Women’s Day 2022: మహిళాదినోత్సవం సందర్భంగా మనదేశంలో మొదటి న్యూస్ రీడర్‌గా చరిత్ర సృష్టించిన.. మహిళ ఎవరో తెలుసా..
International Women's Day: ఆకాశంలో సగం... అవకాశాల్లో సగం.. అన్నింటా సగం.. అంటూ ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకల సంబరాలు అంగరంగ వైభంగా జరుపుకుంటున్నాము. ఈనెల 8న మహిళా దినోత్సవ వేడుక నేపథ్యంలో..
International Women’s Day: ఆకాశంలో సగం… అవకాశాల్లో సగం.. అన్నింటా సగం.. అంటూ ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకల సంబరాలు అంగరంగ వైభంగా జరుపుకుంటున్నాము. ఈనెల 8న మహిళా దినోత్సవ వేడుక నేపథ్యంలో విధిరాతను ఎదిరించి ఆత్మగౌరవానికి ప్రతీక నిలుస్తూ.. తమకంటూ చరిత్ర లో గుర్తింపు తెచ్చుకున్న మహిళలను గుర్తు చేసుకుందాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, భారతదేశం(India)లో భిన్నమైన గుర్తింపును కలిగి చరిత్ర సృష్టించిన మహిళా న్యూస్ ప్రెజెంటర్(Female news presenter) గురించి ఈరోజు తెలుసుకుందాం..
ప్రస్తుతం ఈ భాష ఆ భాష అని లేదు.. ఏ న్యూస్ ఛానల్ లో చూసినా జెంట్స్ న్యూస్ ప్రెజెంటర్ కంటే.. లేడీస్ ఎక్కువ. ఇంకా చెప్పాలంటే.. న్యూస్ రీడర్స్ గా ఇప్పుడు మహిళలదే హవా.. ఆకట్టుకునే రూపం, సమాజంపై అవగాహన, మంచి కంఠస్వరం ఉంటె చాలు.. న్యూస్ రీడర్ గా మహిళలు అవకాశాలు అందుకోవచ్చు.. తమదైన శైలీతో విషయం పరిజ్ఞానం కలిగి ఉంటె.. స్పెషల్ గుర్తింపు సొంతం చేసుకోవచ్చు. అయితే ఒకప్పుడు మన సంప్రదాయంలో మహిళలు ఇంటి నుంచి బయటకు రావడం అంటే చాలా తప్పుగా భావించేవారు. చదువు కూడా ఇంట్లోనే ఉపాధ్యాయుడిని నియమించి పరదా చాటున చెప్పించే వారు.. దీంతో అప్పట్లో ఇంటి నుంచి మహిళలు బయటకు రావడానికి వందసార్లు ఆలోచించేవాళ్లు.. అలాంటిది.. భారతీయ టీవి చరిత్రలోనే మొదటిసారిగా వార్తలు చదివింది ఒక మహిళ. అప్పట్లోనే దైర్యంగా కెమెరా ముందుకు వచ్చి.. వార్తలు చదివిన తొలి న్యూస్ రీడర్ గా చరిత్ర సృష్టించింది. ఇప్పుడే కాదు.. అప్పుడు కూడా న్యూస్ చదవడానికి మంచి అందం, మంచి కంఠస్వరం ఉన్నవారిని ఎంచుకునేది.
1965లో ఆల్ఇండియా రేడియోలో భాగమైన దూరదర్శన్ వార్తా ఛానల్ న్యూస్ ను ప్రేక్షకులకు అందించాలని భావించింది. దీంతో ఐదు నిమిషాల న్యూస్ బులెటిన్‌ను డిజైన్ చేశారు. అప్పుడు వారి దృష్టి.. ఆలిండియా రేడియోలో అనౌన్సర్‌గా పనిచేస్తున్న ప్రతిమా పూరీపై పడింది. అయితే సినీ నేపధ్య కుటుంబం నుంచి వచ్చిన ప్రతిమగానే పాపులర్ అయిన ఆమె అసలు పేరు విద్యా రావత్ ది. అందమైన రూపం.. ఆకట్టుకునే స్వరం ఉన్న ప్రతిమాతో ఐదు నిమిషాల న్యూస్ బులెటిన్ ను చదివించారు. అలా మనదేశంలో బుల్లితెరపై మొదటి న్యూస్ రీడర్ గా ప్రతిమా రికార్డ్ అడుగు పెట్టారు. 1965లో దేశంలోనే మొట్టమొదటి న్యూస్ రీడర్‌గా ప్రారంభమైన ప్రతిమ వార్తల ప్రస్థానం.. 1967 వరకు రెండేళ్ల పాటు నిర్విరామంగా కొనసాగింది. ప్రధాని నెహ్రు వంటి వారు సైతం ఆమె న్యూస్ బులెటిన్ ను చూసేవారు. ఇక ప్రతిమా మొట్టమొదటిసారిగా అంతరిక్షంలో కాలుమోపిన యూరీ గగారిన్‌ను ను ఇంటర్వ్యూ చేసి దూరదర్శన్ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. అంతేకాదు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ఎందరో ప్రముఖుల్ని సైతం ఇంటర్వ్యూ చేశారు. తాను న్యూస్ రీడర్ గా చేస్తూనే.. మరోవైపు కొత్తవారికి న్యూస్ రీడర్ గా ట్రైనింగ్ కూడా ఇచ్చేవారు. 2007 వరకు దూరదర్శన్‌కు ప్రతిమ తన సేవలను అందించారు. 2007లో తుది శ్వాస విడిచారు.
అయితే అప్పట్లో మనదేశంలో టీవీలు ఉన్న ఫ్యామిలీలను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు.. ఇంకా చెప్పాలంటే 1972 ఏడాది వరకూ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రమే టీవీలు ఉండేవి.
అయితే మహిళలు న్యూస్ రీడర్స్ గా నే కాదు.. మీడియాలో ప్రవేశించడానికి ప్రతిమా పూరీనే టార్చ్ బేరర్ ని చెప్పవచ్చు. మీడియాలో తమ గళం వినిపిస్తూ.. ప్రజల తరపున గొంతెత్తున్న ప్రతి న్యూస్ ప్రెజెంటర్ తెలుసుకోవాల్సిన వ్యక్తి ప్రతిమ. మీడియాలోని అనేక మందికి ఆమె ఆదర్శం.. మహిళాఅంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రతిమ ప్రతిభ గురించి గుర్తు చేసుకుంటూ శుభాకాంక్షలతో..
Also Read: