High Blood Sugar Control: ఆ సైలెంట్ కిల్లర్‌తో జాగ్రత్త.. ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోకపోతే అంతే..
మధుమేహానికి సరైన చికిత్స చేయకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. దీర్ఘకాలంలో గుండె, మూత్రపిండాలు, కళ్లు వంటి శరీర అవయవాలపై ప్రభావం చూపుతుంది.
మధుమేహం చాపకింద నీరులా విస్తరిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా అందరినీ చుట్టేస్తోంది. ప్రధానంగా జీవన శైలి సమస్యలు, వంశపారపర్యంగా ఇది ఎక్కువగా సోకుతోంది. అయితే ఇది వచ్చిందని తేలియగానే అప్రమత్తమై ఎప్పటికప్పుడు మందులు వాడుతూ.. జీవన శైలిలో మార్పులు చేసుకుంటూ ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ మధుమేహానికి సరైన చికిత్స చేయకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. అంతే ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. దీర్ఘకాలంలో గుండె, మూత్రపిండాలు, కళ్లు వంటి శరీర అవయవాలపై ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో అసలు షుగర్ వచ్చింది అని ఎలా నిర్ధారించుకోవాలి. దానిని ఎలా పరీక్షంచాలి? అసలు షుగర్ సాధారణ లెవెల్స్ ఏంటి? వంటి వాటిపై నిపుణులు చెబుతున్న సూచనలు ఇవి..
ఎప్పుడు పరీక్షించాలి..
ఒక వ్యక్తికి 30 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత డాక్టర్ సలహా ప్రకారం వారి రక్తంలో షుగర్ స్థాయిలను తనిఖీ చేయాలి. మధుమేహం లేనివారు సాధారణంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి రక్త పరీక్షలు చేయించుకోవాలి, అయితే ప్రీ-డయాబెటిక్ ఉన్నవారు ప్రతి మూడు నెలలకు ఒకసారి డయాగ్నస్టిక్ సెంటర్‌లో చేయించుకోవాలి. రోగికి మధుమేహం ఎక్కువగా ఉంటే లేక ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటున్నా.. లేదా గర్భవతులైనవారు రోజుకు మూడు సార్లు స్వీయ-పరీక్షలు చేసుకోవాలి.
ఇవి చేయాలి..
మధుమేహం రాకుండా ఉండాలంటే రోజూ 30 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. యోగా, మెడిటేషన్ ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవాలి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. బరువు నియంత్రణలో ఉంచుకోవాలి.
రక్తంలో చక్కెర స్థాయిలు ఇలా..
- ఉపవాస సమయంలో సాధారణ రక్తంలో గ్లూకోజ్ స్థాయి: < 100 mg%
- గ్లూకోజ్ తీసుకున్న 2 గంటల తర్వాత : < 140 mg%
- మధుమేహ వ్యాధిగ్రస్తులలో, ఉపవాసంలో: 126 mg% లేదా అంతకంటే ఎక్కువ
- గ్లూకోజ్ తీసుకున్న తర్వాత : 200 mg లేదా అంతకంటే ఎక్కువ
- HbA1c: సాధారణ లెవెల్ < 5.7%
- HbA1c మధుమేహం ఉన్నవారు: 6.5% లేదా అంతకంటే ఎక్కువ
హై బ్లడ్ షుగర్ లక్షణాలు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం టైప్ 1 మధుమేహం ఉన్న వారికి తరచుగా మూత్రవిసర్జన, దాహం, నిరంతరం ఆకలి, బరువు తగ్గడం, దృష్టిలో మార్పులు, అలసట ఉంటాయి. ఈ లక్షణాలు అకస్మాత్తుగా సంభవించవచ్చు. టైప్ 2 మధుమేహానికి కూడా టైప్ 1 డయాబెటిస్ మాదిరిగానే లక్షాణాలు ఉంటాయి గానీ తరచుగా వస్తాయి. ఫలితంగా, వ్యాధి ప్రారంభమైన చాలా సంవత్సరాల తర్వాత గానీ దానిని గుర్తించలేం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..