పెళ్లి చేసుకోవడానికి సరైన సమయం ఏది.. ఏ వయసులో పెళ్లి చేసుకోవడం మంచిది!
Right age for marriage : ఈ మధ్య కాలంలో చాలా మంది లేట్ మ్యారెజ్‌ను ఇష్టపడుతున్నారు. ఇది ప్రస్తుతం ఒక ట్రెండ్‌గా కొనసాగుతుంది. యువత ఎవరిని అడిగినా.. మేం సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటామని చెబుతున్నారు. అలా దాదాపు 28-30 ఏళ్లకు చాలా మంది వివాహం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది మైండ్‌లో ఒక ప్రశ్న ఉండిపోయింది. ఇంతకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకోవడానికి సరైన సమయం ఉందా అని. కాబట్టి పెళ్లి చేసుకోవడానికి సరైన వయస్సు ఎంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నేటి యువతలో చాలా మందికి వివాహం గురించి సరైన స్పష్టత ఉండట్లేదు. అందుకే చాలా మంది ఏ వయస్సులో పెళ్లి చేసుకోవాలి.. పెళ్లి చేసుకోవడానికి సరైన సమయం ఏదనే సందేహాలకు సమాధానాలు వెతుకుతున్నారు. వివాహ నిర్ణయాలు అనే తరచుగా బంధువులు, సమాజం, కుటుంబం నుండి వచ్చే ఒత్తిళ్ల ద్వారా ప్రభావితమవుతాయి. అయితే, ఎప్పుడు వివాహం చేసుకోవాలో అనేది ఒకరి వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మీరు వివాహ జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారని మీకు నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే మీరు వివాహం చేసుకోవాలంటున్నారు.
వివాహం అనేది వ్యక్తిగత నిర్ణయం!
వివాహం చేసుకోవడానికి సరైన సమయం అనేది వ్యక్తిగత నిర్ణయం అని నిపుణులు చెబుతున్నారు. నేటి ప్రపంచంలో, వివాహం అనే ఆలోచనలో మనం చాలా మార్పులను చూస్తున్నాము. పురుషులు, మహిళలు పెళ్లి చేసుకునే ముందు వారి కెరీర్ లక్ష్యాలను సాధించడం, వారి అభిరుచులను అనుసరించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. విజయవంతమైన వివాహం బలమైన పునాదిపై ఆధారపడి ఉంటుంది. పెళ్లి చేసుకోబోయే ఇద్దరు భవిష్యత్తు గురించి ఒకే విధమైన అవగాహన కలిగి ఉండాలి అలా ఉంటేనే వారి వివాహ జీవితం సజావుగా సాగుతుంది.
వివాహానికి సరైన వయస్సు లేదు!
పెళ్లి చేసుకోవడానికి సరైన వయస్సు ఏదనేది గత కొంత కాలంగా చర్చనీయాంశంగా మారిన అంశం. ప్రస్తుత రోజుల్లో పెళ్లి వయస్సు అనేది సాంస్కృతిక, సామాజిక-ఆర్థిక అంశాలచే ప్రభావితమవుతుంది. మన తాతల కాలంలో ప్రజలు చిన్న వయస్సులోనే వివాహం చేసుకునేవారు. అప్పుడు ఎవరూ డబ్బు, హోదాను చూసేవారు కాదు. కానీ ప్రస్తుత సమాజం అలా లేదు. దానికి పూర్తి విరుద్దంగా మారిపోయింది. ఇప్పుడు డబ్బు, ఉద్యోగం, ఆస్తులు ఉంటేనే వివాహానికి ముందుకు వస్తున్నారు.
వివాహానికి ‘పరిపూర్ణ వయస్సు’ అనేది కేవలం ఒక భావన. వివాహం చేసుకోవడానికి సరైన సమయం వ్యక్తిగత పరిస్థితులు, సాంస్కృతిక నేపథ్యాన్ని బట్టి మారుతుంది. బయటి వారి అంచనాల కంటే, వారు పెళ్లికి సిద్ధంగా ఉన్నారా లేదా అనే దాని ఆధారంగా ప్రజలు నిర్ణయాలు తీసుకోవాలి. భాగస్వాములు తమ జీవిత లక్ష్యాలలో స్థిరంగా ఉంటేనే వివాహం జరగాలని జాట్‌లు అంటున్నారు.
గమనిక: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల నుంచి సేకరించిన సమాచారం మేరకు అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు. వీటిపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








