ఓట్స్ ఇలా తింటే బోలెడు పోషకాలు మీ సొంతం.. ! టేస్ట్‌లో బెస్ట్, లాభాలు ఎవరెస్ట్..!!
ఈ రెండింటితో తయారు చేసిన ఈ హెల్తీ ఫుడ్ మీ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఓట్స్‌లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పండ్లలోని ఫైబర్ కూడా మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఈ ఆహారంలో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కలిగి ఉంటాయి, ఇది బరువు నిర్వహణకు సహాయపడుతుంది.

ఓట్స్ ఫ్రూట్ సలాడ్ అనేది ఒక ఆరోగ్యకరమైన ఆహారం. దీనిని తయారు చేయడం చాలా సులభం. కావలసిన పదార్థాలు ఓట్స్: 1 కప్పు, పెరుగు: 2 కప్పులు తీసుకోవాలి. మీరు కావాలంటే రుచికి తగినంత చక్కెర లేదంటే తేనెను కూడా కలుపుకోవచ్చు. పండ్లు: 1-2 కప్పులు తీసుకోవాలి. ఇందులోకి కావాల్సినన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇందులోనే చిటికెడు యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి.
ఇక తయారీ విధానంలోకి వెళితే.. ఓట్స్‌ను ఒక గిన్నెలో వేసి, పాలు లేదా పెరుగు పోయాలి. తేనె లేదా చక్కెర, యాలకుల పొడిని కలపాలి. బాగా కలిపి, 10-15 నిమిషాలు నానబెట్టాలి. పండ్లను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నానబెట్టిన ఓట్స్‌లో కట్ చేసిన పండ్లు, డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ బౌల్‌ని చల్లగా లేదా గది ఉష్ణోగ్రత వద్ద సర్వ్ చేసుకుని ఆరంగించేస్తే సరి..
ఓట్స్‌లో ఫైబర్, ప్రోటీన్ అనేక ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా నిండి ఉంటాయి. ఈ రెండింటితో తయారు చేసిన ఈ హెల్తీ ఫుడ్ మీ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఓట్స్‌లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పండ్లలోని ఫైబర్ కూడా మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఈ ఆహారంలో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కలిగి ఉంటాయి, ఇది బరువు నిర్వహణకు సహాయపడుతుంది.
పండ్లలోని విటమిన్ సి ఇతర యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఓట్స్‌లో బీటా-గ్లూకాన్ అనే ఫైబర్ ఉంటుంది, ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. పండ్లలోని యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఓట్స్, పండ్లు రెండూ సహజ శక్తిని అందిస్తాయి, ఇది రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. పండ్లలోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




