White Onion: తెల్ల ఉల్లిపాయలు తింటే ఏమౌతుందో తెలుసా? చాలా మందికి తెలియని విషయాలు..
ప్రతి వంటగదితో ఖచ్చితంగా కనిపించే కూరగాయల్లో ఉల్లిపాయలు ఒకటి. ఉల్లిపాయలను సాధారణంగా అన్ని రకాల వంటకాల్లోనూ ఉపయోగిస్తుంటాం. ఐతే వీటిల్లో రెండు రకాల..
White Onion health benefits in telugu: ప్రతి వంటగదితో ఖచ్చితంగా కనిపించే కూరగాయల్లో ఉల్లిపాయలు ఒకటి. ఉల్లిపాయలను సాధారణంగా అన్ని రకాల వంటకాల్లోనూ ఉపయోగిస్తుంటాం. ఐతే వీటిల్లో రెండు రకాల ఉల్లిపాయలు ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. కొన్ని ఎర్రగానూ, మరికొన్ని తెల్లగానూ ఉంటాయి. వీటిల్లో ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుందనే విషయంలో చాలా మందికి క్లారిటీ లేదు. నిజానికి తెల్ల ఉల్లిపాయల్లో పీచు పదార్ధం పుష్కలంగా ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. దీనిలో శరీరంలో సులువుగా కరిగిపోయే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఆరోగ్యంగా ఉండటానికి తెల్ల ఉల్లిపాయను తినవచ్చని నిపుణులు అంటున్నారు. తెల్ల ఉల్లిపాయల్లో శరీరానికి చలువ చేసే గుణాలు ఉంటాయి. ఇది వడదెబ్బ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
తెల్ల ఉల్లిపాయలు తింటే గుండె జబ్బులు కూడా తగ్గుతాయనేది నిపుణుల మాట. వీటిల్లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధిక రక్తపోటును అదుపులో ఉంచి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా తెల్ల ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు నిండుగా ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. తెల్ల ఉల్లిపాయలను తరచూ తింటే సీజనల్ వ్యాధుల భారీన పడకుండా రక్షణ కల్పిస్తాయి. వీటిల్లోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతాయి.
మరిన్ని తాజా ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.