Surya Namaskar : 30 రోజుల పాటు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేస్తే.. శరీరంలో ఊహించని మార్పులు..!
శారీరక, మనసిక ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి సూర్య నమస్కారాలు అద్భుతంగా సహాయపడతాయని అంటున్నారు.. సూర్య నమస్కారాలు చేయడానికి.. గంటల సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. రోజూ సూర్యోదయ సమయంలో 10 నుంచి 15 నిమిషాలు ఇవి ప్రాక్టిస్ చేస్తే చాలు. సూర్య నమస్కారం మొత్తం శరీరాన్ని టోన్ చేస్తుంది. అలాంటిది 30 రోజుల పాటు సూర్య నమస్కారం చేయడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకుందాం.

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. బిజీ లైఫ్, అధిక పని ఒత్తిడి కారణంగా శరీరకంగానే కాదు.. మానసికంగా కూడా చాలా మంది సతమతమవుతున్నారు. ఇలాంటి మానసిక, శారీరక శ్రమను తగ్గించుకునేందుకు యోగాసనాలు, ధ్యానం తప్పనిసరి అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా శారీరక, మనసిక ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి సూర్య నమస్కారాలు అద్భుతంగా సహాయపడతాయని అంటున్నారు.. సూర్య నమస్కారాలు చేయడానికి.. గంటల సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. రోజూ సూర్యోదయ సమయంలో 10 నుంచి 15 నిమిషాలు ఇవి ప్రాక్టిస్ చేస్తే చాలు. సూర్య నమస్కారం మొత్తం శరీరాన్ని టోన్ చేస్తుంది. అలాంటిది 30 రోజుల పాటు సూర్య నమస్కారం చేయడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకుందాం.
ప్రతి ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి. ఇది శరీరానికి పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది, కండరాలు, కీళ్లను బలపరుస్తుంది. సూర్య నమస్కారం జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది, నిద్రలేమిని దూరం చేస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత సూర్య నమస్కారం చేయడం చాలా ప్రయోజనకరం. ఇది వ్యక్తికి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలను అందిస్తుంది.
సూర్య నమస్కారం చేయడం ఒక వ్యాయామం. ఇలా చేయడం వల్ల కండరాల బలం పెరుగుతుంది. ఇలా 30 రోజులు చేయడం వల్ల మనిషి తనను తాను దృఢంగా మార్చుకోవచ్చు. రోజూ సూర్య నమస్కారం చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని చెబుతారు. ఇలా చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. సూర్య నమస్కారం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. 30 రోజుల పాటు సూర్య నమస్కారం చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
మీరు ఊబకాయాన్ని ఎదుర్కొంటున్నట్లయితే, ప్రతిరోజూ ఉదయం సూర్య నమస్కారం చేయండి. ఇలా చేయడం వల్ల బరువు త్వరగా తగ్గడంతోపాటు ఎముకలు బలపడతాయి. రోజూ సూర్య నమస్కారం చేయడం వల్ల జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది. దీనివల్ల పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి కావడంతోపాటు ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశాలు ఉన్నాయి. ఉదయాన్నే సూర్య నమస్కారం చేయడం వల్ల మనిషి పనిలో విజయం సాధిస్తాడని చెబుతారు. ఇది శరీరానికి సానుకూల శక్తిని ఇస్తుంది మరియు పని చేయాలనే అనుభూతిని కూడా కలిగిస్తుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను నేరుగా సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి