AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Health Tips: ఈ మూడు ప్రాణాయామాలు వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయని తెలుసా..

వేసవిలో ఆరోగ్యంగా ఉండేందుకు తినే ఆహారంతో పాటు శారీరక శ్రమ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా శరీరం చల్లగా ఉండేందుకు కొన్ని ప్రాణాయామాలు మంచి సహాయకారి. ఈ సీజన్‌లో ప్రతి రోజూ ఉదయం 10 నుంచి 15 నిమిషాలు మూడు రకాల ప్రాణాయామం చేయడం వల్ల శరీరానికి చల్లదనం లభిస్తుంది. అంతేకాదు అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెప్పారు. ఈ రోజు ఆ ప్రాణాయామాల గురించి తెలుసుకుందాం..

Summer Health Tips: ఈ మూడు ప్రాణాయామాలు వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయని తెలుసా..
Yoga BenefitsImage Credit source: Deepak Sethi/E+/Getty Images
Surya Kala
|

Updated on: Apr 25, 2025 | 1:52 PM

Share

ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ వాతావరణంలోని వేడి, తేమ పెరుగుతాయి. దీంతో ఈ సమయంలో డీహైడ్రేషన్ సమస్యతో ఇబ్బంది పడడం సర్వ సాధారణం. అందుకనే వేసవి కాలంలో తినే ఆహారంతో పాటు సహజమైన పానీయాలు తీసుకోవడం మంచిది. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. అదేవిధంగా కొన్ని యోగా ఆసనాలు శరీరాన్ని చల్లబరుస్తాయి. శక్తిని కాపాడుతాయి.

యోగా మిమ్మల్ని శారీరకంగా దృఢంగా ఉంచడమే కాదు మానసిక ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అందువల్ల వేడి వల్ల కలిగే నీరసాన్ని, చిరాకును తగ్గించడానికి యోగా చేయవచ్చు. వేసవిలో శరీరాన్ని చల్లబరచడంలో కొన్ని ప్రాణాయామాలు సహాయపడతాయి. వీటిని చేయడం చాలా సులభం. కనుక మీరు ప్రతి రోజూ ఉదయం కొన్ని నిమిషాలు కేటాయించి చేయవచ్చు. నిపుణుల సలహా గురించి తెలుసుకుందాం.

యోగా నిపుణులు డా.సంపూర్ణ మాట్లాడుతూ వేసవిలో చంద్రభేది ప్రాణాయామం, శీతలీ, శీత్కారీ ప్రాణాయామం చేయడం ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. ఇవి శరీరానికి శీతలీకరణ ప్రభావాన్ని అందిస్తాయి. వేడి కారణంగా ఆమ్లత్వంతో బాధపడుతుంటే లేదా చెమట కారణంగా దురద .. దద్దుర్లు ఏర్పడతాయి. వేడి కారణంగా ఎండలో బయటకు వెళ్ళిన వెంటనే చిరాకు, తలనొప్పి వంటి సమస్యలు మొదలవుతాయి. ఇటువంటి సమస్యలున్న వారు ఈ ప్రాణాయామాలు చేయడం మేలు చేస్తుంది. అంతేకాదు మూత్ర విసర్జన సమయంలో మంటను తగ్గించడంలో ఈ ప్రాణాయామాలు సహాయపడతాయి. వీటిని ప్రతిరోజూ 10 నుంచి 15 నిమిషాలు చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

చంద్రభేది ప్రాణాయామం: వేసవి కాలంలో చంద్రభేది ప్రాణాయామం చేయడం చాలా ప్రయోజనకరం. ఒత్తిడిని తగ్గించడం , శరీరాన్ని చల్లబరచడమేకాదు ఇది అధిక రక్తపోటుకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిని ప్రతి ఉదయం చేయవచ్చు. ఈ ప్రాణాయామం చేయడానికి మొదట సుఖాసన స్థితిలోకి వచ్చి, తరువాత పద్మాసన స్థితిలోకి రావాలి. నిటారుగా కూర్చోవాలి. నడుము, మెడను నిటారుగా ఉంచండి. ఇప్పుడు మీ కుడి వైపు ముక్కును బొటనవేలితో నొక్కి, దీర్ఘమైన శ్వాస తీసుకొని కొన్ని సెకన్ల పాటు దానిని పట్టుకుని.. తర్వాత ముక్కుకి ఎడమ వైపు రంద్రం నుంచి గాలిని వదిలివేయాలి. ఇలా మళ్ళీ మళ్ళీ చేయండి. ఈ సమయంలో శ్వాసపై దృష్టి పెట్టండి.

సిత్కారి ప్రాణాయామం: శరీరాన్ని చల్లగా ఉంచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో, పిత్త దోషాన్ని నియంత్రించడంలో అలాగే అధిక రక్తపోటును నియంత్రించడంలో సిత్కారి ప్రాణాయామం సహాయపడుతుంది. ఈ ప్రాణాయామం చేయడానికి ముందుగా సౌకర్యవంతమైన స్థితిలో కూర్చోండి. నోరు తెరిచి, నాలుకను బయట ఉంచండి. నోటి ద్వారా గాలి పీల్చుకుని, ముక్కు ద్వారా గాలిని వదలండి.

శీతలి ప్రాణాయామం: శీతలి ప్రాణాయామం వేసవిలో శరీరాన్ని చల్లబరచడంలో కూడా సహాయపడుతుంది. దీన్ని చేయడానికి.. బహిరంగ ప్రదేశంలో కూర్చోండి. నడుము, మెడను నిటారుగా ఉంచండి. కళ్ళు మూసుకుని నాలుకను చాపి నోటి ద్వారా గాలిని లోపలికి పీల్చుకోండి, ఆ తర్వాత ముక్కు ద్వారా గాలిని బయటకు వదలండి. అంటే కుడి ముక్కు రంధ్రాన్ని వేలితో మూసివేసి, ముక్కు ఎడమ వైపు నుండి గాలిని వదలండి. అదేవిధంగా రెండవ సారి, ఎడమ ముక్కు రంధ్రంపై వేలు ఉంచి, కుడి ముక్కు రంధ్రం నుంచి గాలిని విడిచి పెట్టండి. ఇలా 7 నుంచి 8 సార్లు చేయండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్