అప్పుడు దాని వల్ల కలిగే నష్టాన్ని నివారించవచ్చని.. పేర్కొంటున్నారు వైద్య నిపుణులు.. వాస్తవానికి ఫ్యాటీ లివర్ ను రెండు రకాలుగా విభజిస్తారు.. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్.. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వస్తుంది.

ఆల్కహాల్ తాగడం ఆరోగ్యానికి హానికరం.. ఇది కాలేయ వైఫల్యానికి దారితీస్తుందని తెలుసు. ఎక్కువగా తాగేవారి కాలేయం త్వరగా పాడవుతుంది. ఈ సందర్భాలలో, కాలేయాన్ని రక్షించడానికి, ఆల్కహాల్, కూల్ డ్రింక్స్ తాగడం మొదట నిలిపివేయాలి. ఆ తర్వాత కాస్త హెల్తీ ఫుడ్ తీసుకుంటే లివర్ మళ్లీ హెల్తీగా తయారవుతుంది. అన్ని రకాల కొవ్వులు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు కాలేయం ద్వారా నియంత్రించబడతాయి. కొన్ని హెల్తీ ఫుడ్స్ తినడం వల్ల కాలేయం బలపడుతుంది. కాలేయం ఆరోగ్యంగా లేకుంటే మెటబాలిక్ డిజార్డర్ తలెత్తుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్‌కు కారణం అవుతుంది..

కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే.. తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటో తెలుసుకోండి..

వోట్మీల్: వోట్మీల్.. రెగ్యులర్ వినియోగం దాని ఫైబర్ కంటెంట్ కారణంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాదు కాలేయం ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది.

ఆకుకూరలు: రోజూ క్రమం తప్పకుండా ఆకుకూరలు తీసుకుంటే శరీరం పూర్తిగా ఆరోగ్యంగా ఉంటుంది. దీనివల్ల కాలేయానికి కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

ద్రాక్ష: రోజూ క్రమం తప్పకుండా ద్రాక్ష తినడం ప్రారంభించండి.. తద్వారా కాలేయం ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటుంది. వీటితో పాటు అరటిపండు, క్యాలీఫ్లవర్, బ్రకోలీ తినడం మంచిది.

ఆలివ్ ఆయిల్: ఆయిల్ ఫుడ్స్, సంతృప్త కొవ్వు పదార్థాలు, జంక్ ఫుడ్స్ భారతదేశంలో ఎక్కువ పరిమాణంలో వినియోగిస్తారు. దానితో కాలేయం దెబ్బతింటుంది. వంటనూనెకు బదులు ఆలివ్ ఆయిల్ వాడటం మంచిది.

గ్రీన్ టీ: గ్రీన్ టీ రోజుకు 2 సార్లు గ్రీన్ టీ తాగడం వల్ల లివర్ క్యాన్సర్ నుంచి కాపాడుకోవచ్చు. అయితే గ్రీన్ టీని అవసరానికి మించి తాగకూడదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..