AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yoga Benefits: వెన్ను, నడుము నొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. రిలీఫ్ కోసం ఈ యోగాసనాలు ట్రై చేయండి…

చాలా సార్లు బరువైన వస్తువులను ఎత్తడం లేదా కూర్చునే విధానంలో మార్పు వలన వెన్నునొప్పి సమస్య వస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ఈ సమస్య చాలా సర్వ సాధారణం అయిపోయింది. దీని కారణంగా ప్రజలు తమ రోజువారీ పనులు చేసుకోవడంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనుక వెన్నునొప్పి సమస్య నుంచి ఉపశమనం కోసం మీరు ఏ యోగాసనాలను ప్రయత్నించవచ్చో ఈ రోజు తెలుసుకుందాం..

Yoga Benefits: వెన్ను, నడుము నొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. రిలీఫ్ కోసం ఈ యోగాసనాలు ట్రై చేయండి...
Yoga Benefirts
Surya Kala
|

Updated on: Jun 02, 2025 | 8:07 PM

Share

రోజంతా ఆఫీసులో డెస్క్ దగ్గర కూర్చుని పని చేసే వ్యక్తులు తరచుగా వెన్నునొప్పితో బాధపడుతుంటారు. ఎందుకంటే రోజంతా కూర్చొని పని చేయడం వల్ల శరీరం కదలదు.. పైగా కూర్చునే భంగిమలో తేడా ఉండడం వలన వెన్నునొప్పి మొదలవుతుంది. కొన్నిసార్లు దీనికి కారణం బరువైన వస్తువులను ఎత్తడం కూడా కావచ్చు. అటువంటి పరిస్థితిలో యోగా సహాయం తీసుకోవడం వలన మంచి రిలీజ్ లభిస్తుంది. కొన్ని యోగాసనాలు మీ కండరాలను సడలించి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా వెన్నెముక కూడా బలపడుతుంది. ఇది వెన్నునొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. యోగా రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలిగించే కొన్ని యోగాసనాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

  1. భుజంగాసనం భుజంగాసనం చేయడానికి.. మీ పొట్టపై పడుకుని, మీ చేతులను మీ భుజాల దగ్గర ఉంచి, మీ శరీరాన్ని పైకి ఎత్తండి. ఈ యోగాసనాన్ని చేయడం వల్ల కండరాలు బలపడతాయి. వెన్నునొప్పి కూడా ఉపశమనం పొందుతుంది. ఈ ఆసనం ప్రతిరోజూ చేయడం వల్ల మీ శరీరం ఫిట్‌గా ఉంటుంది.
  2. శలభాసన ఈ ఆసనం వేయడానికి మీ పొట్టపై పడుకుని, మీ కాళ్ళు, ఛాతీ రెండింటినీ పైకి లేపండి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మీ శరీరంలో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. వెన్నునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ ఆసనం నడుము, వీపు, తొడల కండరాలను బలపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరంలో వశ్యతను పెంచడంలో సహాయపడుతుంది.
  3. బాలసనం బాలసనాన్ని చైల్డ్ పోజ్ అని కూడా అంటారు. దీని కోసం ముందుగా నేలపై మోకాళ్లపై కూర్చుని.. ఆపై మీ మోకాళ్లను కొద్దిగా బయటికి విస్తరించండి. మీ శరీరాన్ని ముందుకు వంచి మీ నుదిటిని నేలపై ఉంచండి. మీ చేతులను మీ తొడల దగ్గర ఉంచి ముందుకు చాపండి. ఈ యోగాసనాన్ని చేయడం వల్ల ఒత్తిడి తగ్గి, వెన్నునొప్పి తగ్గుతుంది.
  4. తాడాసనం ఎత్తు పెరగని పిల్లలకు తాడాసనం చాలా మంచిదే అయినప్పటికీ.. మీ నడుములో నొప్పి ఎక్కువగా ఉంటే మీరు కూడా ఈ ఆసనం వేయవచ్చు. దీని కోసం నిటారుగా నిలబడి మీ రెండు చేతులను పైకి లేపండి.
  5. ఇవి కూడా చదవండి
  6. శవాసన వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఇది సులభమైన మార్గం. దీని కోసం మీరు మీ వీపుపై నేరుగా పడుకుని.. మీ శరీరాన్ని పూర్తిగా వదులుగా ఉంచాలి. ఈ ఆసనం శరీరానికి, మనసుకు విశ్రాంతినిస్తుంది. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది.

మీ శరీరం, మనస్సును ఆరోగ్యంగా ఉంచడంలో యోగా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కనుక యోగాసనాలను మీ దినచర్యలో ఒక భాగంగా చేసుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)