AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెల్లవారుజామున నిద్రలేచే అలవాటు నిజంగా ఆరోగ్యానికి మేలు చేస్తుందా?

తెల్లవారుజామున నిద్రలేచే అలవాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే చాలా మంది తెల్లవారుజామున 4-5 గంటలకు నిద్రలేచి వాకింగ్‌కు వెళుతుంటారు. ఉదయాన్నే నిద్రలేవడం వల్ల ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతిని ఆస్వాదించడానికి, రద్దీ లేకుండా హాయిగా వాకింగ్‌ చేయడానికి వీలు కలుగుతుంది..

తెల్లవారుజామున నిద్రలేచే అలవాటు నిజంగా ఆరోగ్యానికి మేలు చేస్తుందా?
Waking Up Early In The Morning
Srilakshmi C
|

Updated on: Aug 14, 2025 | 4:22 PM

Share

ప్రతి ఉదయం తెల్లవారుజామున నిద్రలేచే అలవాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే చాలా మంది తెల్లవారుజామున 4-5 గంటలకు నిద్రలేచి వాకింగ్‌కు వెళుతుంటారు. ఉదయాన్నే నిద్రలేవడం వల్ల ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతిని ఆస్వాదించడానికి, రద్దీ లేకుండా హాయిగా వాకింగ్‌ చేయడానికి వీలు కలుగుతుంది. అయితే నేటి కాలంలో చాలా మంది రాత్రి పొద్దుపోయే వరకు పని చేసి అర్ధరాత్రి 11, 12 గంటలకు నిద్రపోతున్నారు. ఈ అలవాటు వారి ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అసలు ఉదయం ఏ సమయంలో నిద్రలేవడం ఆరోగ్యానికి మంచిది? దీని గురించి సైన్స్ ఏమి చెబుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

శాస్త్రవేత్తలు, నిద్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉదయం త్వరగా నిద్ర లేవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సూర్యోదయం సమయంలో మేల్కొనడం ద్వారా శరీర జీవ గడియారం (దీన్ని సిర్కాడియన్ రిథమ్ అని కూడా పిలుస్తారు) సక్రమంగా మారుతుంది. ఈ సహజ చక్రం ఒంట్లో హార్మోన్లు, శక్తి స్థాయిలు, మానసిక ఆరోగ్యాన్ని సమతుల్యంగా ఉంచుతుంది. రాత్రి ఆలస్యంగా నిద్ర పోవడం వల్ల శరీర సహజ గడియారం సమతుల్యత దెబ్బతింటుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రాత్రిళ్లు 7 నుంచి 8 గంటలు తగినంత మంచి నిద్ర పొందడం చాలా ముఖ్యం. మీరు రాత్రి ఆలస్యంగా నిద్రపోయి 7-8 గంటల నిద్ర పూర్తి చేసినా ప్రయోజనం ఉండదు. రాత్రి 10 గంటలకు నిద్రపోయి ఉదయం 5-6 గంటలకు మేల్కొనడానికి ప్రయత్నించాలి. ఇది సిర్కాడియన్ లయను సమతుల్యంగా ఉంచుతుంది. శరీరానికి సరిపడా నిద్ర కూడా అందుతుంది.

ఇవి కూడా చదవండి

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉదయం 9-10 గంటల వరకు నిద్రపోయే వ్యక్తులు నీరసంగా, చిరాకుగా, రోజంతా ఏకాగ్రత లేకపోవడం వంటి లక్షణాలతో బాధపడుతుంటారు. ఆలస్యంగా మేల్కొనడం వల్ల ఆహారం, పని, నిద్ర విధానాలకు అంతరాయం కలుగుతుంది. ఇది మీ శరీర జీవ గడియారాన్ని చెడగొడుతుంది. ఇది ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు, మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ప్రతి ఒక్కరి జీవ గడియారం కొద్దిగా భిన్నంగా ఉంటుంది. కానీ సూర్యోదయం సమయంలో మేల్కొనే వ్యక్తులు మరింత చురుకుగా, సానుకూలంగా, మానసికంగా సమతుల్యంగా ఉంటారని పరిశోధనలు చెబుతున్నాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..