Chicken Liver: చికెన్ లివర్ తింటున్నారా..? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
చికెన్ అంటే ఇష్టపడనివారు అరుదు. అయితే చాలామంది చికెన్ లివర్ తినడానికి ఆసక్తి చూపరు. కానీ వైద్య నిపుణుల ప్రకారం, చికెన్ కాలేయం అనేక పోషకాలకు, ముఖ్యంగా బి విటమిన్లు, విటమిన్ ఎ లకు నిలయం. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అలాగే కళ్ళు, చర్మం, జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

చికెన్ అనగానే నాన్-వెజ్ చాలామందికి నోరు ఊరుతుంది. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చికెన్‌ను ఇష్టంగా తింటారు. చికెన్ మంచూరియా, చికెన్ ఫ్రై, చికెన్ 65, చికెన్ కర్రీ, గ్రీన్ చికెన్, గోంగూర చికెన్, చికెన్ బిర్యానీ వంటి అనేక రకాల వంటకాలను మనం ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తాం. కొందరు రోజు చికెన్ పెట్టినా కూడా ఎలాంటి మొహమాటం లేకుండా తినేస్తుంటారు. చికెన్ తినడం వల్ల మన శరీరానికి ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. అయితే, చికెన్ మంచి ఆహారమే అయినా, ప్రతిరోజూ అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఏ ఆహారమైనా పరిమితంగా తింటేనే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
సాధారణంగా చికెన్ ప్రియులలో కూడా కొంతమంది చికెన్ లివర్‌ను తినడానికి అస్సలు ఇష్టపడరు. మరికొందరు లివర్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని భయపడి దూరంగా ఉంటారు. అయితే, వైద్య నిపుణులు చికెన్ లివర్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని.. తప్పనిసరిగా తినాలని చెబుతున్నారు. వాస్తవానికి, చికెన్ కాలేయం పోషకాల గని. ఇందులో శరీరానికి అవసరమైన అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి.
చికెన్ లివర్‌లో బి విటమిన్ అధికంగా ఉంటుంది. ఈ బి విటమిన్లు గర్భిణులకు ఎంతో మేలు చేస్తాయి. వారికి అవసరమైన శక్తిని అందిస్తాయి. అంతేకాకుండా, ఇవి శరీరంలోని రక్తాన్ని ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. రక్తహీనతతో బాధపడుతున్న వారికి చికెన్ లివర్ ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది. రక్తహీనతతో పాటు, కణాల సమస్యలు, కంటి సమస్యలు, గోళ్ల సమస్యలు ఉన్నవారికి కూడా లివర్ తీసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని గణనీయంగా పెంచుతుంది.. తద్వారా శరీరం వ్యాధుల బారిన పడకుండా రక్షించబడుతుంది.
విటమిన్ ఏ కూడా చికెన్ లివర్‌లో పుష్కలంగా లభిస్తుంది. ఈ విటమిన్ కళ్ళు, చర్మం, జుట్టు ఆరోగ్యానికి కీలక పాత్ర పోషిస్తుంది. చక్కటి దృష్టి, ఆరోగ్యకరమైన చర్మం, ఒత్తుగా ఉండే జుట్టు కోసం విటమిన్ ఏ ఎంతో అవసరం. చికెన్ లివర్ ఈ పోషకాలన్నింటినీ అందించడం ద్వారా శరీరానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. ఈ కారణాల వల్లనే ఇప్పుడు చాలామంది చికెన్ లివర్ తినడానికి ఆసక్తి చూపుతున్నారు.. దాని ఆరోగ్య ప్రయోజనాలను గుర్తించి తమ ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు.
చికెన్ లివర్‌లో అత్యధిక పోషకాలు ఉంటాయని.. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు. ఏమైనా సమస్యలుంటే మాత్రం తప్పనిసరిగా.. వైద్య నిపుణులను సంప్రదించిన తర్వాత తీసుకోవడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
