Tight Jeans: టైట్ జీన్స్ మీకూ ఇష్టమా? ఎంత డేంజరో తెలుసా..
అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ఇష్టపడే దుస్తుల్లో జీన్స్ ప్యాంట్స్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాయి. ముఖ్యంగా అమ్మాయిలు ధరించే జీన్స్ కాస్త భిన్నంగా ఉంటాయి. బిగుతుగా ఉంటాయి. ఇలాంటి దుస్తుల వల్ల అమ్మాయిలు లేనిపోని ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటూ ఉంటారు. అందుకే ఈ వేసవిలో మహిళలు ఇలాంటి జీన్స్..

జీన్స్ ప్యాంట్స్ యువత అత్యంత ఎక్కువగా ఇష్టపడే దుస్తుల్లో ఒకటి. అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ వీటిని ధరిస్తారు. ముఖ్యంగా అమ్మాయిలు ధరించే జీన్స్ కాస్త భిన్నంగా ఉంటాయి. బిగుతుగా ఉంటాయి. ఇలాంటి దుస్తుల వల్ల అమ్మాయిలు లేనిపోని ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటూ ఉంటారు. అందుకే ఈ వేసవిలో మహిళలు ఇలాంటి జీన్స్ వేసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బిగుతుగా ఉండే జీన్స్ ధరించడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మహిళలు ఈ సమస్యలకు గురవుతారు. జీన్స్ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, వాటిని ధరించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
టైట్ జీన్స్ వల్ల కలిగే సమస్యలు ఇవే..
జీన్స్ బిగుతుగా ఉంటే చర్మంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది చెమట బయటకు రాకుండా నిరోధిస్తుంది. ఇది చర్మం చికాకు, దద్దుర్లు, ఇతర చర్మ సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యలు ముఖ్యంగా తొడలు, మడమల చుట్టూ సాధారణంగా కనిపిస్తాయి. రక్త ప్రసరణ దెబ్బతింటుంది. టైట్ జీన్స్ వేసుకోవడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. దిగువ భాగాలకు తగినంత రక్త ప్రసరణ లేకపోవడం వల్ల తుంటి, తొడలు, కాళ్ళలో నొప్పి, వాపు వస్తుంది. ఇది చాలా కాలం పాటు కొనసాగితే నరాల సమస్యలు కూడా తలెత్తుతాయి. జీర్ణవ్యవస్థపై ప్రభావం.. చాలా బిగుతుగా ఉండే జీన్స్ కడుపుపై ఒత్తిడిని పెంచి జీర్ణవ్యవస్థ పనితీరును దెబ్బతీస్తాయి. దీనివల్ల మలబద్ధకం, అజీర్ణం, కడుపులో గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. ఎక్కువసేపు టైట్ జీన్స్ వేసుకోవడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. నరాల సమస్యలు… టైట్ జీన్స్ నరాలపై ఒత్తిడి తెస్తాయి. దీనివల్ల కాళ్లు, చేతులు తిమ్మిరి వస్తాయి. కొంతమందికి కాలేయ సమస్యలు, వెన్నునొప్పి కూడా రావచ్చు.
జీన్స్ ధరించేటప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలు
- సరిగ్గా సరిపోయే జీన్స్ మాత్రమే ధరించాలి. ఎక్కువ బిగుతుగా లేదా ఎక్కువ వదులుగా ఉండే జీన్స్ అసౌకర్యంగా ఉంటాయి.
- మీరు రోజంతా టైట్ జీన్స్ ధరించాల్సి వస్తే, అందుకు తగినంత విరామం తీసుకోవాలి. కొంతకాలం వదులుగా ఉండే దుస్తులు ధరించి, ఆపై వాటిని ఎంచుకోవాలి.
- కాటన్ మిశ్రమంతో తయారు చేసిన జీన్స్ ఎంచుకోవడం ఉత్తమం. ఇవి శరీరానికి మృదువుగా ఉంటాయి. అవి చెమటను విడుదల చేస్తాయి.
- జీన్స్ ని తరచుగా శుభ్రం చేయడం చాలా అవసరం. చెమట, దుమ్ము, ధూళి తొలగించడానికి ఎప్పటికప్పుడు వీటిని శుబ్రం చేయడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి.
- మీరు సరిగ్గా కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. టైట్ జీన్స్ వేసుకుని ఎక్కువసేపు ఒత్తిడితో కూర్చోవడం వల్ల వెన్నునొప్పి వస్తుంది.
- ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. పుష్కలంగా నీరు తాగాలి. ఇవి జీర్ణ సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.
- జీన్స్ వేసుకోవడం స్టైలిష్ గా కనిపించినప్పటికీ, కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మహిళలు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, ఎక్కువసేపు బిగుతుగా ఉండే జీన్స్ ధరించకూడదు. ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే సరైన ఫిట్ జీన్స్ ఎంచుకోవడం చాలా ముఖ్యం.
మరిన్ని జీవనశైలి కథనాల కోసం క్లిక్ చేయండి.