Milk Side Effect: వీరికి పాలు విషంతో సమానం.. పొరపాటున కూడా వాటి జోలికి వెళ్లకండి!
పాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాలు తాగడం వల్ల మనకు ఆనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఇన్ని ప్రయోజనాలను ఉన్నప్పటికీ పాలు తాగడం వల్ల కూడా కొన్ని సమస్యలు ఉన్నాయియంటే మీరు నమ్ముతారు. నమ్మాల్సిందే ఎందుకంటే.. పాలు అందరికీ ఒకే రకమైన ప్రయోజనాలను అందించలేవు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పాలకు ఎంతదూరంగా ఉంటే అంతమంచిదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పాలు ఎవరు, ఎందుకు తాగకూడదో తెలుసుకుందాం.

పాలు మన ఆరోగ్యానికి చాలా మంచివని అందరికీ తెలిసిన విషయమే. చిన్నప్పటి నుంచి పాలు తాగడం వల్ల శరీరానికి బలం చేకూరుతుందని, ఎముకలు బలపడతాయని, బలహీనత తగ్గుతుందని మనం విన్నాం , చదివాం. మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాలన్ని పాలలో పుష్కలంగా ఉంటాయి. అందుకే పాలను రోజువారీ ఆహారంలో ముఖ్యమైన భాగంగా పరిగణిస్తారు. అయితే మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కొన్ని సమస్యలు ఉన్నవారు పాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పాలు ఎవరికి సురక్షితం, ఎవరు పాలకు దూరంగా ఉండాలో నిపుణుల ప్రకారం తెలుసుకుందాం.
పాలు ఎవరు తీసుకోకూడదు, ఎందుకు?
RML హాస్పిటల్ వైద్య విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ సుభాష్ గిరి ప్రకారం.. పాలు అందరికీ ప్రయోజకరమైనవి కావు. ఎందకంటే పాలలో లాక్టోస్ ఉంటుంది. లాక్టోస్ అసహనం ఉన్నవారిలో లాక్టేజ్ ఎంజైమ్ తక్కువ స్థాయిలో ఉంటుంది. ఇది పాలను జీర్ణం చేయడాన్ని కష్టతరం చేస్తుంది. దీని వల్ల గ్యాస్, కడుపు నొప్పి ,విరేచనాలు వంటి సమస్యలకు దారితీస్తుంది. కొంతమందికి పాల అలెర్జీ లేదా శ్లేష్మం లేదా కఫం సమస్యలు కూడా ఎదురవుతాయి.
అలాగే జలుబు, శ్వాసకోస సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా పాలకు కొంచెం దూరంగా ఉండాలి. ఎందుకుంటే ఇది జలుబు సంబంధిత లేదా శ్వాసకోశ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా పాలకు కొంచెం దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే దీని పాలు త్వరగా జీర్ణం అవ్వవు. అలాగే చర్మ సమస్యలు ఉన్నవారు పాలను అవైడ్ చేయడం ఉత్తమం. ఎందుకంటే పాలు తాగడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు పెరుగుతాయి. మీ ముఖంపై మొటిమెలు ఉంటే అవి ఇంకా పెరుగుతాయి.
నివారణ చర్యలు
పాలు తాగడం వల్ల కలిగే సమస్యలను నివారించడానికి, మీరు పెరుగు, మజ్జిగ లేదా లాక్టోస్ లేని పాలు తీసుకోవచ్చు, ఇవి సులభంగా జీర్ణమవుతాయి. చర్మం లేదా కడుపు సంబంధిత సమస్యల విషయంలో, వైద్యుడిని లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
