Wifi Router: రాత్రిపూట Wi-Fiని ఆన్‌లోనే ఉంచుతున్నారా?.. అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే..!

రేడియేషన్ ప్రభావం నుండి దూరంగా ఉండటానికి, రూటర్‌ను గదిలో ఓ మూలగా ఏర్పాటు చేసుకోవాంటున్నారు. ఇంకో కారణం కూడా ఉంది. మీరు రాత్రంతా ఉపయోగించకపోయినా, రూటర్‌ ఆన్‌లో ఉండటం వల్ల కరెంటు బిల్లు కూడా చాలా ఎక్కువగా వస్తుంది. మీరు విద్యుత్ బిల్లును ఆదా చేయాలనుకుంటే రాత్రిపూట రూటర్‌ను ఆఫ్ చేసుకోవచ్చు.

Wifi Router: రాత్రిపూట Wi-Fiని ఆన్‌లోనే ఉంచుతున్నారా?.. అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే..!
Wi Fi Router
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 05, 2024 | 9:37 AM

ప్రస్తుతం చాలా మంది ఇళ్లలో వైఫై ఉంటుంది. ఇది 24 గంటల పాటు ఆన్‌లోనే ఉంటుంది. రూటర్‌ వినియోగం విషయంలో చాలా మంది కొన్ని తప్పులు చేస్తుంటారు. ఈ Wi-Fiని ఉపయోగించే విషయంలో చేసే పొరపాట్లు మిమ్మల్నీ ఇబ్బందులకు గురిచేస్తాయంటున్నారు నిపుణులు. రూటర్‌ నిరంతర వినియోగం శరీరానికి చాలా హానికరం అంటున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, సాధారణంగా వైఫ్‌ రూటర్‌ విద్యుదయస్కాంత కిరణాలు, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్‌ను విడుదల చేస్తుంది. దీంతో వై-ఫై వినియోగం ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉంటుందని చెబుతున్నారు. మొబైల్, ల్యాప్‌టాప్, కంప్యూటర్‌ల నుంచి వచ్చే రేడియేషన్‌ వల్ల ఎలాంటి నష్టం వాటిల్లుతుందో, వైఫై నుంచి వెలువడే రేడియేషన్‌ కూడా శరీరంపై వివిధ రకాలుగా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. వైఫై రూటర్‌ను రాత్రంతా ఆన్‌లో ఉంచడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

మెదడుపై ప్రభావాలు: నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇంట్లో మనం నిద్రపోయే ప్రాంతానికి దగ్గరగా వైఫ్ రూటర్‌ ఉండటం వల్ల మెదడుపై ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉంది. దీంతో నిద్రలేమి, అలసట, మైగ్రేన్ వంటి సమస్యలు ఎదురవుతాయంటున్నారు. కాబట్టి నిద్రపోయేటప్పుడు వైఫై రూటర్‌ను ఆఫ్‌ చేయాలని చెబుతున్నారు. ‘జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీ’లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో రూటర్ దగ్గర పడుకునే వారికి మైగ్రేన్ వచ్చే అవకాశం 40 శాతం ఎక్కువగా ఉందని తేలింది. ఇటలీలోని టురిన్ విశ్వవిద్యాలయంలో ఎపిడెమియాలజీ ప్రొఫెసర్ మార్కో డి పోర్టియో ఈ అధ్యయనంలో పాల్గొన్నారు.

అల్జీమర్స్: రూటర్‌ని రాత్రంతా అలాగే ఉంచడం వల్ల క్యాన్సర్, నరాల సమస్యలు, పునరుత్పత్తి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఫలితంగా అల్జీమర్స్ సమస్య వచ్చే ప్రమాదం ఉంది. రాత్రంతా వైఫైని ఆన్‌లో ఉంచడం వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు, కొన్ని సాంకేతిక సమస్యలు కూడా తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు. అందుకే వైఫై రూటర్‌ని మీరు పడుకునే ప్లేస్‌కి కాస్త దూరంలో ఉంచాలని చెబుతున్నారు. రేడియేషన్ ప్రభావం నుండి దూరంగా ఉండటానికి, రూటర్‌ను గదిలో ఓ మూలగా ఏర్పాటు చేసుకోవాంటున్నారు. ఇంకో కారణం కూడా ఉంది. మీరు రాత్రంతా ఉపయోగించకపోయినా, రూటర్‌ ఆన్‌లో ఉండటం వల్ల కరెంటు బిల్లు కూడా చాలా ఎక్కువగా వస్తుంది. మీరు విద్యుత్ బిల్లును ఆదా చేయాలనుకుంటే రాత్రిపూట రూటర్‌ను ఆఫ్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..