AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పరగడుపునే ఖాళీ కడుపుతో టమాటా రసం తాగడం వల్ల ఎన్ని లాభాలున్నాయో..!

టమాటాలో ఉండే లైకోపీన్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. టమాటా జ్యూస్‌ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా మేలు జరుగుతుంది. ఒక కప్పు చిన్న టమోటాలలో 2 గ్రాముల ఫైబర్ ఉంటుంది. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు కూడా టమోటా రసం తాగవచ్చు. అలాగే బరువు తగ్గాలనుకునే వారు టమాటా రసాన్ని ఆహారంలో చేర్చుకోవచ్చు. టమాటా జ్యూస్ ను..

పరగడుపునే ఖాళీ కడుపుతో టమాటా రసం తాగడం వల్ల ఎన్ని లాభాలున్నాయో..!
Tomato Juice
Jyothi Gadda
|

Updated on: Dec 04, 2023 | 10:19 AM

Share

టమాటా అనేక ప్రయోజనాలతో కూడిన కూరగాయ. టమోటాలలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి6, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్, కాపర్, ఫైబర్, లైకోపీన్ మరియు ఇతర యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో టమాటా జ్యూస్ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో టమాటా జ్యూస్ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. టమోటాలు విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్ల అద్భుతమైన మూలం. కాబట్టి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో టమాటా జ్యూస్ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పొటాషియం పుష్కలంగా ఉండే టమాటా జ్యూస్ తాగడం వల్ల కూడా అధిక రక్తపోటు తగ్గుతుంది.

టమాటాల్లో ఉండే బీటా కెరోటిన్, లుటీన్, విటమిన్ సిలు కంటి సమస్యలను పోగొడతాయి. చూపు స్పష్టంగా ఉంటుంది. శుక్లాలు రాకుండా ఉంటాయి. టమాటాల్లో బీటా కెరోటిన్, లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. టమాటాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియంట్లు శరీరంలో కణజాలం నశించకుండా కాపాడతాయి. అలాగే గుండె జబ్బులు రాకుండా రక్షిస్తాయి.

ఒక కప్పు చిన్న టమాటా జ్యూస్‌లో సుమారు 2 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా టమాటా జ్యూస్ తీసుకోవచ్చు. ఈ టమాటా జ్యూస్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. అలాగే క్రమం తప్పకుండా టమాటా జ్యూస్ ను తాగడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుంది. మచ్చలు, మెటిమలు వంటివి తగ్గుముఖం పడతాయి.

ఇవి కూడా చదవండి

టమాటాలో ఉండే లైకోపీన్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. టమాటా జ్యూస్‌ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా మేలు జరుగుతుంది. ఒక కప్పు చిన్న టమోటాలలో 2 గ్రాముల ఫైబర్ ఉంటుంది. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు కూడా టమోటా రసం తాగవచ్చు. అలాగే బరువు తగ్గాలనుకునే వారు టమాటా రసాన్ని ఆహారంలో చేర్చుకోవచ్చు. టమాటా జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..
ఈ సమయంలో అరటిపండు అస్సలు తినొద్దా.. ఈ నిజాలు తెలిస్తే మీరు షాక్..
ఈ సమయంలో అరటిపండు అస్సలు తినొద్దా.. ఈ నిజాలు తెలిస్తే మీరు షాక్..