Smart Phones: ఉదయాన్నే నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా..? జాగ్రత్త మీకే తెలియకుండా ఆ విషయాల్లో..
మనలో మెజారిటీ వ్యక్తులకు ఉదయం నిద్రలేచిన వెంటనే చేసే మొదటి పని ఫోన్ చూడటం. కళ్లు తెరవగానే చేతిలోకి మొబైల్ ఫోన్ తీసుకుని స్క్రోలింగ్ చేస్తూ బెడ్‌పైనే గడిపేస్తారు. స్మార్ ఫోన్ వచ్చాక ప్రతిదీ దానిపైనే ఆధారపడటం అందుకు ముఖ్య కారణం. కుటుంబం, స్నేహితులు కమ్యూనిటీతో కనెక్ట్ అవ్వడం మొదటు జీపీఎస్ ద్వారా అడ్రస్ కనుగొనడం వరకూ అన్ని పనులకు స్మార్ట్‌ఫోన్ మీదే..

మనలో మెజారిటీ వ్యక్తులకు ఉదయం నిద్రలేచిన వెంటనే చేసే మొదటి పని ఫోన్ చూడటం. కళ్లు తెరవగానే చేతిలోకి మొబైల్ ఫోన్ తీసుకుని స్క్రోలింగ్ చేస్తూ బెడ్‌పైనే గడిపేస్తారు. స్మార్ ఫోన్ వచ్చాక ప్రతిదీ దానిపైనే ఆధారపడటం అందుకు ముఖ్య కారణం. కుటుంబం, స్నేహితులు కమ్యూనిటీతో కనెక్ట్ అవ్వడం మొదటు జీపీఎస్ ద్వారా అడ్రస్ కనుగొనడం వరకూ అన్ని పనులకు స్మార్ట్‌ఫోన్ మీదే ఆధారపడుతున్నాం.
దీంతో స్మార్ట్‌ఫోన్ లేకుండా క్షణం కూడా ఉండలేని పరిస్థితికి చేరిపోయాం. నిజానికి ఫోన్‌ల అధికంగా వినియోగం శరీరం, మనస్సుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.IDC అధ్యయనం ప్రకారం 80 శాతం మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తొలి 15 నిమిషాలలోపు తమ మొబైల్ ఫోన్‌ను తనిఖీ చేస్తున్నారు. అయితే నిద్ర లేచిన నిమిషాల వ్యవధిలోనే ఫోన్‌ని చెక్ చేస్తే ఎదుర్కొనే అనారోగ్య సమస్యలు ఏవంటే..
ఒత్తిడి పెరిగిపోతుంది. ఫోన్‌కు వచ్చిన కొత్త మెసేజ్‌లు, ఇమెయిల్‌లు, నోటిఫికేషన్లు, సోషల్ మీడియా అప్‌డేట్లు ఒత్తిడిని, ఆందోళనను కలిగిస్తాయి. ఇది ప్రశాంతమైన జీవనశైలికి అంతరాయం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా నిద్రలేవగానే ఫోన్ చెక్ చేయడం వల్ల మీ మనసులో ప్రతికూలతలు పెరిగి రోజంతా ఆ ప్రభావం కనిపించే అవకాశం ఉందని ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ నికోల్ బెండర్స్-హాడి పేర్కొన్నారు.
అలాగే స్వీడన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ గోథెన్‌బర్గ్ చేసిన ఓ అధ్యయనం ప్రకారం.. మొబైల్ ఫోన్‌ల వినియోగం యువతలో నిద్రలేమి, డిప్రెషన్ ప్రభావం నేరుగా పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. నిద్రలేచిన వెంటనే ఫోన్‌ని చెక్ చేయడం వలన మీ మనస్సు చెదిరిపోవడమే కాకుండా, మిగిలిన రోజంతా పరధ్యానానికి టోన్ సెట్ చేస్తుంది. ఉదయాన్నే మీ ఫోన్‌లో వివిధ సమాచారం కోసం వెతకడం, వాట్సప్‌లో మెసేజ్‌లు చెక్ చేయడం వల్ల దాని ప్రభావం మెదడు సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని అధ్యయనంలో బయటపడింది. ఈ ప్రభావం మానసిక స్థితిపైనా ప్రతికూలంగా ఉంటుందని, కంటి ఆరోగ్యమూ దెబ్బ తింటుందని అధ్యయనాలు చెప్తున్నాయి. అంతేకాకుండా మీ పని ఉత్పాదకత కూడా గణనీయంగా తగ్గుతుందట.
శారీరక రుగ్మతలు
స్మార్ట్‌ఫోన్‌లను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల నెక్ సిండ్రోమ్, కంటి చూపు సమస్యలు, అధిక బరువు లేదా ఊబకాయం వంటి సమస్యలు అధికంగా తలెత్తుతాయని పరిశోధనలో తేలింది. ఫోన్ వాడకం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలను అధ్యయనంలో భాగంగా క్యాన్సర్, ట్రాఫిక్ ప్రమాదాలు, విద్యుదయస్కాంత వికిరణాలు, మెదడు కార్యకలాపాల్లో మార్పులు, నిద్ర విధానాలు వంటి మొదలైన వాటిపై పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. దీనిలో భాగంగా నిద్రలేవగానే ఫోన్ చూడటం మానసిక, శారీరక ఆరోగ్యం ప్రభావితమవుతుందని పరిశోధకులు కనుగొన్నారు.
స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని పూర్తిగా నివారించలేకపోయినప్పటికీ కొన్ని విషయాల్లో ఫోన్ వినియోగాన్ని మినహాయించవచ్చు. అవేంటంటే.. నిద్రపోయే ముందు మొబైల్ డేటాను ఆఫ్ చేయడం లేదా మీ ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో ఉంచడం. మీ స్మార్ట్‌ఫోన్‌లో అలారం సెట్ చేయకూడదు. బదులుగా క్లాసిక్ అలారం గడియారంలో ‘వేక్-అప్ కాల్’ని సెట్ చేసుకోవడం. ఉదయాన్నే ఫోన్ చూడటానికి బదులు ధ్యానం చేయడం, గ్లాసు గోరువెచ్చని నీళ్లు త్రాగడం, వ్యాయామం చేయడం ఇతర ముఖ్యమైన పనులపై ధ్యాస పెట్టడం వంటి పనులు చేసుకుంటూ పోతే మీ లైఫ్‌స్టైల్ కొన్ని రోజుల్లోనే మారిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.








