Winter Ghee: చలికాలంలో నెయ్యి తింటే ఏమవుతుందో తెలుసా..?
దీన్ని రెగ్యులర్‌గా వాడితే చర్మం కాంతిమంతం అవుతుంది. నెయ్యిని మితంగా తినడం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అతిగా ఆకలి వేయకుండా నివారిస్తుంది. నెయ్యిలో కాంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు దాదాపుగా అందరికీ తెలిసిందే. అయితే, చలికాలంలో నెయ్యి వినియోగం ఎన్ని లాభాలు కలిగిస్తుందో తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు. నెయ్యిలో హెల్తీ ఫ్యాట్స్, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. చలికాలంలో కొద్దిగా నెయ్యి తీసుకోవడం ద్వారా చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది. యవ్వనంగా కనిపిస్తారు. అంతేకాదు, ఆరోగ్యపరంగా కూడా నెయ్యి అద్భుతమైన ప్రయోజనాలు కలిగిస్తుంది. నెయ్యిలోని యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాల కారణంగా ఎగ్జిమా, సోరియాసిస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. దీంతో, చర్మంపై ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా తగ్గి వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. పెదవుల పగుళ్లకు నెయ్యి గొప్ప పరిష్కారం. తరచూ నెయ్యిని ముఖానికి రాసుకునే వారు దీర్ఘకాలంలో రంగు తేలుతారు.
నెయ్యిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. శరీరాన్ని ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి కాపాడతాయి. నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు చర్మానికి పోషణనిచ్చి తేమగా ఉంచుతాయి. నెయ్యిలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోజంతా మిమ్మల్ని శక్తిమంతంగా ఉంచడంలో సహాయపడతాయి. నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు మెదడు పనితీరుకు సహాయపడతాయి.
నెయ్యి ఓ సహజసిద్ధమైన మాయిశ్చరైజర్. ఇందులోని ఫ్యాటీ యాసిడ్స్ కారణంగా తేమ శాతం పెరిగి చర్మంపై పొలుసులు లేవడం తగ్గుతుంది. పగుళ్లు కూడా మటుమాయం అవుతాయి. నెయ్యిలోని యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా చర్మం సున్నితంగా మారుతుంది. చిన్న చిన్న ముడతలు తొలగిపోతాయి. దీన్ని రెగ్యులర్‌గా వాడితే చర్మం కాంతిమంతం అవుతుంది. నెయ్యిని మితంగా తినడం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అతిగా ఆకలి వేయకుండా నివారిస్తుంది. నెయ్యిలో కాంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




