Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఒక్క నూనె చాలు.. కౌశసౌందర్యంతో పాటు.. మీ చర్మం యవ్వనంగా మారుతుంది..!

కనుబొమ్మలు పెరగాలంటే కాటన్‌ క్లాత్‌ను ఆముదంలో ముంచి రెండు కనుబొమ్మలపై అప్లై చేసుకుని స్మూత్‌గా మర్ధనా చేసుకోవాలి 5 నిమిషాల పాటు వేళ్లతో బాగా మసాజ్ వదిలేయండి. 30 నిమిషాల తరువాత, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా రోజూ చేస్తే ఫలితం ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఆముదం నూనెను మీ ముఖంపై అప్లై చేయడం వల్ల మొటిమలను నివారించవచ్చు. మచ్చలను క్లియర్ చేసుకోవచ్చు.

ఈ ఒక్క నూనె చాలు.. కౌశసౌందర్యంతో పాటు.. మీ చర్మం యవ్వనంగా మారుతుంది..!
Use Castor Oil
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 04, 2023 | 12:54 PM

పురాతన కాలం నుండి ఆరోగ్య, సౌందర్య సంరక్షణ కోసం ఉపయోగించే అద్భుతమైన ఆయిల్‌ ఆముదం.. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు, రిసినోలిక్ యాసిడ్, ఫ్లేవనాయిడ్స్, విటమిన్ ఇ, ఫినోలిక్ యాసిడ్స్, అమైనో యాసిడ్‌లు మొదలైన అనేక ప్రయోజనకరమైన అంశాలు ఉన్నాయి. ఆముదం అకాలంగా నెరిసిన జుట్టు, చుండ్రును వదిలించుకోవడానికి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. చర్మంపై ముడతలు, రింగులను తగ్గించి చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. కనుబొమ్మలు పెరగడానికి, స్ట్రెచ్ మార్క్స్ పోగొట్టడానికి ఆముదం గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో ఆముదం ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..

ఆముదం, బాదం నూనెను సమాన మొత్తంలో తలపై అప్లై చేయడం వల్ల అకాల నెరిసిన జుట్టును నివారించవచ్చు. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. బాదం నూనెకు బదులుగా కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. ప్రతిరోజూ స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రదేశాలలో కొద్దిగా ఆముదం రాసుకోవడం వల్ల మచ్చలు పోతాయి.

కనుబొమ్మలు పెరగాలంటే కాటన్‌ క్లాత్‌ను ఆముదంలో ముంచి రెండు కనుబొమ్మలపై అప్లై చేసుకుని స్మూత్‌గా మర్ధనా చేసుకోవాలి 5 నిమిషాల పాటు వేళ్లతో బాగా మసాజ్ వదిలేయండి. 30 నిమిషాల తరువాత, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా రోజూ చేస్తే ఫలితం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఆముదం నూనెను మీ ముఖంపై అప్లై చేయడం వల్ల మొటిమలను నివారించవచ్చు. మచ్చలను క్లియర్ చేసుకోవచ్చు. ముడుతలను తొలగించవచ్చు. మీ చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. ఆముదం, ఆలివ్ నూనెలను కొద్దిగా వేడి చేసి తలకు పట్టిస్తే చుండ్రు పోతుంది. తర్వాత వేడి నీటిలో ముంచిన టవల్ తో మీ తలను పూర్తిగా కవర్‌ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత మీరు షాంపూతో మీ తలను వాష్‌ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చుండ్రు పోతుంది. జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..