Interesting Facts: ఆకుపచ్చ, ఎరుపు, నలుపు ద్రాక్షలో ఏది హెల్త్‌కి బెస్ట్!
చాలా మంది ద్రాక్ష పళ్లను ఇష్టంగా తింటూ ఉంటారు. ద్రాక్షలో ఎక్కువగా పచ్చ, నలుపువి కనిపిస్తూ ఉంటారు. ఎరుపు రంగులో ఉండే ద్రాక్ష చాలా తక్కువగా లభ్యమవుతూ ఉటుంది. కొంత మందికి పచ్చవి అంటే ఇష్టం. మరికొంత మందికి నలుపువి అంటే ఇష్టం. ఇంకొంత మంది ఎరుపు తింటారు. ఈ గ్రేప్స్ కలర్స్‌లో ఎన్నో రకాలు ఉంటాయి. తియ్యగా, పుల్లగా ఉంటాయి. అయితే వీటిలో ఏది తింటే మంచిది అన్న డౌట్ చాలా మందిలో వచ్చే ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్..

చాలా మంది ద్రాక్ష పళ్లను ఇష్టంగా తింటూ ఉంటారు. ద్రాక్షలో ఎక్కువగా పచ్చ, నలుపువి కనిపిస్తూ ఉంటారు. ఎరుపు రంగులో ఉండే ద్రాక్ష చాలా తక్కువగా లభ్యమవుతూ ఉటుంది. కొంత మందికి పచ్చవి అంటే ఇష్టం. మరికొంత మందికి నలుపువి అంటే ఇష్టం. ఇంకొంత మంది ఎరుపు తింటారు. ఈ గ్రేప్స్ కలర్స్‌లో ఎన్నో రకాలు ఉంటాయి. తియ్యగా, పుల్లగా ఉంటాయి. అయితే వీటిలో ఏది తింటే మంచిది అన్న డౌట్ చాలా మందిలో వచ్చే ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్ తెలుసుకుందాం రండి.
ఆకు పచ్చ ద్రాక్ష:
పలు అధ్యయనాల ప్రకారం ఆకు పచ్చ ద్రాక్షలో పోషకాలన్నీ లభ్యమవుతాయి. కేలరీలు, ప్రోటీన్, విటమిన్లు సి, కె, ఫైబర్ వంటివి ఉంటాయి. చాలా మంది ఈ ఆకు పచ్చ గ్రేప్స్ ని సలాడ్స్ కూడా ఉపయోగిస్తూ ఉంటారు.
నల్ల ద్రాక్ష:
నల్ల ద్రాక్ష ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి చాలా బెటర్ అని వైద్యులు, అధ్యయన కర్తలు కూడా చెబుతూ ఉంటారు. నల్ల ద్రాక్షలో కూడా తీపి, పుల్లవి ఉంటాయి. ఎక్కువగా నల్ల ద్రాక్షను జ్యూస్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. అంతే కాకుండా ఇందులో కూడా కేలరీలు, ప్రోటీన్, విటమిన్లు సి, కె, ఫైబర్ వంటివి లభ్యమవుతాయి. ఈ నల్ల ద్రాక్ష తినడం వల్ల.. క్యాన్సర్ కణాలను నశింపజేస్తుంది.
ఎర్ర ద్రాక్ష:
ఈ ఎర్ర ద్రాక్ష అనేది చాలా తక్కువగా లభ్యమవుతుంది. రేటు కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీన్ని జామ్ లేదా జెల్లీలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇందులో కూడా కేలరీలు, ప్రోటీన్, విటమిన్లు సి, కె, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి.
ఎందులో ఎక్కువ పోషకాలు ఉంటాయి?
అన్ని రకాల ద్రాక్ష పండ్లలో పోషకాలు అనేవి ఎక్కువగానే లభ్యమవుతాయి. కానీ ఎరుపు, నలుపు ద్రాక్షలో మాత్రం పోషకాలు అనేవి మెండుగా ఉంటాయి. ఇవి తింటే గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. వీటల్లో మూడు రకాల పాలీ ఫెనాల్స్ ఉంటాయి. ఫినోలిక్ యాసిడ్, ఫ్లేవనాయిడ్, రెస్వెరాట్రాల్‌లు ఉంటాయి. ఆకు పచ్చ ద్రాక్ష కంటే నలుపు, ఎరుపు ద్రాక్షలో కాస్త పోషకాలు ఎక్కువ.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.




