AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

French Fries: కప్పు ఫ్రెంచ్ ఫ్రైస్ 25 సిగరెట్లు కాల్చడంతో సమానం.. వీటి వల్ల గుండెకు ఎంత రిస్కో తెలుసా..?

ఫ్రెంచ్ ఫ్రైస్ రుచికరమైన ఆహారంగా కనిపించినా ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తాయి. ధూమపానంతో సమానమైన ప్రమాదాలను కలిగి ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేయించిన ఆహారాలలో ట్రాన్స్ ఫ్యాట్స్ సాధారణంగా కనిపిస్తాయి. అధిక ఉష్ణోగ్రతల వద్ద నూనె వేడి చేయడం ద్వారా ఇవి ఉత్పత్తి అవుతాయి. నూనెను ఎక్కువ సార్లు ఉపయోగించడం వల్ల ట్రాన్స్ ఫ్యాట్స్ స్థాయిలు పెరుగుతాయి. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధన ప్రకారం ట్రాన్స్ ఫ్యాట్స్ కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని పెంచుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.

French Fries: కప్పు ఫ్రెంచ్ ఫ్రైస్ 25 సిగరెట్లు కాల్చడంతో సమానం.. వీటి వల్ల గుండెకు ఎంత రిస్కో తెలుసా..?
French Fries Health Issues
Bhavani
|

Updated on: Mar 28, 2025 | 1:46 PM

Share

ఫ్రెంచ్ ఫ్రైస్ తరచుగా తినడం వల్ల ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదాలు ఉన్నాయని ఇటీవలి అధ్యయనాలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. బరువు పెరగడం, గుండె సమస్యలు, క్యాన్సర్ ప్రమాదం పెరగడం జరుగుతుందని వారు తెలిపారు. ఫ్రైయింగ్ సమయంలో ఏర్పడే ట్రాన్స్ ఫ్యాట్స్, కార్సినోజెనిక్ సమ్మేళనాలు గుండెకు హాని కలిగిస్తాయని వెల్లడించారు. ఒక సర్వింగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం 25 సిగరెట్లు సిగరెట్లు కాల్చడంతో సమానమని నిపుణులు చెప్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రియమైన స్నాక్

ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన స్నాక్. బర్గర్లతో లేదా సింగిల్ గా ఆర్డర్ చేసుకుని తినడానికి చాలా మందికి ఇష్టమైన ఆహారం ఇది. క్రిస్పీ టెక్స్చర్, ఉప్పు రుచి వాటిని మరింత టేస్టీగా మార్చేస్తాయి. కానీ ఈ రుచికర ఆహారం వెనుక తీవ్ర ఆరోగ్య సమస్య దాగి ఉంది. తరచుగా తినడం ద్వారా బరువు పెరగడం, గుండె ఆరోగ్యం దెబ్బతినడం, క్యాన్సర్ ప్రమాదం పెరగడం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

తయారీ విధానంలోని ప్రమాదం

ఫ్రెంచ్ ఫ్రైస్ అధిక ఉష్ణోగ్రతల వద్ద నూనెలో డీప్ ఫ్రై చేసి తయారు చేస్తారు. ఈ ప్రక్రియలో అనారోగ్యకర సమ్మేళనాలు ఏర్పడతాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ వేయడానికి ఏ నూనె ఉపయోగించారో, ఆ నూనె ఎన్నిసార్లు తిరిగి ఉపయోగించారో తెలియదు. నూనెను పదేపదే వేడి చేయడం ద్వారా ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఏర్పడతాయి. ఇవి గుండెకు హాని కలిగిస్తాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ శరీరంలో పేరుకుపోయి కార్డియోవాస్కులర్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. దీర్ఘకాల నష్టం కలిగిస్తాయి.

ట్రాన్స్ ఫ్యాట్స్, క్యాన్సర్ సంబంధం

ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం ధూమపానం కంటే హానికరం. ధూమపానం గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, శ్వాసకోశ సమస్యలకు కారణమవుతుందని తెలిసిన విషయం. కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ వినియోగం కూడా తీవ్ర పరిణామాలను కలిగిస్తుంది. ఇందులోని ఉప్పు అధిక ఉప్పు రక్తపోటును పెంచుతుంది. హైపర్‌టెన్షన్ గుండె జబ్బులు, స్ట్రోక్‌కు కారణమవుతుంది. ఎక్కువ సోడియం గుండె, రక్తనాళాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. కార్డియోవాస్కులర్ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది ధమనులు అడ్డుకోవడానికి, గుండెపోటు, స్ట్రోక్ రిస్క్ ను పెంచుతుంది. డీఎన్‌ఏను సైతం దెబ్బతీస్తాయి.

ఊబకాయంతో సంబంధం

ఫ్రెంచ్ ఫ్రైస్ లో అధిక కేలరీలు, అనారోగ్యకర కొవ్వులు, ఉప్పు ఉంటాయి. క్రమం తప్పకుండా తినడం ద్వారా బరువు పెరుగుతారు. హార్వర్డ్ T.H. చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్యయనం ప్రకారం ఫ్రెంచ్ ఫ్రైస్ తినే వ్యక్తులు ఆరోగ్యకర స్నాక్స్ తినేవారితో పోలిస్తే బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. 20 సంవత్సరాల పాటు 120,000 మందిని అనుసరించిన ఈ అధ్యయనం వేయించిన బంగాళదుంపలు తినడం నాలుగు సంవత్సరాలకు సగటున 1.5 పౌండ్ల బరువు పెరుగుదలతో ముడిపడి ఉందని కనుగొన్నారు.