AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Teddy Day 2022: ఈరోజు టెడ్డీ డే.. మీ భాగస్వామికి ఇచ్చే టెడ్డీ బేర్ రంగుల ప్రాముఖ్యత ఏమిటంటే..

Teddy Day 2022: ఫిబ్రవరి(February) వచ్చిందంటే ప్రేమికులకు(Lovers) పండగ నెల. ప్రేమ పండుగగా ఖ్యాతిగాంచిన వాలెంటైన్స్ డే (valentines Day) ఈ నెలలో జరుపుకుంటారు. అయితే ఈ ప్రేమికుల రోజుని వారోత్సవాలుగా..

Teddy Day 2022: ఈరోజు టెడ్డీ డే.. మీ భాగస్వామికి ఇచ్చే టెడ్డీ బేర్ రంగుల ప్రాముఖ్యత ఏమిటంటే..
Happy Teddy Day
Surya Kala
|

Updated on: Feb 10, 2022 | 10:56 AM

Share

Teddy Day 2022: ఫిబ్రవరి(February) వచ్చిందంటే ప్రేమికులకు(Lovers) పండగ నెల. ప్రేమ పండుగగా ఖ్యాతిగాంచిన వాలెంటైన్స్ డే (valentines Day) ఈ నెలలో జరుపుకుంటారు. అయితే ఈ ప్రేమికుల రోజుని వారోత్సవాలుగా వారం రోజుల పాటు వివిధ రకాలుగా జరుపుకుంటారు. ఈ వారోత్సవాల్లో నాల్గవ రోజును టెడ్డీ డే గా జరుపుకుంటారు. అమ్మామాయిలకు ఇష్టమైన టెడ్డీ బొమ్మలను తమకు నచ్చినవారు బహుమతిగా ఇస్తుంటే .. హ్యాపీగా స్వీకరిస్తారు. ఆ టెడ్డీను చూసి ఎంతో సంతోష పడతారు. ఈ టెడ్డీ డేని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తమ భాగస్వామి పట్ల తమ భావాలను తెలియజేయడానికి జరుపుకుంటారు.

టెడ్డీ డే ఎప్పుడు జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10న ప్రపంచవ్యాప్తంగా టెడ్డీ డే జరుపుకుంటారు. ఈ సంవత్సరం, టెడ్డీ డే గురువారం వచ్చింది.

టెడ్డీ డే చరిత్ర టెడ్డీ బేర్స్  అమ్మాయిలు ఇష్టపడే అందమైన బహుమతులలో ఒకటి. ఇద్దరు వ్యక్తుల ప్రేమ/సంబంధానికి ప్రతీకగా ఉండే బహుమతి (కడ్లీ టెడ్డీ బేర్)గా ఇస్తూ ఈ రోజు జరుపుకుంటారు. టెడ్డీ పేరు వెనుక అమెరికా మాజీ అధ్యక్షుడు థియోడర్ ‘టెడ్డీ’ రూజ్‌వెల్ట్ ఉన్నారని ఓ కథనం ప్రచారంలో ఉంది. రూజ్‌వెల్ట్ ఒకసారి తన సహాయకులు ఎలుగుబంటిని బంధించి కాల్చి చంపడాన్ని ఖండించారు. ఈ సంఘటన నుంచి న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లోని మిఠాయి దుకాణం యజమాని మోరిస్ మిచ్‌టామ్ ప్రేరణ పొంది..  అధ్యక్షుడు టెడ్డీ’ రూజ్‌వెల్ట్ కి స్టఫ్డ్ టాయ్ బేర్‌ను అంకితం చేసి, దానికి టెడ్డీస్ బేర్ అని పేరు పెట్టారు.

టెడ్డీ బేర్ రంగుల ప్రాముఖ్యత

ఎరుపు రంగు టెడ్డీ అభిరుచి , ప్రేమను సూచిస్తుంది. ఇది ఇద్దరి మధ్య అనుబంధానికి, భావోద్వేగాన్ని సూచించడానికి   ఉద్దేశించబడింది.

పింక్ టెడ్డీ ని ప్రేమికుడికి లేదా ప్రేమికురాలికి కనుక ఈరోజు అందిస్తే.. తన ప్రేమను తెలియజేస్తూ..  ప్రతిపాదనను అంగీకరించమని అర్ధం.

బ్లూ టెడ్డీ లోతు, బలం, జ్ఞానం, నిబద్ధతను సూచిస్తుంది.  ఈరోజు బ్లూ రంగు టెడ్డిని అందిస్తే.. వారి ప్రేమ నిజంగా బలమైనదని,మీరు మీ సంబంధానికి కట్టుబడి ఉన్నారని అర్ధం.

గ్రీన్ టెడ్డీ ని ఇస్తే.. ప్రేమికుడితో బలమైన సంబంధాన్ని కోరుకోవడమే కాదు.. తాను ప్రేమించిన వారి కోసం వేచి ఉండటానికి తాను రెడీ అని సూచన.

ఎవరైనా ప్రేమికులు ఈరోజు ఆరెంజ్ టెడ్డీని అందుకుంటే.. ఆనందం, ఆశ, కాంతికి చిహ్నంగా భావించవచ్చు,

ప్రేమికుల వారంలో ప్రత్యేకమైన ఈరోజు హృదయాన్ని గెలుచుకోవడానికి, ఆమెకు ఇష్టమైన రంగులోని టెడ్డీ బేర్‌ని ఇచ్చి,  అద్భుతమైన రోజును జీవితాంతం జ్ఞాపకంగా మలచుకుంటూ ఆనందించండి.

Read Also:

చెన్నై బీజేపీ కార్యాలయంపై దాడి.. పెట్రోల్ బాంబులు విసిరిన దుండగులు..