మార్నింగ్ టిఫిన్‌ను లైట్ తీసుకుంటున్నారా.. భారీ మూల్యం తప్పదు..

స్మార్ట్ యుగంలో చాలామంది యువత పనుల హడావుడి, అలసత్వంతో ఉదయం పూట టిఫిన్‌ను ఎగ్గొడుతుంటారు. అలాగే రాత్రి సమయాల్లో కూడా డిన్నర్ లేట్‌‌గా చేస్తుండటం కామన్ అయిపొయింది. అయితే ఇలా ప్రొద్దున్న బ్రేక్‌ఫాస్ట్‌ను మిస్ చేయడం.. నైట్ ఆలస్యంగా భోజనం చేయటం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని నిపుణులు తేల్చి చెబుతున్నారు. చద్దన్నం, ఇడ్లీ, దోశ, వడ, బ్రెడ్ టోస్ట్, ఆమ్లెట్, ఉడకపెట్టిన కూరగాయలు, ఫ్రూట్స్.. ఇలా చాలామంది చాలా రకాలుగా తమకు నచ్చినవి ప్రొద్దున్న టిఫిన్‌గా తింటుంటారు. […]

మార్నింగ్ టిఫిన్‌ను లైట్ తీసుకుంటున్నారా.. భారీ మూల్యం తప్పదు..
Follow us

|

Updated on: Nov 23, 2019 | 3:19 AM

స్మార్ట్ యుగంలో చాలామంది యువత పనుల హడావుడి, అలసత్వంతో ఉదయం పూట టిఫిన్‌ను ఎగ్గొడుతుంటారు. అలాగే రాత్రి సమయాల్లో కూడా డిన్నర్ లేట్‌‌గా చేస్తుండటం కామన్ అయిపొయింది. అయితే ఇలా ప్రొద్దున్న బ్రేక్‌ఫాస్ట్‌ను మిస్ చేయడం.. నైట్ ఆలస్యంగా భోజనం చేయటం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని నిపుణులు తేల్చి చెబుతున్నారు.

చద్దన్నం, ఇడ్లీ, దోశ, వడ, బ్రెడ్ టోస్ట్, ఆమ్లెట్, ఉడకపెట్టిన కూరగాయలు, ఫ్రూట్స్.. ఇలా చాలామంది చాలా రకాలుగా తమకు నచ్చినవి ప్రొద్దున్న టిఫిన్‌గా తింటుంటారు. అయితే ఈ స్పీడ్ యుగం వల్ల చాలాసార్లు బ్రేక్‌ఫాస్ట్‌ను ఎగ్గొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇకపై ఇలా ఉదయం టిఫిన్‌ చేయకపోవడం, రాత్రి లేటుగా భోజనం చేయడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయని పరిశోధకులు అంటున్నారు. అంతేకాకుండా హార్ట్ పేషెంట్స్ ఈ విధంగా చేస్తే మాత్రం వాళ్ళు తొందరగా చనిపోయే ఛాన్స్‌లు ఎక్కువగా ఉన్నాయని ఓ పరిశోధనలో తేలింది.

ఇలా రెండు పూట్ల సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల తొందరగా మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు. దాదాపు 60 ఏళ్ళ వయసు ఉన్న 113 మంది హార్ట్ పేషెంట్స్‌ను పరీక్షించిన సైంటిస్టులు.. వారి రోజువారీ అలవాట్ల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నారు. వీరిలో టిఫిన్ తినని వారు 58 శాతం ఉండగా.. రాత్రి పూట భోజనం లేటుగా చేసేవారు 51 శాతం ఉన్నారు. అంతేకాకుండా ఈ రెండు చెడలవాట్లు కలిగిన వారు 48 శాతం మంది ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళే అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారని కూడా స్పష్టమైంది. దీంతో ప్రజలు ఇప్పటికైనా మేలుకొని.. బ్రేక్‌ఫాస్ట్‌ను నిర్లక్ష్యం చేయకుండా.. నైట్ భోజనం తొందరగా తినేలా అలవాట్లను మార్చుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. పాలు, చపాతీ, బ్రెడ్, పండ్లు లాంటి వాటిని ఉదయం టిఫిన్‌గా తీసుకోవడం మంచిదని వారి సలహా.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..