AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘వాటర్ బెల్’ క్యాంపెయిన్.. ఎందుకు అవసరం..?

‘వాటర్‌ బెల్’ ఈ కార్యక్రమం.. ప్రస్తుతం అన్ని స్కూళ్లలోనూ జోరందుకుంటోంది. స్కూళ్లల్లో.. సరైన నీరు తాగని కారణంగా.. స్టూడెంట్స్ ఎక్కువగా అనారోగ్యానికి గురవుతూంటారు. మరీ వీక్‌గా ఉన్న పిల్లలు.. కళ్లు తిరిగి పడిపోతూంటారు. ముఖ్యంగా ఈ సమస్య వేసవిలో అధికంగా ఉంటుంది. దీంతో.. ఈ సమస్యకు చెక్‌ పెట్టేలా.. కేరళ రాష్ట్రం ఓ సరికొత్త మార్గాన్ని పాటిస్తోంది. ఆ రాష్ట్రంలోని ఉన్న అన్ని స్కూళ్లలో.. ప్రతీ 3 గంటలకొకసారి.. ‘వాటర్ బెల్’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ […]

'వాటర్ బెల్' క్యాంపెయిన్.. ఎందుకు అవసరం..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 22, 2019 | 4:17 PM

Share

‘వాటర్‌ బెల్’ ఈ కార్యక్రమం.. ప్రస్తుతం అన్ని స్కూళ్లలోనూ జోరందుకుంటోంది. స్కూళ్లల్లో.. సరైన నీరు తాగని కారణంగా.. స్టూడెంట్స్ ఎక్కువగా అనారోగ్యానికి గురవుతూంటారు. మరీ వీక్‌గా ఉన్న పిల్లలు.. కళ్లు తిరిగి పడిపోతూంటారు. ముఖ్యంగా ఈ సమస్య వేసవిలో అధికంగా ఉంటుంది. దీంతో.. ఈ సమస్యకు చెక్‌ పెట్టేలా.. కేరళ రాష్ట్రం ఓ సరికొత్త మార్గాన్ని పాటిస్తోంది. ఆ రాష్ట్రంలోని ఉన్న అన్ని స్కూళ్లలో.. ప్రతీ 3 గంటలకొకసారి.. ‘వాటర్ బెల్’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమయంలో.. స్టూడెంట్స్ నీరు తాగేలా.. టీచర్స్‌ దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తారు. ఇప్పుడు ఇదికాస్తా.. సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యింది. అన్ని రాష్ట్రాలు ప్రస్తుతం ఈ కార్యక్రమంపై దృష్టి పెడుతున్నారు.

ఈ ‘వాటర్ బెల్’ కార్యక్రమాన్ని తమిళనాడులోని పాఠశాలల్లో కూడా పాటిస్తున్నారు. ప్రతీ పిరియడ్‌కు మధ్య పది నిమిషాల సమయం కేటాయిస్తున్నట్లు.. తమిళనాడు విద్యాశాఖ మంత్రి కేఏ సెంగొట్టయాన్ ప్రకటించారు. అలాగే.. ఇప్పుడు ఈ ‘వాటర్ బెల్‌’ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని అన్ని స్కూళ్లల్లోనూ.. ప్రతిస్టాత్మకంగా.. తీసుకురావాలని అధికారులు ఆలోచిస్తున్నారట. గవర్నమెంట్ స్కూళ్లతో పాటు.. అన్ని ప్రైవేటు స్కూళ్లల్లో దీన్ని అవలంభించాలని.. విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రోజుకు కనీసం.. 3 నుంచి 4 సార్లు అయినా.. ‘వాటర్ బెల్’ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు.

విద్యార్థులకు ఈ కార్యక్రమం ఎందుకు అవసరం..?

  • ‘వాటర్ బెల్’ కార్యక్రమం ద్వారా.. ముఖ్యంగా విద్యార్థులు.. డీ హైడ్రేషన్‌కి గురి కాకుండా ఉంటారు.
  • అంతేకాకుండా.. ఈ పదినిమిషాల బ్రేక్ ద్వారా విద్యార్థులకు కాస్త ఒత్తిడిని తగ్గించవచ్చు.
  • చదువుపై ధ్యాస పెట్టేలా కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది.
  • అలాగే.. స్టూడెంట్స్‌కి కాస్త ఉపశమనం లభించినట్టు కూడా ఉంటుంది.
  • నీరు తాగిన కారణంగా.. పిల్లల్లో రక్తప్రసరణ చురుగ్గా జరుగుతుంది.
  • జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతుంది.
  • రోజూ ఇలా నీరు త్రాగడం వలన… అనారోగ్యాలకు చెక్ పెట్టవచ్చు.
Follow Us
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?