వెయిట్ చెక్ చేసుకోవడానికి కరెక్ట్ టైమ్ ఎప్పుడో తెలుసా..? పర్ఫెక్ట్ రిజల్ట్ కోసం ఇలా చేయండి..!
ప్రతి రోజూ బరువు చూస్తే కరెక్ట్ గా చూపెట్టకపోవచ్చు. నిజమైన బరువును తెలుసుకోవాలంటే సరైన సమయం లోనే చూడాలి. ఉదయం ఖాళీ కడుపుతో చూసినప్పుడు కరెక్ట్ ఫలితం తెలుస్తుంది. పీరియడ్స్ ముందు, మలబద్ధకం ఉన్నపుడు, తిన్న వెంటనే బరువు చూడకూడదు. కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం మనం తీసుకునే ఆహారం, జీవనశైలి కారణంగా శరీర బరువు పెరగడం, తగ్గడం సహజం. అయితే శరీర బరువును తెలుసుకోవడం ద్వారా ఆరోగ్యంపై దృష్టిపెట్టే అవకాశం ఏర్పడుతుంది. కానీ ప్రతి రోజు బరువు చూసే తప్పు చాలా మంది చేస్తుంటారు. నిజంగా శరీర బరువు తెలుసుకోవాలంటే సరైన సమయం, సరైన విధానం పాటించడం ముఖ్యం. అప్పుడు మాత్రమే అసలైన ఫలితం తెలుస్తుంది.
ప్రతి రోజు బరువు చెక్ చేయడం వల్ల మనలో అసహనం పెరగచ్చు. రోజు రోజుకు శరీరంలో ఉండే నీటి శాతం, తిన్న ఆహారం మీద ఆధారపడి బరువులో తేడాలు వస్తుంటాయి. అందుకే నిపుణుల సూచన ప్రకారం వారానికి ఒక్కసారి మాత్రమే బరువు చూసుకోవడం ఉత్తమం.
ఉదయం లేచి ఏం తినకముందే బరువు చూసే అలవాటు పెంచుకోవాలి. ఎందుకంటే నిద్ర లేచిన వెంటనే శరీరంలోని నీటి శాతం స్థిరంగా ఉండటంతో ఆ సమయంలో తీసుకునే బరువు చాలా సమర్ధవంతంగా ఉంటుంది. ఇది నిజమైన బరువును సూచిస్తుంది.
మహిళలు పీరియడ్స్ రాక ముందు బరువు చూసినప్పుడు నిజమైన బరువు కంటే కొంచెం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో శరీరంలో హార్మోన్ల మార్పుల వల్ల నీరు ఎక్కువగా నిలిచిపోతుంది. దీంతో కడుపు ఉబ్బినట్టు అనిపించవచ్చు, బరువు పెరిగినట్టు కూడా అనిపిస్తుంది. కానీ ఇది తాత్కాలికం మాత్రమే. అందుకే పీరియడ్స్‌కు ముందు బరువు చూసి బరువు పెరిగారని బాధపడకండి. ఆ సమయంలో చూడకుండా తర్వాత చూడటం మంచిది.
మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నపుడు బరువు చూసినా అది అసలైన బరువు కాకపోవచ్చు. శరీరంలో వ్యర్థాలు సరిగ్గా బయటపడకపోవడం వల్ల బరువు ఎక్కువగా చూపించవచ్చు. కాబట్టి ముందుగా ఫైబర్ ఉన్న ఆహారం తినండి, నీటిని ఎక్కువగా తాగండి. తర్వాత బరువు చెక్ చేయండి.
చాలా మందికి రాత్రి పడుకునే ముందు బరువు చూడడం ఓ అలవాటుగా ఉంటుంది. అయితే ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే అప్పటి వరకూ మనం తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాలేదు కాబట్టి బరువు అసలైనదిగా కనిపించదు. ఫలితంగా ఎక్కువగా ఉందని అనిపించవచ్చు. అందుకే బరువు చూడటానికి రాత్రి సమయం సరైనది కాదు.
కొంతమందికి తిన్న వెంటనే బరువు చూడడం అలవాటు. కానీ అది అసలైన బరువు చూపించదు. ఎందుకంటే తిన్న ఆహారం ఇంకా పూర్తిగా జీర్ణం కాలేదు. అందుకే భోజనం చేసిన తర్వాత కనీసం 12 నుంచి 24 గంటలు గ్యాప్ ఇచ్చి బరువు చూడాలి. అప్పుడు మాత్రమే మీ నిజమైన శరీర బరువు ఎంత ఉందో స్పష్టంగా తెలుస్తుంది.