Poppy Seeds: ఈ చిట్టి గసగసాలను అందరూ మర్చిపోయారు.. ఊహించని లాభాలు!
పూర్వం గసగసాలను అనేక వంటల తయారీలో ఉపయోగించేవారు. కానీ ఈ మధ్య కాలంలో ఎవరూ పెద్దగా ఉపయోగించడం లేదు. ఈ చిట్టి గసగసాల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..
పూర్వం మసాలా వంటకాలు చేశారంటే ఖచ్చితంగా ఆ మసాలా తయారీలో గసగసాలు ఉండాల్సిందే. అంతే కాకుండా ఇతర పిండి వంటల్లో కూడా విరివిగా గసగసాలను ఉపయోగించే వారు. గసగసాలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక రకాలైన పోషకాలు, ఔషధ గుణాలు లభిస్తాయి. అందుకే వీటిని కూడా వంటింట్లో ఒక భాగం కింద చేశారు. గసగసాలు వేసి వంటలు చేయడం వలన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆయుర్వేదంలో కొన్ని రకాల మందులు తయారీకి కూడా గసగసాలను యూజ్ చేసేవారు గసగసాల నుండి నల్లమందును తయారు చేసేవారు. ప్రాచీన కాలం నుంచి కూడా గసగసాలను వంటల్లో ఉపయోగించేవారు. కానీ ఆ మధ్య కాలంలో గసగసాలను ఎవరూ పెద్దగా వాడటం లేదు. ఇవి చాలా చిన్నగా ఉంటాయి. వీటని వంటల్లో ఉపయోగించడం వల్ల.. రుచి కూడా పెరుగుతుంది. ఈ గసగసాలను కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా వీటిని తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అనేక పోషకాలు:
గసగసాల్లో క్యాల్షియం, మాంగనీస్, ఫాస్పరస్, జింక్, ఐరన్, మెగ్నీషియం, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. గుండె, జీర్ణ వ్యవస్థ, చర్మం, జుట్టు, నిద్రలేమి, డయాబెటీస్, ఎముకలు, నరాలస సమస్యలను తగ్గించడంలో గసగసాలు ఎంతో ప్రభావవంతంగా పని చేస్తాయి.
నిద్ర సమస్యలు మాయం:
గసగసాలను తీసుకోవడం వల్ల నిద్రకు సంబంధించిన సమస్యలన్నీ కంట్రోల్ అవుతాయి. నిద్రలేమి సమస్యతో బాధ పడేవారు పాలలో గసగసాలు వేసి మరిగించి వడకట్టి రాత్రి పూట తాగితే.. గాఢ నిద్రలోకి వెళ్తారు. ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గుతాయి.
చర్మం – జుట్టు ఆరోగ్యం:
గసగసాలు తినడం వల్ల అందాన్ని కూడా పెంచుకోవచ్చు. ఇందులో ఉండే పోషకాలు చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండేలా హెల్ప్ చేస్తాయి. తరచూ చర్మ, జుట్టు సమస్యలతో బాధపడేవారు గసగసాలను తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
ఎముకలు ఆరోగ్యం:
గసగసాల్లో ఖనిజాలు, క్యాల్షియం పుష్కలంగా లభిస్తాయి. వీటిని తినడం వల్ల ఎముకలు, కండరాలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. భవిష్యత్తులో కూడా ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తవు.
గుండె హెల్దీ:
గసగసాలను తినడం వల్ల గుండె కూడా ఆరోగ్యంగా పని చేస్తుంది. గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో కూడా గసగసాలు చక్కగా పని చేస్తాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..