Health Tips: చలికాలంలో ఆస్తమా రోగుల సమస్యలు పెరుగుతాయి.. నివారణ చర్యలు తీసుకోండి ఇలా..
వాతావరణ కాలుష్యం కారణంగా కఫంతో ఇబ్బంది పడతారు. ఈ లక్షణాలతో ఆస్తమా రోగులు సాధారణంగా శీతాకాలంలో ఇబ్బంది పడతారు. ఆస్తమాకు శాశ్వత నివారణ లేదు. సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అదుపులో ఉంచుకోవచ్చు. కనుక ఆస్తమా రోగులు చలి కాలంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ప్రాధమిక చర్యల ద్వారా చలికాలంలో ఆస్తమా రోగులు ఇబ్బంది పడకుండా ఉండవచ్చు. ఈ రోజు ఆ చర్యలు ఏమిటో తెలుసుకుందాం..

మారిన వాతావరణంతో పాటు శరీరంలో కూడా అనేక మార్పులు వస్తాయి. ముఖ్యంగా కొందరు సీజనల్ వ్యాధుల బారిన పడుతూ ఉంటారు. శీతాకాలంలో వచ్చే వాతావరణ మార్పుల్లో భాగంగా ఆస్తమా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. చలి తీవ్రత అధికం అయితే ఆస్తమా రోగులు ఇబ్బందులు పెరుగుతున్నాయి. ఉబ్బసం అనేది శ్వాసకోశ సమస్య. ఈ వ్యాధి బారిన పడిన వారు శ్వాసనాళంలో వాపు, అడ్డంకులు ఏర్పడతాయి. దీని కారణంగా రోగికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. అంతేకాదు దగ్గు సమస్య కూడా అధికంగా ఉంటుంది. శ్వాసకోశంలో ఏర్పడే అడ్డంకి కారణంగా శ్వాస కోస వాపు వస్తుంది. వాతావరణ కాలుష్యం కారణంగా కఫంతో ఇబ్బంది పడతారు. ఈ లక్షణాలతో ఆస్తమా రోగులు సాధారణంగా శీతాకాలంలో ఇబ్బంది పడతారు. ఆస్తమాకు శాశ్వత నివారణ లేదు. సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అదుపులో ఉంచుకోవచ్చు. కనుక ఆస్తమా రోగులు చలి కాలంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ప్రాధమిక చర్యల ద్వారా చలికాలంలో ఆస్తమా రోగులు ఇబ్బంది పడకుండా ఉండవచ్చు. ఈ రోజు ఆ చర్యలు ఏమిటో తెలుసుకుందాం..
ధూమపానానికి దూరంగా
ధూమపానం ఆస్తమా సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. ధూమపానం వల్ల గొంతులో కఫం పేరుకుపోతుంది. ఇది ఆస్తమా రోగులను మరింత ఇబ్బంది పెడుతుంది. కనుక ఆస్తమా రోగులు ధూమపానానికి దూరంగా ఉండాలి.
కాలుష్యం నుండి రక్షణ:
కాలుష్య బారిన పడకుండా ఆస్తమా బాధితులు ఉండాలి. అయితే బయటికి వెళ్ల కుండా ఉండడం కష్టం. వీలయితే ఆస్తమా రోగులు వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా ఉండాలి. ఇంటిలో ఉండి పని చేయగలిగితే అది ఆస్తమా వ్యాధి గ్రస్తులకు మంచిది. బయటకు వెళ్లాల్సి వస్తే మాస్క్ ధరించి మాత్రమే బయటకు వెళ్లాలి.
ధుమ్ము ధూళి ప్రాంతంలో
దుమ్ము, ధూళి, మట్టి రేణువులు విపరీతంగా ఉండే వాతావరణంలో ఆస్తమా బాధితులు నివసించవద్దు లేదా ఏదైనా రసాయనాలు లేదా చెత్తను కాల్చే సమయంలో అలాంటి ప్రదేశాలకు వెళ్లవద్దు.
ఇంటి పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి
ఇంట్లో దుమ్ము ధూళి ఉంచుకోవద్దు. పరిశుభ్రంగా ఇంటిని ఉంచుకోవాలి. దుప్పట్లు, స్వెటర్లపై ఉండే ఫైబర్స్ కూడా ఆస్తమా సమస్యలను పెంచుతాయి. కనుక ఈ వస్తువులను వీలైనంత శుభ్రంగా ఉంచండి.
వాకింగ్, యోగా చేయండి
ఉబ్బసం రోగులు తమ రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ప్రతిరోజూ ఉదయం నడక లేదా యోగా చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. బయటకు వెళ్ల లేనివారు ప్రతిరోజూ అరగంట పాటు ఇంట్లో నడవవచ్చు లేదా యోగా చేయవచ్చు.
సాధారణ ఆహారం తినండి
ఆస్తమా పేషెంట్ ఎంత తక్కువ మసాలా ఆహారం తింటే అంత మంచిది. వేయించిన ఆహారానికి కూడా దూరంగా ఉండాలి. కనుక సాధారణ ఆహారాన్ని తినండి.
సమయానికి తగిన మందులు
ఉబ్బసం రోగులు ప్రతిరోజూ మందులను క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా ముఖ్యం. ఆస్తమా వ్యాధితో ఇబ్బంది పడేవారు మందులు తీసుకోకుంటే.. అప్పుడు సమస్య పెరుగుతుంది.
ఎల్లప్పుడూ ఇన్హేలర్ కలిగి ఉండండి
ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ ఇన్‌హేలర్‌ను ఉంచుకోండి. ఇంటి నుండి బయటకు వెళ్లవలసి వస్తే ఎల్లప్పుడూ ఇన్హేలర్ ఉంచుకోవాలి
తగినంత నిద్ర పోవాలి
తక్కువ సమయం నిద్రపోయే వ్యక్తుల్లో ఆస్తమా 1.5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కనుక ఆస్తమా 7-8 గంటల పాటు తగినంత నిద్ర తీసుకోవాలి. తద్వారా ఆస్తమా బాధితులు శీతాకాలంలో ప్రమాదాల బారిన పడే ప్రమాదం తక్కువగా ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..