Rose Water Benefits: రోజూ రోజ్ వాటర్ ను ఇలా వాడితే.. మీ ముఖం క్లీన్.. మీ లుక్ ఎవర్‌గ్రీన్!

కళ్ల చుట్టూ ఉన్న నల్లటి వలయాలను తొలగించడంలో కూడా రోజ్ వాటర్ సహాయపడుతుంది. దీని కోసం రోజ్‌వాటర్‌ను ముందుగా కాసేపు ఫ్రిజ్‌లో చల్లబరచాలి. చల్లారిన తర్వాత రోజ్ వాటర్‌లో కాటన్ బాల్‌ను నానబెట్టండి. ఆ తర్వాత ఈ దూదిని కళ్లపై కాసేపు ఉంచాలి. ఇది కళ్ల కింద నల్లటి వలయాలను తొలగించడంలో సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు రోజ్ వాటర్ ను ముఖానికి రాసుకోవడం వల్ల

Rose Water Benefits: రోజూ రోజ్ వాటర్ ను ఇలా వాడితే..  మీ ముఖం క్లీన్.. మీ లుక్ ఎవర్‌గ్రీన్!
Rose Water In Skin
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 04, 2023 | 10:56 AM

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే రోజ్ వాటర్ చర్మ సంరక్షణకు గ్రేట్ గా సహాయపడుతుంది. చర్మాన్ని మృదువుగా మార్చడానికి, వృద్ధాప్యం వల్ల ఏర్పడే ముడతలను తొలగించడానికి రోజ్‌ వాటర్‌ సహాయపడుతుంది. అలాగే, ముఖంపై ఉన్న నల్లటి మచ్చలను తొలగించి, ముఖం కాంతివంతంగా మారేందుకు సహకరిస్తాయి. ఇందుకోసం గులాబీ రేకులతో మరిగించిన గోరువెచ్చని నీరు లేదంటే, బయటి నుంచి కొనుగోలు చేసిన రోజ్ వాటర్ కూడా ఉపయోగించవచ్చు. రోజ్‌ వాటర్‌ని క్రమం తప్పకుండా ముఖానికి అప్లై చేయటం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఇది చర్మం pH సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడుతుంది. ముఖం జిడ్డును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. మొటిమలను నివారించడానికి, ముఖంపై నల్ల మచ్చలను తొలగించడానికి రోజ్ వాటర్‌లో ముంచిన దూదిని ఉపయోగించి మీ ముఖాన్ని తుడుచుకోవాలి. రోజ్ వాటర్ లో కాస్త నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు రాకుండా చూసుకోవచ్చు.

చర్మం రంధ్రాలలో పేరుకుపోయిన చెమట, మురికిని తొలగించడానికి కూడా రోజ్ వాటర్ ఉపయోగపడుతుంది. ఇందుకోసం రాత్రి పూట ముఖం కడుక్కున్న తర్వాతే రోజ్ వాటర్ అప్లై చేయడం మంచిది. ఇది ముఖంపై పేరుకుపోయిన మురికిని తొలగించి, చర్మం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ఇవి కూడా చదవండి

కళ్ల చుట్టూ ఉన్న నల్లటి వలయాలను తొలగించడంలో కూడా రోజ్ వాటర్ సహాయపడుతుంది. దీని కోసం రోజ్‌వాటర్‌ను ముందుగా కాసేపు ఫ్రిజ్‌లో చల్లబరచాలి. చల్లారిన తర్వాత రోజ్ వాటర్‌లో కాటన్ బాల్‌ను నానబెట్టండి. ఆ తర్వాత ఈ దూదిని కళ్లపై కాసేపు ఉంచాలి. ఇది కళ్ల కింద నల్లటి వలయాలను తొలగించడంలో సహాయపడుతుంది.

రాత్రి పడుకునే ముందు రోజ్ వాటర్ ను ముఖానికి రాసుకోవడం వల్ల కూడా ఛాయ మెరుగుపడుతుంది. రోజ్ వాటర్ అనేది మేకప్ రిమూవర్లకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడే సహజమైన పదార్ధం. సులభంగా మేకప్‌ను తొలగించడంలో రోజ్‌ వాటర్‌ సహాయపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
కాబోయే భర్త ఎవరో చెప్పకనే చెప్పేసిన రష్మిక. ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్
కాబోయే భర్త ఎవరో చెప్పకనే చెప్పేసిన రష్మిక. ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్