AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతిరోజూ గుప్పెడు పల్లీలు ఇలా తింటే.. పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే..

అధిక పనిభారం వల్ల చాలామంది వెన్నునొప్పితో బాధపడుతుంటారు. రోజంతా కూర్చోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. అలాంటి వారు రోజూ నానబెట్టిన పల్లీలను బెల్లంతో కలిపి తింటే ప్రయోజనం చేకూరుతుంది. వేరుశనగల్లోని విటమిన్లు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. ఉదయాన్నే నానబెట్టిన పల్లీలు తినడం వల్ల పిల్లలు, పెద్దల్లో మెదడు పనితీరు మెరుగుపడుతుంది.

ప్రతిరోజూ గుప్పెడు పల్లీలు ఇలా తింటే.. పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే..
Soaked Groundnuts
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 16, 2025 | 9:33 PM

పల్లీలు… వీటిని వేరు శనగలు అని కూడా అంటారు. ఇవి చాలా మంచి స్నాక్‌ ఐటమ్‌.. సాధారణంగా చాలా మంది పల్లీలను ఇష్టంగా తింటారు. ఇందుల్లో లిపిడ్లు, ఫాస్పరస్, ప్రోటీన్స్, విటమిన్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. అందుకే పల్లీలు కేవలం టైమ్‌పాస్‌ స్నాక్‌ మాత్రమే కాదు.. మంచి పోషకాహారం కూడా అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పల్లీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. అయితే ఈ పల్లీలను నానబెట్టి ప్రతిరోజూ ఉదయం తినడం వల్ల రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

శరీరానికి కావాల్సిన శక్తిని అందించడానికి నానబెట్టిన పల్లీలు తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పల్లీల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని నానబెట్టి తినడం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. నానబెట్టిన పల్లీలు ప్రతిరోజూ ఉదయం తినడం వల్ల గ్యాస్, ఎసిటిడీ తగ్గుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే పల్లీలు తింటే టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. నానబెట్టిన పల్లీలను మితంగా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న పల్లీలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఫైబర్ ఉన్న పల్లీలు తింటే కడుపు నిండిన భావన కలిగి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ ఉన్న పల్లీలు చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. వేరు శనగల్లో ప్రోటీన్స్ ఫుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాల దృఢత్వానికి సహాయపడతాయి. నానబెట్టిన పల్లీలు తినడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. నానబెట్టిన పల్లీల్లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. ప్రాణాంతక క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటాయి.

ఇవి కూడా చదవండి

పల్లీల్లోని ఐరన్, ఫోలెట్స్, కాల్షియం, జింక్ క్యాన్సర్ కణాల పెరుగుదలను మందగింపజేస్తాయి. అధిక పనిభారం వల్ల చాలామంది వెన్నునొప్పితో బాధపడుతుంటారు. రోజంతా కూర్చోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. అలాంటి వారు రోజూ నానబెట్టిన పల్లీలను బెల్లంతో కలిపి తింటే ప్రయోజనం చేకూరుతుంది. వేరుశనగల్లోని విటమిన్లు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. ఉదయాన్నే నానబెట్టిన పల్లీలు తినడం వల్ల పిల్లలు, పెద్దల్లో మెదడు పనితీరు మెరుగుపడుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పాక్‌తో యుద్ధం వస్తే.. ఇండియాలో ఈ ప్లేస్‌లు ఎంతో సేఫ్‌!
పాక్‌తో యుద్ధం వస్తే.. ఇండియాలో ఈ ప్లేస్‌లు ఎంతో సేఫ్‌!
ఉదయాన్నే అరచేతులు రుద్దుకుంటే ఇన్ని బెనిఫిట్సా..?
ఉదయాన్నే అరచేతులు రుద్దుకుంటే ఇన్ని బెనిఫిట్సా..?
ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ పిల్లలు వేసవిలో కూడా హ్యాపీగా ఉంటారు
ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ పిల్లలు వేసవిలో కూడా హ్యాపీగా ఉంటారు
కారులో వచ్చిన సీఐ సార్.. కులాసాగా కిరాణా సరుకులు కట్టమన్నాడు..
కారులో వచ్చిన సీఐ సార్.. కులాసాగా కిరాణా సరుకులు కట్టమన్నాడు..
టీ ప్రియులా.. మీరు ఎప్పుడైనా కొబ్బరి నీళ్ల టీ తాగారా..
టీ ప్రియులా.. మీరు ఎప్పుడైనా కొబ్బరి నీళ్ల టీ తాగారా..
వారికి నెల రోజుల సమ్మర్‌ సెలవులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
వారికి నెల రోజుల సమ్మర్‌ సెలవులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
ప్రతి చిన్న విషయానికి కోపంతో రగిలిపోతున్నారా..? వామ్మో..
ప్రతి చిన్న విషయానికి కోపంతో రగిలిపోతున్నారా..? వామ్మో..
పదవీ విరమణ పొందిన అబ్దుల్‌ అజీమ్‌కు ఘన సన్మానం
పదవీ విరమణ పొందిన అబ్దుల్‌ అజీమ్‌కు ఘన సన్మానం
May 2025 Horoscope: వారికి ఉద్యోగాల్లో హోదాలు పెరిగే ఛాన్స్..
May 2025 Horoscope: వారికి ఉద్యోగాల్లో హోదాలు పెరిగే ఛాన్స్..
సముద్ర మథనంలో లక్ష్మీదేవి సహా ఉద్భవించిన వస్తువులుఇవే ప్రాముఖ్యత
సముద్ర మథనంలో లక్ష్మీదేవి సహా ఉద్భవించిన వస్తువులుఇవే ప్రాముఖ్యత