మీ ఇంట్లో ఈ 4 వస్తువులను సరైన దిశలో ఉంచితే డబ్బు, అదృష్టం మీ వెంటే.. లైట్ తీసుకోకుండా..
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో ఉంచే కొన్ని వస్తువులు సానుకూల శక్తిని, సంపదను ఆకర్షిస్తాయి. ఆ వస్తువులను సరైన ప్లేస్‌లో ఉంచితే ఇంట్లో శ్రేయస్సును, ఆనందాన్ని పెంచుతాయి. ఆర్థిక పురోగతి కూడా సాధ్యమవుతుంది. మీ ఇంటి వాతావరణం మెరుగుపడుతుంది. ఆ వస్తువులు ఏంటి..? ఎక్కడ పెట్టాలి అనేది తెలుసుకుందాం..

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లోని వాతావరణం, మనం ఉంచే వస్తువులు జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఇల్లు సానుకూల శక్తితో సమతుల్యంగా ఉంటే అది ఆ ఇంటివారికి శ్రేయస్సు, ఆనందం, సంపదను అందిస్తుందని నమ్ముతారు. ఈ కారణంగానే విజయవంతమైన, ధనవంతుల ఇళ్లలో కొన్ని ప్రత్యేక వస్తువులు తరచుగా కనిపిస్తాయి. అవి అలంకరణకు మాత్రమే కాదు శక్తివంతమైన సానుకూల వస్తువులుగా చెబుతారు. వాస్తు శాస్త్రం, ఫెంగ్ షూయ్‌ల ప్రకారం సానుకూలతను, సంపదను ఆకర్షించే ఆ 4 ముఖ్య వస్తువులు, వాటిని ఎలా ఉంచాలో తెలుసుకుందాం..
లాఫింగ్ బుద్ధ
లాఫింగ్ బుద్ధుడు ఆనందం, అదృష్టం, సానుకూల శక్తికి చిహ్నం. దీని విస్తృత చిరునవ్వు ఇంట్లో నవ్వు, ఒత్తిడి లేని వాతావరణాన్ని సృష్టిస్తుంది. లాఫింగ్ బుద్ధుడిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల వాతావరణం తేలికై, కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం పెరుగుతుంది. దీనిని ప్రధాన ద్వారం వైపు చూస్తున్నట్లుగా ఉంచడం శుభప్రదం.
మనీ ప్లాంట్
వాస్తు శాస్త్రంలో మనీ ప్లాంట్ అత్యంత పవిత్రమైనది. ఇది ఇంటికి సంపద, అదృష్టం, ఆనందాన్ని తెస్తుందని నమ్మకం. దాని ఆకుపచ్చ, పెరుగుతున్న ఆకులు జీవితంలో పురోగతిని, వృద్ధిని సూచిస్తాయి. వాస్తు ప్రకారం.. మనీ ప్లాంట్‌ను ఆగ్నేయం దిశలో ఉంచాలి. దీనిని ఇంటి వెలుపల లేదా ముఖ్యంగా ఈశాన్య దిశలో ఉంచకూడదు. ఈశాన్యంలో ఉంచడం వలన ఆర్థిక నష్టాలు లేదా అడ్డంకులు కలగవచ్చు.
ప్రవహించే నీరు
ప్రవహించే నీటిని వాస్తు శాస్త్రంలో శుభప్రదంగా భావిస్తారు. నీటి నిరంతర ప్రవాహం జీవితంలో శక్తి, చురుకుదనం, సంపద యొక్క స్థిరమైన ప్రవాహాన్ని సూచిస్తుంది. అందుకే చాలా మంది విజయవంతమైన వ్యక్తులు తమ ఇళ్లలో లేదా ప్రధాన ద్వారం దగ్గర చిన్న ఫౌంటెన్లను ఏర్పాటు చేసుకుంటారు. ఇది ఇంటి అందాన్ని, సానుకూలతను పెంచుతుంది. ఫౌంటెన్‌ను తరచుగా ఇంటి ఉత్తరం లేదా ఈశాన్యం దిశలో ఉంచుతారు.
మూడు కాళ్ల డబ్బు కప్ప
మనీ ఫ్రాగ్ అనేది సంపద, శ్రేయస్సును ఆకర్షించడానికి శుభ చిహ్నంగా భావిస్తారు. ఈ కప్ప ఇంటికి ఆర్థిక అవకాశాలు, నగదు ప్రవాహం, అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. వాస్తు ప్రకారం.. లాఫింగ్ బుద్ధ, మూడు కాళ్ల కప్ప రెండింటినీ ప్రధాన ద్వారం వైపు ఉంచాలి. తద్వారా సంపద ఇంటి లోపలికి ప్రవహిస్తుంది.
ఈ వస్తువులను వాస్తు నియమాల ప్రకారం ఇంట్లో ఉంచుకోవడం వల్ల కేవలం ఇంటి వాతావరణమే కాకుండా మన ఆలోచనలు కూడా సానుకూలంగా మారి, జీవితంలో పురోగతికి మార్గం సుగమం అవుతుందని పండితులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








