Lifestyle: ప్రయాణంలో వాంతులు ఎందుకు అవుతాయో తెలుసా.?

ఇలా ప్రయాణం చేస్తున్న సమయంలో వాంతులు కావడాన్ని మోషన్ సిక్‌నెస్‌గా పిలుస్తుంటారు. కొంతమందికి మాత్రమే ఈ సమస్య ఉంటుంది. అయితే పురుషులతో పోల్చితే మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా 2 నుంచి 14 ఏళ్లలోపు చిన్నారులకు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. మైగ్రేన్, పార్కిన్‌సన్ వ్యాధితో ఇబ్బంది పడేవాళ్లు ఈ సమస్య బారిన పడే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుంది...

Lifestyle: ప్రయాణంలో వాంతులు ఎందుకు అవుతాయో తెలుసా.?
Motion Sickness
Follow us

|

Updated on: Jul 01, 2024 | 2:43 PM

ప్రయాణం అనగానే కొందరు భయపడతారు. ముఖ్యంగా బైక్స్‌పై ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ కార్లు, బస్సులు అనగానే వామ్మో మాతో కాదంటూ తెగ ఫీలవుతుంటారు. దీనికి ప్రధాన కారణం వాంతులు కావడమే. తలతిరగడంతో పాటు వాంతులు వేధిస్తుంటాయి. వాహనం కాస్త మూవ్‌ కాగానే కొందరిలో వాంతులు ప్రారంభమవుతుంటాయి. అయితే ఇంతకీ అసలు ఈ వాంతులు ఎందుకు అవుతాయి.? ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇలా ప్రయాణం చేస్తున్న సమయంలో వాంతులు కావడాన్ని మోషన్ సిక్‌నెస్‌గా పిలుస్తుంటారు. కొంతమందికి మాత్రమే ఈ సమస్య ఉంటుంది. అయితే పురుషులతో పోల్చితే మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా 2 నుంచి 14 ఏళ్లలోపు చిన్నారులకు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. మైగ్రేన్, పార్కిన్‌సన్ వ్యాధితో ఇబ్బంది పడేవాళ్లు ఈ సమస్య బారిన పడే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుంది.

ప్రయాణ సమయంలో వాంతులు కావడానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి. వీటిలో ఒకటి తిన్న వెంటనే ప్రయాణం మొదలు పెట్టడం. దీనివల్ల ఆహౄరం జీర్ణం కాదు. అందులోనూ ప్రయాణంలో అటు ఇటు కదులుతుంటాం. ఈ కారణంగా ఆహారం జీర్ణంకాక వాంతులు అవుతాయి. ప్రయాణంలో ఉన్నసమయంలో చెవి, కళ్లతో పాటు చర్మం మెదడుకు వేరువేరు సంకేతాలను అందిస్తుంది. ఈ కారణంగా కేంద్ర నాడీ వ్యవస్థ గందరగోళానికి గురవుతుంది. దీంతో వాంతులు అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇక మరో కారణం ప్రయాణం సమయంలో శరీరం నియంత్రణ కోల్పోయినా వాంతులు అవుతాయి.

ఈ సమస్య బారిన పడకుండా ఉండాలంటే. ప్రయాణ సమయంలో ఆల్కహాల్‌, కెఫిన్‌, వేయించిన మాసాలా వంటి ఆహార పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. ప్రయాణం చేసే ముందు ఆహారం తీసుకోకూడదు. అలాగే ప్రయాణం చేసిన వెంటనే కూడా భోజనం చేయకూడదు. కొందరికి కారులో ఏసీ స్మెల్ కారణంగా కూడా వాంతులు అవుతుంటాయి. అలాంటి వారు మాస్‌ ధరించడం ఉత్తమం. వాంతి వచ్చిన భావనకలిగితే.. నిమ్మకాయ, అల్లం, పుదీనా వంటి వాటి వాసనలు చూడాలి. ఇక వాంతులు అయ్యే వారు వీలైనంత వరకు ప్రయాణంలో కళ్లు మూసుకొని పడుకోవడం ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Team India:తొలుత ప్రధానితో మీటింగ్.. ఆ తర్వాత ఓపెన్ బస్సులో పరేడ్
Team India:తొలుత ప్రధానితో మీటింగ్.. ఆ తర్వాత ఓపెన్ బస్సులో పరేడ్
జింబాబ్వేలోకి అడుగుపెట్టిన భారత యువసేన.. తొలిసారి స్పెషల్ సిరీస్
జింబాబ్వేలోకి అడుగుపెట్టిన భారత యువసేన.. తొలిసారి స్పెషల్ సిరీస్
పొడవైన జుట్టు మీ సొంతం కావాలంటే ఈ నూనెలు బెస్ట్..
పొడవైన జుట్టు మీ సొంతం కావాలంటే ఈ నూనెలు బెస్ట్..
ఆలూతో అందం..! ఇలా వాడితే నల్లటి ఒత్తైన జుట్టు, పట్టులాంటి చర్మం
ఆలూతో అందం..! ఇలా వాడితే నల్లటి ఒత్తైన జుట్టు, పట్టులాంటి చర్మం
కల్కి సినిమా పై రణవీర్ సింగ్ ప్రశంసలు..
కల్కి సినిమా పై రణవీర్ సింగ్ ప్రశంసలు..
కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన.. ఆ సభపైనే అందరి దృష్టి..
కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన.. ఆ సభపైనే అందరి దృష్టి..
మీ ఊపిరితిత్తులు జర భద్రం.. బాగుండాలంటే ఇవి తినండి..
మీ ఊపిరితిత్తులు జర భద్రం.. బాగుండాలంటే ఇవి తినండి..
ఇరుక్కున్న కవి.. కోర్టుకు అప్పూ.. అనామికకు పాజిటివ్‌గా జడ్జి..
ఇరుక్కున్న కవి.. కోర్టుకు అప్పూ.. అనామికకు పాజిటివ్‌గా జడ్జి..
ఘట్టమనేని అభిమానులకు గుడ్ న్యూస్.. OTTలోకి వస్తోన్న హరోం హర
ఘట్టమనేని అభిమానులకు గుడ్ న్యూస్.. OTTలోకి వస్తోన్న హరోం హర
జైలుకొచ్చిన అమ్మను చూసి.. చిన్న పిల్లాడిలా ఏడ్చిన స్టార్ హీరో
జైలుకొచ్చిన అమ్మను చూసి.. చిన్న పిల్లాడిలా ఏడ్చిన స్టార్ హీరో